Tuesday, June 6, 2023
- Advertisment -
HomeEntertainmentManisha Koirala | రజినీకాంత్ సినిమా వల్ల నా కెరీర్ మొత్తం ముగిసిపోయింది.. మనీషా కోయిరాలా...

Manisha Koirala | రజినీకాంత్ సినిమా వల్ల నా కెరీర్ మొత్తం ముగిసిపోయింది.. మనీషా కోయిరాలా సెన్సేషనల్ కామెంట్స్

Manisha Koirala | 90వ దశకంలో కుర్రకారు మతులను పోగొట్టిన హీరోయిన్లలో ఒకరు మనీషా కొయిరాలా. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన బొంబాయి సినిమాతో సౌత్‌లో అందరి ఫేవరేట్‌గా మారింది. ఆ తర్వాత తెలుగులో నాగార్జున సరసన నటించిన క్రిమినల్ సినిమా కూడా మంచి పేరు తెచ్చింది. అందులోని తెలుసా.. మనసా సాంగ్ ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇలా దక్షిణాదిలో తక్కువ సినిమాలే చేసినా చాలా గుర్తింపు తెచ్చుకుంది. కానీ సూపర్ స్టార్ రజినీకాంత్‌ బాబా సినిమాలో నటించిన తర్వాత ఆమె దక్షిణాది వైపు కూడా చూడలేదు. బాలీవుడ్‌కే పరిమితమైంది. అయితే ఇన్నేళ్ల తర్వాత ఈ విషయంపై మనీషా కొయిరాలా స్పందించింది.

తమిళంలో తాను చేసిన ఆఖరి పెద్ద సినిమా బాబా అని గుర్తు చేసుకుంది. సూపర్ స్టార్ రజినీతో నటించే అవకాశం రావడంతో ఆ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నానని తెలిపింది. కానీ సినిమా విడుదలయ్యాక చూస్తే డిజాస్టర్‌గా మిగిలిందని అన్నారు. బాబా సినిమాకు వచ్చిన టాక్ చూసి నా కెరీర్ అయిపోయినట్లేనా అని భయపడ్డానని తెలిపింది. చివరకు తాను భయపడిందే నిజమైందని చెప్పింది. బాబా కంటే ముందు ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించా కానీ.. బాబా ఫ్లాప్‌తో అదంతా పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ సినిమా తర్వాత తనకు సౌత్‌లో ఎలాంటి ఆఫర్స్ రాలేవని బాధపడింది. ఇటీవల 4Kలో బాబా సినిమా విడుదల చేయడంపై కూడా మనీషా స్పందించింది. ఎలాంటి ప్రమోషన్ లేకుండా రీరిలీజ్ చేస్తే మంచి విజయాన్ని అందుకోవడం చూసి చాలా ఆశ్చర్యపోయానని చెప్పింది. ఈ రెస్పాన్స్ అప్పుడే వచ్చి ఉంటే తన కెరీర్ మరోలా ఉండేదోమోనని మనీషా ఫీలయినట్లు ఆమె మాటల్లో స్పష్టంగా అర్థమైంది.

మణిరత్నం సినిమాను రిజెక్ట్ చేశా!

మనీషా కొయిరాలాకు సౌత్‌లో పాపులారిటీ తీసుకొచ్చిన సినిమా బొంబాయి. మణిరత్నం డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో ఇద్దరు పిల్లల తల్లిగా కూడా చాలా అందంగా కనిపించింది. అయితే మణిరత్నం కథ చెప్పినప్పుడు ఈ సినిమాను మనీషా రిజెక్ట్ చేసిందట. కెరీర్ ఆరంభంలోనే ఇద్దరు పిల్లల తల్లిగా నటిస్తే ఎలా అని భయపడి ఒప్పుకోలేదట. కానీ ఈ విషయం తెలిసి సినిమాటోగ్రఫర్ అశోక్ మెహతా తనను తిట్టి మణిరత్నం సినిమాలు ఎలా ఉంటాయో వివరించాడు. మణిరత్నం సినిమాలో నటించే ఛాన్స్ మిస్ చేసుకుంటే నిజంగా పిచ్చిదానివే అని హెచ్చరించాడు. అతని మాటలతో ఆలోచించుకున్న మనీషా వెంటనే చెన్నై వెళ్లి మణిరత్నం సినిమాలో నటించేందుకు ఓకే చెప్పింది. ఈ సినిమా మనీషా కెరీర్‌లో బిగ్గెస్ట్ సక్సెస్‌ఫుల్ మూవీగా మిగిలిపోయింది. అందుకే ఈ సినిమా చేసినందుకు ఇప్పటికీ ఆనందిస్తున్నా అని మనీషా కొయిరాలా చెప్పింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Janhvi Kapoor | మాజీ సీఎం మనవడితో జాన్వీ కపూర్ డేటింగ్.. వీడియో వైరల్

Balagam | ఫస్ట్ మూవీతోనే కమెడియన్ వేణు అదరగొట్టేశాడుగా.. బలగం మూవీకి రెండు అంతర్జాతీయ అవార్డులు

Manchu Vishnu vs Manoj | మంచు విష్ణు, మనోజ్ గొడవలో బిగ్ ట్విస్ట్.. అందరినీ పిచ్చోళ్లను చేసిన మంచు బ్రదర్స్

Gwyneth Paltrow | ఏడేళ్లు కోర్టు చుట్టూ తిరిగి ఒక్క డాలర్‌ పరిహారం పొందిన ఐరన్‌ మ్యాన్‌ హీరోయిన్‌.. కేసు గెలిచినందుకు ఫుల్‌ హ్యాపీ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News