Monday, April 15, 2024
- Advertisment -
HomeEntertainmentManchu Vishnu vs Manoj | మంచు విష్ణు, మనోజ్ గొడవలో బిగ్ ట్విస్ట్.. అందరినీ...

Manchu Vishnu vs Manoj | మంచు విష్ణు, మనోజ్ గొడవలో బిగ్ ట్విస్ట్.. అందరినీ పిచ్చోళ్లను చేసిన మంచు బ్రదర్స్

Manchu Vishnu vs Manoj | మంచు ఫ్యామిలీలో తాజాగా భగ్గుమన్న విబేధాలు టాలీవుడ్‌లో సంచలనంగా మారాయి. అసలు మంచు బ్రదర్స్‌కి ఎందుకు మనస్పర్థలు వచ్చాయి? ఎన్నాళ్లుగా వీళ్ల మధ్య గొడవలు ఉన్నాయి? అన్న దాని మీదనే ఫిలింవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇటీవల మంచు మనోజ్ పోస్టు చేసిన వీడియోతో ఈ ప్రచారం ఊపందుకుంది. టాలీవుడ్‌లో ఎంత చర్చ జరుగుతున్నా మంచు ఫ్యామిలీ ఎవరూ దీనిపై స్పందించలేదు. ఈ క్రమంలో ఈ గొడవపై మంచు విష్ణు క్లారిటీ ఇచ్చాడు.

మొన్న మంచు మనోజ్ పోస్టు చేసిన వీడియోనే తాజాగా మంచు విష్ణు కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఇక్కడే ఒక ట్విస్ట్ ఇచ్చాడు. అందరూ అనుకుంటున్నట్టు తాము గొడవపడలేదని.. ఇదంతా ఓ రియాలిటీ షో కోసం చేసిన ప్రాంక్ వీడియో అని చెప్పకనే చెప్పాడు. తమ సొంత బ్యానర్‌లో ఓ రియాలిటీ షోను తీసుకొస్తున్నట్లు వీడియో ద్వారా అనౌన్స్ చేశాడు. ఆ షోకి హౌస్ ఆఫ్ మంచూస్ ( House of Manchs ) అనే టైటిల్ పెట్టినట్టుగా రివీల్ చేశాడు. అయితే ఈ వీడియోపై భిన్నంగా రెస్పాన్స్ వస్తుంది. చాలామంది దటీజ్ మంచు ఫ్యామిలీ అని కామెంట్స్ పెడుతున్నారు. అన్నా ట్విస్ట్ అదిరింది అంటూ పోస్టులు పెడుతున్నారు. అసలు ఇది నిజంగానే రియాలిటీ షోనా? లేదంటే బయటపడ్డ విబేధాలను కవర్ చేసుకునేందుకు ట్రిక్ ప్లే చేస్తున్నారా? అని డౌట్స్ రైజ్ చేస్తున్నారు.

అసలేం జరిగింది?

మంచు బ్రదర్స్‌కి ఒకరంటే మరొకరికి పడటం లేదని టాలీవుడ్‌లో ఎప్పట్నుంచో టాక్ నడుస్తోంది. ఎందుకంటే చాలా రోజులుగా మనోజ్ మంచు ఫ్యామిలీకి దూరంగానే ఉంటున్నాడు. మంచు లక్ష్మీతో గానీ.. విష్ణుతో గానీ ఈ మధ్య అస్సలు కనబడలేదు. కాదు.. కాదు.. అసలు వీళ్లిద్దరూ ఒకరు ఉన్న చోటుకి మరొకరు వెళ్లేందుకు కూడా ఇష్టపడట్లేదని తెలుస్తోంది. భూమా నాగిరెడ్డి చిన్న కూతురు మౌనికతో మంచు మనోజ్ రెండో పెళ్లి సమయంలోనే ఈ విషయం జనాలకు అర్థమైంది. మంచు లక్ష్మీప్రసన్న ఇంట్లో జరిగిన ఈ పెళ్లికి మంచు విష్ణు ఏదో చుట్టపుచూపుగా వచ్చి వెళ్లాడు. అంటీముట్టనట్టుగా కాసేపు ఉండి వెళ్లిపోయాడు. దీంతో వీళ్ల మధ్య ఏదో జరుగుతుందని అంతా అనుకున్నారు. ఆ తర్వాత కొద్దిరోజులకే మంచు మోహన్ బాబు బర్త్ డే వచ్చింది. పుట్టిన రోజు సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కూడా అంతే. ఒకరు ఉన్న చోటుకు మరొకరు అస్సలే రాలేదు. దీంతో మంచు బ్రదర్స్ ఒకరంటే మరొకరు ఉప్పు నిప్పులా ఉంటున్నారని అర్థమైపోయింది. అయినప్పటికీ తమ మధ్య విబేధాలు ఏమీ లేవని మంచు ఫ్యామిలీ చెప్పుకొచ్చింది. కానీ తాజాగా మంచు విష్ణు తన వాళ్లపై దాడి చేస్తున్న వీడియోను మనోజ్ పోస్టు చేయడంతో టాలీవుడ్‌లో పెద్ద దుమారమే రేగింది. మంచు బ్రదర్స్ మధ్య నిజంగానే గొడవలు ఉన్నాయన్న వార్త ఒక్కసారిగా ఫిలిం ఇండస్ట్రీలో గుప్పుమంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Viral News | మగాళ్లంతా ఇలాంటి భార్యే కావాలని కోరుకుంటారేమో.. అంతమంచి ఆఫర్ ఇస్తే ఎవరైనా కాదనుకుంటారా?

Sri Rama Navami | సీతారాముల కళ్యాణం చూసేందుకు గుడికి వెళ్లి.. బావిలో పడి 12 మంది భక్తులు మృతి

Tamilnadu | తమిళనాడులో పెరుగు కోసం లొల్లి.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సీఎం

IAS Divya S Iyer | వాళ్లు నా బట్టలు విప్పేశారు.. లైంగిక వేధింపులను బయటపెట్టిన కలెక్టర్ దివ్య

Coronavirus | మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్.. ఒక్కరోజులోనే 3వేలకు పైగా కేసులు

World Idli Day | మనం రెగ్యులర్‌గా తినే ఇడ్లీ ఇండియాది కాదా? మరి ఎక్కడి నుంచి వచ్చింది?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News