Saturday, April 27, 2024
- Advertisment -
HomeEntertainmentAllu Arjun | అల్లు అర్జున్ ట్విట్టర్‌లో నన్ను బ్లాక్ చేశాడు.. వైరల్‌గా మారిన వరుడు...

Allu Arjun | అల్లు అర్జున్ ట్విట్టర్‌లో నన్ను బ్లాక్ చేశాడు.. వైరల్‌గా మారిన వరుడు హీరోయిన్ ట్వీట్

Allu Arjun | స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సినిమాల్లో వరుడు చిత్రం అందరికీ గుర్తు ఉండే ఉంటుంది కదా. ఆ సినిమాతో హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చిన భాను శ్రీ మెహ్రా గురించి మాత్రం అంతగా తెలియకపోయి ఉండవచ్చు. ఎందుకంటే బన్నీ కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ గా వరుడు మూవీ నిలిచిందని చెప్పుకొవచ్చు. దాంతో ఈ సినిమాలో నటించిన భాను శ్రీ కి సరైన అవకాశాలు రాలేదు. ఆ తరువాత ఆమె కొన్ని చిన్న చిన్న సినిమాల్లో చేసినప్పటికీ కూడా అవి కూడా అంతగా ఆడలేదు. దాంతో ఆమె గురించి తెలుగు ఇండస్ట్రీ పూర్తిగా మార్చిపోయిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం భాను శ్రీ యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ.. కంటెంట్ క్రియేటర్‌గా మారింది. చాలా రోజులుగా సైలెంట్‌గా ఉన్న భానుశ్రీ ఇప్పుడు ఉన్నట్టుండి వార్తల్లో నిలిచింది.

భానుశ్రీ ఉన్నట్టుండి వైరల్ కావడానికి కారణం.. అల్లు అర్జున్ తనను ట్విట్టర్‌లో బ్లాక్ చేశాడని ట్వీట్ చేయడం. బన్నీ తనను బ్లాక్ చేసిన స్క్రీన్ షాట్‌ను భానుశ్రీ మెహ్రా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘ నేను అల్లు అర్జున్‌తో వరుడులో నటించానని గుర్తుంచుకోండి. ఇప్పటికీ సరైన అవకాశాలు రావట్లేదు. కానీ ఈ ఇబ్బందుల్లోనూ సరదాగా ఎలా ఉండాలో నేర్చుకున్నాను. ముఖ్యంగా ఇప్పుడు అల్లు అర్జున్ నన్ను ట్విట్టర్‌లో బ్లాక్ చేసినా కూడా’ అని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ వైరల్ అవ్వడంతో బన్నీ ఆమెను ఎందుకు బ్లాక్ చేశాడా? అని ఫ్యాన్స్ ఆరాతీయడం మొదలు పెట్టారు. అయితే కొంత సమయం తర్వాత బన్నీ తనను అన్ బ్లాక్ చేశాడని భానుశ్రీ తెలిపింది.

‘గ్రేట్ న్యూస్, అల్లు అర్జున్ నన్ను అన్‌బ్లాక్ చేశాడు. నా కెరీర్ వైఫల్యాలకు నేను అతనిని ఎప్పుడూ నిందించలేదని స్పష్టం చేస్తున్నా’ అని ట్వీట్ చేసింది. అల్లు అర్జున్ కు థ్యాంక్స్ చెప్పింది. ఈ ట్వీట్ కాస్త వైరల్ అవ్వడంతో.. అసలు కథేంటని బన్నీ ఫ్యాన్స్ గూగుల్‌లో సెర్చ్ చేయడం మొదలెట్టారు. హీరోయిన్ అవకాశాలు లేకపోవడంతో ప్రస్తుతం ఆమెకు పని లేదు. ఓ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. అందులో వీడియోలు పోస్ట్ చేసిన ప్రతిసారీ సోషల్ మీడియాలో షేర్ చేయడం… ఆ లింక్స్ అల్లు అర్జున్, ఇతర హీరోలకు ట్యాగ్ చేస్తున్నారు. ప్రతిసారీ వీడియో లింక్స్ ట్యాగ్ చేసి ఉండటంతో ఆమెను అల్లు అర్జున్ బ్లాక్ చేసి ఉండవచ్చని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ట్విట్టర్ ఉందని ప్రతి వీడియో ట్యాగ్ చేస్తూ ఉంటే బ్లాక్ చేయడా? అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ భాను శ్రీ మెహ్రా తీరును ఎండగట్టడం స్టార్ట్ చేశారు. కొంత మంది అయితే సోషల్ మీడియా వేదికగా ఆమెపై ఎటాక్ చేశారు.

ఇంతా చేసిన భాను శ్రీ చివరకు నైట్ అయ్యే సరికి.. ఈ రోజంతా కూడా వింతగా జరిగిందని, అంతా రోలర్ కోస్టర్ రైడ్‌లా అనిపించిందని, తానేమీ అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ను హర్ట్ చేసేందుకు ఆ ట్వీట్ వేయలేదని చెప్పుకొచ్చింది. నేను కూడా బన్నీకి ఫ్యాన్‌నే. నా కెరీర్‌ను చూసి నేను నవ్వుకుంటాను.. నా బాధలు చూసి నేనే నవ్వుకుంటున్నాను.. ప్రేమను పంచుదాం.. ద్వేషాన్ని వద్దు అంటూ భాను శ్రీ ట్వీట్ వేసింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Allu Arjun | అల్లు అర్జున్ ట్విట్టర్‌లో నన్ను బ్లాక్ చేశాడు.. వైరల్‌గా మారిన వరుడు హీరోయిన్ ట్వీట్

Viral News | డంప్‌ యార్డులో అగ్ని ప్రమాదం.. రూ.100 కోట్ల ఫైన్‌ వేసిన ఎన్జీటీ

Viral News | అత్తారిల్లు చాలా దూరంగా ఉంది.. నేను పుట్టింటికి వెళ్లిపోతా.. పెళ్లయిన కాసేపటికే వరుడికి షాకిచ్చిన వధువు

Naveen Murder Case | నవీన్‌ మర్డర్‌ కేసులో కీలక మలుపు.. జైలు నుంచి నిహారిక విడుదల

Naatu Naatu | నాటు నాటు పెడితే కానీ.. నా కొడుకు అన్నం తినడం లేదు.. కరీనా కపూర్‌ సెన్సేషనల్‌ కామెంట్స్‌

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News