Home Entertainment TP Gajendran | ప్రముఖ కమెడియన్‌, సీఎం స్టాలిన్‌ స్నేహితుడు కన్నుమూత.. ఆస్పత్రి నుంచి ఇంటికి...

TP Gajendran | ప్రముఖ కమెడియన్‌, సీఎం స్టాలిన్‌ స్నేహితుడు కన్నుమూత.. ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చిన మర్నాడే..

TP Gajendran | ప్రముఖ కమెడియన్, తమిళనాడు సీఎం స్టాలిన్‌ క్లోజ్‌ ఫ్రెండ్‌ టీపీ గజేంద్రన్‌ (68) కన్నుమూశాడు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న గజేంద్రన్‌ తన నివాసంలో తుది శ్వాస విడిచారు. కొద్దిరోజులగా కిడ్నీ సంబంధిత సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న ఆయన శనివారమే డిశ్చార్జి అయ్యి ఇంటికి వచ్చాడు. ఆ మర్నాడే ఆయన మరణించడం అందర్నీ కలిచివేసింది. ఈ విషయం తెలిసిన సీఎం స్టాలిన్‌ గజేంద్రన్‌ ఇంటికి చేరుకుని నివాళులర్పించారు.

టీపీ గజేంద్రన్‌, ఎంకే స్టాలిన్‌ ఇద్దరూ క్లోజ్‌ ఫ్రెండ్స్‌. ఇద్దరూ ఒకే కాలేజీలో చదువుకున్నారు. కాలేజీ డేస్‌ తర్వాత స్టాలిన్‌ రాజకీయాలతో బిజీగా మారితే.. గజేంద్రన్‌ సినిమాలో బిజీ అయ్యాడు. 1985లో చిదంబర రహస్యం సినిమాతో గజేంద్రన్ తన సినీ కెరీర్ ప్రారంభించాడు. 1988లో వీడు మనైవి మక్కల్‌ సినిమాతో దర్శకుడిగా మారాడు. బడ్జెట్‌ పద్మనాభం, చీనా తానా, మిడిల్‌ క్లాస్‌ మాధవన్‌, బండ పరమశివం వంటి చిత్రాలను తెరకెక్కించాడు. వందకు పైగా తమిళ చిత్రాల్లో నటించాడు. మన్మథ, చంద్రముఖి, కథానాయకుడు, పిస్తా సహా పలు తమిళ డబ్బింగ్ సినిమాలతో తెలుగు వాళ్లకు కూడా సుపరచితమే. చివరగా యోగిబాబు పన్ని కుట్టి చిత్రంలో గజేంద్రన్‌ కనిపించాడు.

Exit mobile version