Home Entertainment Nidhhi Agerwal | ప్రభాస్‌ సినిమా నుంచి నిధి అగర్వాల్‌ను తప్పించారా? కారణమేంటి?

Nidhhi Agerwal | ప్రభాస్‌ సినిమా నుంచి నిధి అగర్వాల్‌ను తప్పించారా? కారణమేంటి?

Nidhhi Agerwal | పాన్‌ ఇండియా స్టార్‌గా మారిన తర్వాత ప్రభాస్‌ చాలా బిజీ అయిపోయాడు. ఇప్పుడు ఆయన చేతిలో బోలెడన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో మారుతి దర్శకత్వంలో వస్తున్న సినిమాపై అందరి ఇంట్రెస్ట్‌ ఉంది. పాన్‌ ఇండియా స్టార్‌గా ఇమేజ్‌ తెచ్చుకున్న ప్రభాస్‌.. మారుతి లాంటి చిన్న దర్శకుడితో సినిమాను కమిట్‌ అవ్వడంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని ఆసక్తి చూపిస్తున్నారు. హారర్‌ జోనర్‌లో సాగే ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. పైగా ఇందులో ప్రభాస్‌ డ్యుయెల్‌ రోల్‌లో నటిస్తున్నాడనే టాక్‌ కూడా నడుస్తోంది. ఈ క్రమంలో ఈ సినిమా గురించి ఒక వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ప్రభాస్ – మారుతి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా కోసం మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌, రాధే శ్యామ్‌ ఫేమ్‌ రిద్ది కుమార్‌ ను హీరోయిన్లుగా ఎంపిక చేసినట్టుగా చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే వీరిలో నిధి అగర్వాల్‌ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టుగా తాజాగా ప్రచారం జరుగుతోంది. చాలా కారణాలతో నిధి అగర్వాల్‌ను డైరెక్టర్‌ మారుతి సెలెక్ట్‌ చేశాడట. కానీ ఇటీవల ఆమె లుక్‌ టెస్ట్‌ చేయగా.. ప్రభాస్‌ పాత్ర పక్కన సెట్‌ అవ్వడం లేదట. అందుకే నిధి అగర్వాల్‌ను ఈ సినిమా నుంచి తప్పించారని టాక్‌ నడుస్తోంది.

నిధి అగర్వాల్‌ ప్రాజెక్ట్‌ నుంచి వెళ్లిపోవడంతో ఇప్పుడు మరో హీరోయిన్‌ను వెతికేపనిలో మారుతి పడిపోయాడట. నిధి అగర్వాల్ స్థానంలో మెహ్రీన్‌ ఫిర్జాదాను తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటివరకు అఫిషియల్‌ అనౌన్స్‌మెంట్‌ ఏదీ లేదు. మరి సోషల్‌ మీడియాలో జరుగుతున్న ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియాల్సి ఉంది. అన్నట్టు ప్రభాస్‌ – మారుతి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాకు రాజా డీలక్స్‌ టైటిల్‌ అనుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. కానీ దీనిపై కూడా ఇంకా క్లారిటీ రాలేదు.

సవ్యసాచి సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన నిధి అగర్వాల్‌.. ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమాతో బంపర్‌ హిట్‌ అందుకుంది. ఆ తర్వాత తమిళంలో శింబు సరసన ఈశ్వరన్‌తో బ్లక్‌బస్టర్‌ హిట్‌ కొట్టింది. ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ సరసన హరిహర వీరమల్లు సినిమాతో బిజీగా ఉంది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Laththi Review | లాఠీ సినిమా రివ్యూ.. ఈసారైన విశాల్ హిట్ కొట్టాడా?

Keerthi bhat | ఈ స్థాయికి రావడానికి ఏదో చేసి ఉంటా అనుకున్నాడు.. అనుమానంతో బాయ్‌ఫ్రెండ్‌ వదిలేశాడు.. బిగ్‌బాస్‌ ఫేమ్‌ కీర్తి ఎమోషన్‌

Kannada actor darshan | తనపై చెప్పు విసరడంపై తొలిసారి స్పందించిన కన్నడ స్టార్ హీరో దర్శన్

Anupama Parameswaran | యాక్టింగ్‌కు లాంగ్‌ గ్యాప్‌ ఇవ్వనున్న అనుపమ.. ఏం చేయబోతుందో తెలుసా

Exit mobile version