Friday, April 26, 2024
- Advertisment -
HomeEntertainmentBalagam in OTT | సైలెంట్‌గా రాత్రికి రాత్రే ఓటీటీలోకి వచ్చేసిన బలగం మూవీ.. ఎందులో...

Balagam in OTT | సైలెంట్‌గా రాత్రికి రాత్రే ఓటీటీలోకి వచ్చేసిన బలగం మూవీ.. ఎందులో స్ట్రీమింగ్‌ అవుతుందంటే..

Balagam in OTT | జబర్దస్త్‌ కమెడియన్‌ వేణు యెల్దండి డైరెక్టర్‌గా మారిన తీసిన చిత్రం బలగం. కమెడియన్‌ తీసిన చిత్రం అంటే ఏదో కామెడీ చిత్రమే తీస్తారేమో అని రిలీజ్‌కు ముందు అంతా అనుకున్నారు. కానీ స్వచ్ఛమైన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలతో పాటు కుటుంబ బంధాలను చాలా చక్కగా చూపించాడు. సినిమా చూసిన వాళ్లందరితో శభాష్‌ అని అనిపించుకున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు సారథ్యంలో ఆయన కూతురు నిర్మించిన ఈ సినిమా మార్చి 3న విడుదలై సూపర్‌ హిట్‌గా నిలిచింది. కలెక్షన్ల వర్షం కురిపించింది. అంతేకాదు ఫస్ట్‌ సినిమాతోనే మెగాస్టార్‌ చిరంజీవితో పాటు పలువురు సినీ ప్రముఖులతో డైరెక్టర్‌గా వేణు ప్రశంసలు అందుకున్నాడు. దిల్‌ రాజు బ్యానర్‌లోనే మరో సినిమా డైరెక్ట్‌ చేసే ఛాన్స్‌ కొట్టేశాడు.

బలగం సినిమా విడుదలై మూడు వారాలు దాటినా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ క్రమంలో ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ గురించి ఇటీవల చాలా వార్తలు వచ్చాయి. ఏప్రిల్‌ మొదటి వారంలో ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తుందని ప్రచారం జరిగింది. దీంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమాను బుల్లితెరపై చూద్దామా అని చాలామంది సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి టైమ్‌లో ఎలాంటి సందడి లేకుండా రాత్రికి రాత్రే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. మార్చి 24వ తేదీ అర్ధరాత్రి నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోస్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్‌ అవుతోంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Viral News | మగాళ్లంతా ఇలాంటి భార్యే కావాలని కోరుకుంటారేమో.. అంతమంచి ఆఫర్ ఇస్తే ఎవరైనా కాదనుకుంటారా?

Sri Rama Navami | సీతారాముల కళ్యాణం చూసేందుకు గుడికి వెళ్లి.. బావిలో పడి 12 మంది భక్తులు మృతి

Tamilnadu | తమిళనాడులో పెరుగు కోసం లొల్లి.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సీఎం

IAS Divya S Iyer | వాళ్లు నా బట్టలు విప్పేశారు.. లైంగిక వేధింపులను బయటపెట్టిన కలెక్టర్ దివ్య

Coronavirus | మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్.. ఒక్కరోజులోనే 3వేలకు పైగా కేసులు

World Idli Day | మనం రెగ్యులర్‌గా తినే ఇడ్లీ ఇండియాది కాదా? మరి ఎక్కడి నుంచి వచ్చింది?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News