Friday, April 26, 2024
- Advertisment -
HomeEntertainmentVarisu collections | పాజిటివ్‌ టాక్‌ తో దూసుకుపోతున్న వారిసు.. మూడు రోజుల్లో రూ. 100...

Varisu collections | పాజిటివ్‌ టాక్‌ తో దూసుకుపోతున్న వారిసు.. మూడు రోజుల్లో రూ. 100 కోట్ల లెక్షన్లు

Varisu collections | తలపతి విజయ్‌ హీరోగా నటించిన వారసుడు సినిమా సంక్రాంతి కానుకగా విడుదలైంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళ్తోంది. చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలు రావడంతో తెలుగులో ఆలస్యంగా రిలీజైంది. కానీ తమిళనాట ఈ చిత్రం ఈ నెల 11వ తేదీనే విడుదలైంది. మూడు రోజుల్లోనే రూ. 100 కోట్ల కలెక్షన్లు సాధించింది. మరోవైపు అజిత్‌ తునివు చిత్రానికి పోటీగా వచ్చిన ఈ సినిమా అక్కడ హిట్‌ టాక్‌తో దూసుకెళ్తోంది. అదిరిపోయే కలెక్షన్లను రాబడుతోంది.

వారిసు సినిమా ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు రూ.35 కోట్ల కలెక్షన్స్‌ను రాబట్టినట్టు తెలుస్తోంది. ఒక్క తమిళనాడులోనే రూ. 27 కోట్ల కలెక్షన్స్‌ సాధించింది. కర్ణాటకలో రూ.5.60 కోట్లు, కేరళలో రూ.4.5 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. వారసుడు సినిమా వాయిదా పడటంతో తెలుగు రాష్ట్రాల్లో తమిళ వర్షన్‌ను రిలీజ్‌ చేయలేదు. లేేదంటే ఏపీ, తెలంగాణలో మరో 5 కోట్లు వచ్చేవి. అప్పుడు రూ.40 కోట్లు దాటేవని ట్రేడ్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. ఆ తర్వాతి రెండు రోజుల్లో భారీగానే కలెక్షన్లు రాబట్టింది. 3 రోజుల్లో వంద కోట్ల మార్కు దాటింది.

అజిత్‌ తునివు, వారిసు రెండు ఒక్కటే రోజు రిలీజైనప్పటికీ విజయ్‌ సినిమాకే ఎక్కువ కలెక్షన్స్‌ వస్తున్నాయని ట్రేడ్‌వర్గాలు చెబుతున్నాయి. ఫ్యామిలీ ఆడియెన్స్‌లో పాజిటివ్‌ టాక్‌ రావడమే దీనికి కారణం. చాలా కాలం తర్వాత విజయ్‌ నటించిన పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు.

తండ్రిని ద్వేషించే ఓ కొడుకు తన కుటుంబానికి ఎదురైన సమస్యలను చక్కదిద్ది ఆ తండ్రి కలను ఎలా నెరవేర్చాడనే కథనంతో వంశీ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో విజయ్‌ కి జోడిగా రష్మిక నటించింది. దిల్‌రాజు ఈ సినిమాను నిర్మించారు. త‌మిళంలో ఆయ‌న నిర్మించిన తొలి సినిమా ఇదే కావ‌డం గ‌మ‌నార్హం.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Kushboo | జయసుధ కోసం వారసుడు సినిమా నుంచి కుష్బూను తప్పించారా?

Jayasudha | అమెరికన్ బిజినెస్‌మ్యాన్‌తో జయసుధ మూడో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన సహజనటి

Veerasimhareddy first day collections | తొలిరోజే హాఫ్ సెంచరీ కొట్టిన బాలకృష్ణ.. కెరీర్ హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా రికార్డు

Waltair Veerayya Review | వాల్తేరు వీరయ్య రివ్యూ.. చిరంజీవి, రవితేజ పూనకాలు తెప్పించారా?

Veerasimha reddy Review | వీరసింహారెడ్డి రివ్యూ.. బాలయ్య మాస్ ఫార్ములా వర్కవుట్ అయ్యిందా?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News