Saturday, April 20, 2024
- Advertisment -
HomeLifestyleHoroscope & VaasthuDaily Horoscope | రాశిఫలాలు (25-03-2023 )

Daily Horoscope | రాశిఫలాలు (25-03-2023 )

Daily Horoscope | మేషం

ఆర్థిక లావాదేవీలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. కొత్త వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. సోదరులతో ఏర్పడిన ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.

వృషభం

పనుల్లో కాస్త జాప్యం జరిగినా పూర్తి చేస్తారు. నూతన కార్యక్రమాల్లో సన్నిహితుల సాయం పొందుతారు. వివాదాలకు దూరంగా ఉండండి. భాగస్వామ్య వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. ఆర్థికాభివృద్ధి పొందుతారు.

మిథునం

దీర్ఘకాలిక రుణాలు తీరి ప్రశాంతత పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. సోదరుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. సంతానంతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ప్రముఖులను కలుసుకుంటారు.

కర్కాటకం

ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. అనుకోని ప్రయాణాల్లో నూతన మిత్రులు పరిచయం అవుతారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. నూతన వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. క్రయవిక్రయాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వస్తు లాభం పొందుతారు.

సింహం

కుటుంబ సమస్యలు తీరి ఊరట చెందుతారు. క్రయవిక్రయాలు లాభిస్తాయి. పాత మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సాంకేతిక విద్య అవకాశాలు లభిస్తాయి.

కన్య

సన్నిహితుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. విందు వినోదాలు, శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. నూతన పెట్టుబడులకు తగిన సమయం. సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు. వస్తు లాభం కలదు.

తుల

దీర్ఘకాలిక సమస్యలు ఎదురై చికాకు పెడతాయి. సన్నిహితుల నుంచి సహాయసహకారాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. పనులు నిదానంగా సాగుతాయి. క్రయవిక్రయాల్లో ప్రోత్సాహం లభిస్తుంది.

వృశ్చికం

ప్రయాణాల్లో ఎదురైన ఆటంకాలు కొంతవరకు తొలగుతాయి. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. ముఖ్యమైన పనుల్లో మిత్రుల సహాయం పొందుతారు. వివాహయత్నాల్లో తొందరపాటు వద్దు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.

ధనుస్సు

సోదరుల నుంచి లాభం పొందుతారు. ఊహించని ప్రయాణాల్లో నూతన మిత్రులు పరిచయమవుతారు. ప్రముఖులను కలుసుకుంటారు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి లాభసాటిగా సాగుతుంది. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. నూతన వస్తు లాభం కలదు.

మకరం

రుణాలు తీరి ఊరట చెందుతారు. మిత్రుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. జీవిత భాగస్వామి నుంచి ధన, వస్తు లాభాలు పొందుతారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు.

కుంభం

ముఖ్యమైన వ్యవహారాల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్య సమస్యలు కొంతవరకు తీరుతాయి. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. వివాహ, ఉద్యోగ యత్నాలు సాగిస్తారు. స్వల్ప ధనలాభం ఉంది.

మీనం

కుటుంబ సభ్యుల నుంచి సహాయసహకారాలు అందుకుంటారు. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. కోపతాపాలకు దూరంగా ఉండండి. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. సంతానం నుంచి విలువైన సమాచారం అందుతుంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Eyes Twitching | కన్ను కొట్టుకుంటే ఏం జరుగుతుంది..ఎవరికి ఏ కన్ను అదిరితే మంచిది!

Variety Railway Station | ప్రయాణం చేయకపోయిన టికెట్లు కొంటాం అంటున్న దయాల్‌పుర్ గ్రామస్థులు!

Do You Know | రైలు చివరి బోగి మీద X ఎందుకు రాస్తారో తెలుసా?

CPR | గుండెపోటు వచ్చినవాళ్లకు సీపీఆర్ చేస్తే బతికే ఛాన్స్ ఉందా.. ఎలాంటి సమయంలో సీపీఆర్ చేయాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?

Raavi Chettu | రావి చెట్టు నీడ ఇంటి మీద పడితే అంత ప్రమాదామా?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News