Home News AP Junior NTR | ఆంధ్రప్రదేశ్‌కు జూనియర్‌ ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలి.. తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి సంచలన...

Junior NTR | ఆంధ్రప్రదేశ్‌కు జూనియర్‌ ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలి.. తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు

Junior NTR | చంద్రబాబుకు తెలుగుదేశం పార్టీ మీద, ఎన్టీఆర్‌ మీద ప్రేమ ఉంటే జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr. NTR) ను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిని చేయాలంటూ తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రలో నీ కొడుకు లోకేష్‌ను ఎవరూ కోరుకోవడం లేదంటూ ఎర్రబెల్లి ఎద్దేవా చేశారు. తెలంగాణలో షర్మిల, కేఏ పాల్ అయినట్టే చంద్రబాబు అవుతాడంటూ ఎద్దేవా చేశారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఫెయిల్ అయి, ఎక్కడా పొద్దుపోక బీజేపీతో చంద్రబాబు ములాఖత్‌ అయ్యాడని ఎర్రబెల్లి ఆరోపించారు. తెలంగాణలో చిచ్చు పెట్టే పని మొదలుపెట్టాడని ఫైర్‌ అయ్యారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబుది కాదంటూ సంచలన ఆరోపణలు చేశారు. నిజంగా చంద్రబాబుకు టీడీపీపై, ఎన్టీఆర్ పై ప్రేమ ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్ ఎన్టీఆర్‌ను టీడీపీ అధ్యక్షుడుగా చేసి, ముఖ్యమంత్రి చేయాలని అన్నారు. అప్పుడే చంద్రబాబు చిత్తశుద్ధి ఏంటో తెలుస్తుందని అన్నారు. లేకపోతే తెలంగాణలో షర్మిల, కేఏ పాల్ అయినట్టే చంద్రబాబు అవుతారని ఎద్దేవా చేశారు. హనుమకొండలో “రైతు కల్లాలు కేంద్ర ప్రభుత్వ వైఖరి” పై నిర్వహించిన మీడియా సమావేశంలో ఎర్రబెల్లి ఈ వ్యాఖ్యలు చేశారు.

TDP చంద్రబాబుది కాదు

టీడీపీ తెలంగాణలో, ఆంధ్రాలో ఫెయిల్ అయిందని ఎర్రబెల్లి అన్నారు. చంద్రబాబుకు ఎక్కడా పొద్దుపోతలేదు కాబట్టే తెలంగాణకు వచ్చి గతంలో చిచ్చుపెట్టాలని చూశాడని అన్నారు. అప్పుడు కాంగ్రెస్సోలను కలుపుకొని ప్రయత్నం చేసినా విఫలమయ్యాడని, అందుకే ఇప్పుడు బీజేపీ వాళ్లతో ములాఖత్ అయ్యాడని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు పార్టీ కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. లుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు పార్టీ అని, చంద్రబాబు మధ్యలో వచ్చారని అన్నారు. ఎన్టీఆర్‌ పేద ప్రజలకు చేసిన సేవ ఇప్పటికీ రెండు రాష్ట్రాల్లో మర్చిపోలేదన్నారు. పేదలకు సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది చంద్రబాబు కాదు ఎన్టీఆర్ అంటూ వ్యాఖ్యానించారు.

నందమూరి కుటుంబాన్ని చంద్రబాబు మోసం చేసిండు..

” ఎన్టీఆర్‌ను స్ఫూర్తి తీసుకొని, ఎన్టీ రామారావు దగ్గర పని తీసుకొని, ఎన్టీఆర్‌తో బతికినవు. ఆ తర్వాత నందమూరి కుటుంబాన్ని మోసం చేశావు.నీ కొడుకుని ఆంధ్రలో పెట్టి, హరికృష్ణ బిడ్డను తెలంగాణలో పెట్టావు. అది కక్ష సాధింపు కాదా? జూనియర్ ఎన్టీఆర్‌ను ఏపీలో కోరుకుంటున్నారు. టీడీపీ అధ్యక్షునిగా కోరుకుంటున్నారు. లోకేష్‌ని కోరుకోవడం లేదు. ఆంధ్రలో జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. నీ కొడుకు కావాలని కోరుకోవట్లేదు. కానీ లోకేష్‌ని ఎంకరేజ్ చేస్తున్నావ్. నీకు తెలుగుదేశం పార్టీ మీద విశ్వాసం ఉన్నా.. ఎన్టీఆర్ మీద ప్రేమ ఉన్నా జూనియర్ ఎన్టీఆర్‌ని తీసుకొచ్చి అక్కడ ముఖ్యమంత్రిని చేయి. అప్పుడు తెలుగుదేశం మీద ఎంత విశ్వాసం ఉంది? ఎన్టీ రామారావు మీద ఎంత కృతజ్ఞత ఉందనేది తెలుస్తుంది. లేకపోతే షర్మిల, ఏమైందో తెలుసు.. పాల్ ఏమైయ్యాడో తెలుసు… సేమ్ అదే టైపులో చంద్రబాబు అయితడు” అంటూ తీవ్రస్థాయిలో చంద్రబాబుపై ఎర్రబెల్లి ధ్వజమెత్తారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Covid situation in china | చైనాలో పరిస్థితి అంత దారుణంగా ఉందా? కరోనా అంతమయ్యేది ఎప్పుడు.. నిపుణుల అభిప్రాయమిదే!

Corona cases in India | భారత్‌లో పెరుగుతున్న ఒమిక్రాన్ BF.7 కేసులు.. అప్రమత్తమైన వైద్య మండలి.. కీలక ఆదేశాలు జారీ

Corona Nasal Spray | గుడ్‌న్యూస్‌ చెప్పిన భారత్‌ బయోటెక్‌.. కరోనా ఇంజెక్షన్‌, నాజల్‌ స్ప్రేలో ఏది బెటర్‌?

Harish Rao | ఒమిక్రాన్‌ బీఎఫ్‌.7పై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్‌.. హరీశ్‌రావు ఉన్నతస్థాయి సమీక్ష

Exit mobile version