Home Latest News India Vs Srilanka | శ్రీలంకపై భారత్ ఘన విజయం.. సచిన్ రికార్డు సమం చేసిన...

India Vs Srilanka | శ్రీలంకపై భారత్ ఘన విజయం.. సచిన్ రికార్డు సమం చేసిన విరాట్ కోహ్లీ

Image Source: @IndianCricketTeam facebook

India Vs Srilanka | గువహటి వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. 67 పరుగుల తేడాతో రోహిత్ సేన గెలుపొందింది. 374 పరుగులు విజయలక్ష్యంతో బరిలో దిగిన శ్రీలంకను భారత బౌలర్లు ఆదిలోనే దెబ్బతీశారు. అయితే చివరి బంతి వరకు శనక ( 108 ) శ్రీలంక గెలుపు కోసం పోరాడాడు. కానీ 50 ఓవర్లు ముగిసే సరికి 306 పరుగులు మాత్రమే చేయగలిగింది. మొదట టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంకకు భారత బ్యాటర్లు చుక్కలు చూపించారు. రోహిత్ శర్మ (83), శుభ్ మన్ గిల్ (70) తొలి వికెట్‌కు 143 పరుగులు జోడించారు . కోహ్లీ 80 బంతుల్లో 11 ఫోర్లు , ఒక సిక్సర్ తో సెంచరీ చేయడంతో భారత్ 373 పరుగులు చేయగలిగింది. వ‌న్డేల్లో కోహ్లీకి ఇది 45వ‌ శ‌త‌కం. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 73వ సెంచ‌రీ కావడం విశేషం. నిర్ణీత 50 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 373 పరుగులు చేసి శ్రీలంక ముందు భారీ లక్ష్యాన్ని వుంచింది.

విరాట్‌ కోహ్లీ, రాహుల్ జోరు చూస్తే టీమిండియా 400 స్కోర్ చేసేలా క‌నిపించింది. కానీ చివరి ఓవర్లు శ్రీలంక కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసింది. ర‌జిత బౌలింగ్‌లో రాహుల్ బౌల్డ్ కావడం, హార్దిక్ పాండ్యా 14, అక్ష‌ర్ ప‌టేల్ 9 పరుగులు చేసి అవుట్ అయ్యారు. చివ‌ర్లో దూకుడుగా ఆడే క్ర‌మంలో కోహ్లీ (113) ఏడో వికెట్‌గా వెనుదిరిగాడు. దీంతో 373 పరుగులు చేయగలిగింది. అయితే ష‌న‌క బౌలింగ్‌లోనే శుభ్‌మన్‌ గిల్, రోహిత్‌ శర్మ ఇద్దరూ ఔటయ్యారు. శ్రీలంక బౌలర్లలో ర‌జిత మూడు వికెట్లు, మ‌ధుష‌న‌క‌, ధ‌నుంజ‌య‌, ష‌న‌క, క‌రుణ‌ర‌త్నే త‌లా ఒక వికెట్ తీశారు.

సచిన్‌ రికార్డు సమం..

తొలివన్డేలో చెలరేగి ఆడిన విరాట్ కోహ్లీ 80 బంతుల్లో సెంచరీ చేసి రికార్డు బద్దలు కొట్టాడు. కోహ్లీకి వ‌న్డేల్లో ఇది 45వ సెంచరీ, అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 73వ సెంచరీ. స్వదేశంలో సచిన్‌ 20 సెంచరీలు చేశాడు. ఇప్పుడా రికార్డును కోహ్లీ సమం చేశాడు. తక్కువ ఇన్నింగ్స్‌లో 20 సెంచరీలు కొట్టి కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. కేవలం 99 ఇన్నింగ్స్‌ల్లోనే కోహ్లీ ఈ మైలురాయిని అందుకున్నాడు. సచిన్‌ మాత్రం 20 సెంచరీలు చేయడానికి 160 ఇన్సింగ్స్‌లు ఆడాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Virat Kohli | కోహ్లీ మళ్లీ అలాంటి షాట్‌లు ఆడలేడు: పాక్‌ బౌలర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

MMA Fighter Victoria | 18 ఏళ్లకే మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ హఠాన్మరణం.. కారణమేంటో?

Surya Kumar Yadav | భారతీయుడు కావడం అతని అదృష్టం.. మా దేశంలో పుట్టి ఉంటే.. పాక్ మాజీ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు

India Vs Srilanka | 45 బంతుల్లో సూర్య కుమార్ సెంచరీ.. లంక బౌలర్లను శతక్కొట్టాడు

Exit mobile version