Home Latest News Gautham Gambhir | శ్రీలంక చెత్త బౌలింగ్‌ వల్లే కోహ్లీ సెంచరీ చేశాడు.. సచిన్‌తో కోహ్లీని...

Gautham Gambhir | శ్రీలంక చెత్త బౌలింగ్‌ వల్లే కోహ్లీ సెంచరీ చేశాడు.. సచిన్‌తో కోహ్లీని పోల్చడంపై గంభీర్‌ సంచలన వ్యాఖ్యలు

Image Source: Gautam Gambhir facebook

Gautham Gambhir | శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో విరాట్‌ కోహ్లీపై చెలరేగిపోయాడు. 80 బంతుల్లోనే సెంచరీ చేసి వన్డేల్లో 45 శతకాలు పూర్తి చేసుకున్నాడు. మాస్టర్ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ రికార్డుకు చేరువయ్యాడు. సచిన్‌ తన కెరీర్‌లో అత్యధికంగా వన్డేల్లో 49 సెంచరీలు చేశాడు. కోహ్లీ మరో 5 సెంచరీలు చేస్తే సచిన్‌ పేరుతో ఉన్న అత్యధిక సెంచరీల రికార్డు బ్రేక్‌ అవుతుంది. దీనిపై అభిమానులు, తాజా, మాజీ క్రికెటర్లు విరాట్‌ కోహ్లీని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. సచిన్‌ రికార్డును కోహ్లీ బ్రేక్‌ చేసేస్తాడు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపై భారత మాజీ క్రికెటర్‌, ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ మండిపడ్డారు.

భారత్‌ క్రికెట్‌ దేవుడిగా కొలిచే సచిన్‌ టెండూల్కర్‌తో అసలు కోహ్లీని ఏ విధంగా పోలుస్తారని గంభీర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.. అసలు ఇప్పటి క్రికెట్‌కు ఒకప్పటి క్రికెట్‌కు చాలా తేడాలు ఉన్నాయని అన్నారు. క్రికెట్‌లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయని,

ఒకరి రికార్డులను మరొకరితో పోల్చడం ఎట్టి పరిస్థితుల్లోనూ సరైనది కాదన్నారు. ” వన్డే ఫార్మాట్‌లో సచిన్ టెండూల్కర్ 49 వన్డే సెంచరీల కంటే విరాట్ ఎక్కువ సెంచరీలే చేస్తాడు. కానీ ఇప్పుడు, అప్పుడు నిబంధనలు ఒకేలా లేవు. గతంలో ఒకే కొత్త బంతిని తీసుకొనే అవకాశం ఉండేది. ఇప్పుడు రెండు బంతులు తీసుకుంటున్నారు. అలాగే 30 గజాల సర్కిల్‌లో ఐదుగురు ఫీల్డర్లు ఉంటున్నారు. రెండు తరాలను పోల్చలేం ” అని గంభీర్‌ అభిప్రాయపడ్డారు.

కోహ్లీ అధ్భుతమైన ఆటగాడే.. అందులో సందేహం లేదంటూనే శ్రీలంక చెత్త బౌలింగ్‌ వేయడం వల్లే మొదటి వన్డేలో సెంచరీ చేయగలిగాడని గంభీర్‌ ఆరోపించారు. “టీమిండియా టాప్‌-3 బ్యాటర్లు ఎంత తేలికగా బ్యాటింగ్‌ చేసేసారో మనందరం చూశాం. రోహిత్‌, కోహ్లీతో పాటు కొత్త కుర్రాడు శుభమన్‌ గిల్‌ కూడా చాలా స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేశాడు. ఈ వన్డేలో లంక బౌలింగ్ చాలా నిరాశకు గురి చేసింది” అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అయితే గంభీర్‌ వ్యాఖ్యలపై కోహ్లీ అభిమానులు మండిపడుతున్నారు. అసలు కోహ్లీని విమర్శించకుంటే గంభీర్‌కు పొద్దుగడవదని, అందుకే ఇలా తన అసూయను బయటపెట్టారని కామెంట్లు చేస్తున్నారు. అసలు గంభీర్‌ వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

ICC ODI Rankings | ఐసీసీ వన్డే ర్యాంకుల్లో దూసుకెళ్లిన విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ.. టాప్‌ 10లో బౌలర్లకు దక్కని చోటు

MMA Fighter Victoria | 18 ఏళ్లకే మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ హఠాన్మరణం.. కారణమేంటో?

Virat Kohli | కోహ్లీ మళ్లీ అలాంటి షాట్‌లు ఆడలేడు: పాక్‌ బౌలర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

India Vs Srilanka | శ్రీలంకపై భారత్ ఘన విజయం.. సచిన్ రికార్డు సమం చేసిన విరాట్ కోహ్లీ

Exit mobile version