Tuesday, July 23, 2024
- Advertisment -
HomeEntertainmentSai Pallavi | మేకప్ ఎందుకు వేసుకోదో అసలు సీక్రెట్ బయటపెట్టిన సాయిపల్లవి

Sai Pallavi | మేకప్ ఎందుకు వేసుకోదో అసలు సీక్రెట్ బయటపెట్టిన సాయిపల్లవి

Sai Pallavi | హీరోయిన్ అంటే అందం కాదు.. అభినయం అని చాటిచెప్పే ఈ తరం నటీమణుల్లో సాయిపల్లవి ముందుంటుంది. ఎన్ని డబ్బులు ఇస్తామని ఆఫర్ చేసినా గ్లామర్ షోకి వెళ్లకుండా.. ప్రాధాన్యం ఉన్న పాత్రలను చేస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. లేడీ పవర్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అంత గుర్తింపు ఉన్నప్పటికీ సెలెక్టివ్‌గా కథలు ఎంచుకుంటూ వెళ్తోంది. నచ్చిన కథలు దొరక్కపోతే ఖాళీగా అయినా ఉంటా తప్ప ఏది పడితే అది ఒప్పుకోను అన్న వ్యక్తిత్వంతో ముందుకెళ్తోంది. అందుకే గత ఏడాది విడుదలైన గార్గి తర్వాత ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా ఒప్పుకోలేదు. చాలారోజులుగా మీడియాకు కూడా దూరంగా ఉన్న సాయిపల్లవి.. రీసెంట్‌గా ముంబైలో జరిగిన ఓ ఈవెంట్‌కు హాజరైంది. క్రిటిక్ చాయిస్ అవార్డు ఫంక్షన్‌లో గార్గి సినిమాకు గానూ ఉత్తమ నటిగా అవార్డు దక్కించుకుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన సాయిపల్లవి.. తాను మేకప్ ఎందుకు వేసుకోదో సీక్రెట్ బయటపెట్టింది.

చిన్నతనం నుంచి చాలా ఇన్‌సెక్యూర్‌గా ఫీలయ్యేదాన్ని అని సాయిపల్లవి చెప్పింది. వాయిస్ బాగోదు.. ఫేస్ బాగోదు.. మొహమంతా మొటిమలు ఉంటాయని తెలిపింది. ఇవన్నీ నన్ను భయపెట్టేవని పేర్కొంది. ఫేస్‌పై పింపుల్స్ ఉండటంతో మేకప్ కూడా వేసుకోవాలని అనిపించేది కాదని తెలిపింది. కానీ తనలో ఏదో ఉందని అనుకున్న డైరెక్టర్.. తనకు ప్రేమమ్ సినిమాలో అవకాశం ఇచ్చాడని చెప్పింది. ఆ సినిమా టైమ్‌లో కూడా మేకప్ వేసుకోలేదని తెలిపింది. నా మొహాన్ని చూసి అసలు ఆదరిస్తారా? లేదా అని కూడా భయపడ్డా.. కానీ ఆ సినిమా విడుదలయ్యాక తన ఆత్మవిశ్వాసం పెరిగిందని చెప్పింది.

ప్రేమమ్ సినిమాలో తెరపై తనను చూసి ప్రేక్షకులు ఇస్టపడ్డారని.. తన సీన్స్‌కు ఈలలు వేస్తూ, చప్పట్లు కొట్టారని గుర్తుచేసుకుంది. ఆ ఆదరణ చూశాక మన అందాన్ని ప్రేమించరు.. మనం బయట ఎలా ఉంటున్నమనే దానికే ఇంపార్టెన్స్ ఇస్తారని అర్థం చేసుకున్నా అని తెలిపింది. అదే తనలో కాన్ఫిడెంట్ పెంచిందని చెప్పింది. అందుకే అప్పట్నుంచి చాలా సినిమాల్లో మేకప్ వేసుకోలేదని.. డైరెక్టర్స్ కూడా మేకప్ వేసుకోవాలని బలవంత పెట్టలేదని తెలిపింది. ఇలా ఉన్నా కాబట్టి చాలామంది తనను ఇష్టపడుతున్నారని పేర్కొంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Janhvi Kapoor | మాజీ సీఎం మనవడితో జాన్వీ కపూర్ డేటింగ్.. వీడియో వైరల్

Balagam | ఫస్ట్ మూవీతోనే కమెడియన్ వేణు అదరగొట్టేశాడుగా.. బలగం మూవీకి రెండు అంతర్జాతీయ అవార్డులు

Manchu Vishnu vs Manoj | మంచు విష్ణు, మనోజ్ గొడవలో బిగ్ ట్విస్ట్.. అందరినీ పిచ్చోళ్లను చేసిన మంచు బ్రదర్స్

Gwyneth Paltrow | ఏడేళ్లు కోర్టు చుట్టూ తిరిగి ఒక్క డాలర్‌ పరిహారం పొందిన ఐరన్‌ మ్యాన్‌ హీరోయిన్‌.. కేసు గెలిచినందుకు ఫుల్‌ హ్యాపీ

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News