Saturday, January 28, 2023
- Advertisment -
HomeEntertainmentAnupama Parameswaran | యాక్టింగ్‌కు లాంగ్‌ గ్యాప్‌ ఇవ్వనున్న అనుపమ.. ఏం చేయబోతుందో తెలుసా

Anupama Parameswaran | యాక్టింగ్‌కు లాంగ్‌ గ్యాప్‌ ఇవ్వనున్న అనుపమ.. ఏం చేయబోతుందో తెలుసా

Anupama Parameswaran | తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన అందం అనుపమ పరమేశ్వరన్‌. పేరుకు మలయాళ కుట్టి అయినప్పటికీ సినిమాల్లో అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపిస్తుంది. అందుకే మలయాళంలో కంటే కూడా అనుపమకు ఇక్కడే ఫ్యాన్స్‌ ఎక్కువగా ఉన్నారు. చాలా రోజులుగా సక్సెస్‌ కోసం ఎదురుచూస్తున్న అనుపమ.. రీసెంట్‌గా వచ్చిన కార్తికేయ 2 సినిమాతో హిట్‌ అందుకుంది. ఇప్పుడు 18 పేజిస్‌ సినిమాతో దాన్ని కంటిన్యూ చేయాలని చూస్తుంది. శుక్రవారం ఈ సినిమా రిలీజ్‌ కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్‌లో పాల్గొన్న అనుపమ.. రంగస్థలం సినిమాలో ఛాన్స్‌ మిస్సవడంతో పాటు తన మనసులో ఉన్న ఇంకా చాలా విషయాలను పంచుకుంది.

సుకుమార్‌ డైరెక్షన్‌లో వచ్చిన రంగస్థలం సినిమా ఛాన్స్‌ మిస్సయినందుకు చాలా బాధపడ్డానని అనుపమ పరమేశ్వరన్‌ తెలిపింది. ఏ సినిమా కథ అయినా మనం ఎంచుకోలేమని.. ఆ కథే మనల్ని ఎంచుకుంటుందని వేదాంతం చెప్పింది. రంగస్థలం సినిమాలో ఛాన్స్‌ కోల్పోయినప్పటికీ.. సుకుమార్‌ రాసిన పాత్రలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో తను చేసిన నందిని పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుందని తెలిపింది. వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌.. ఇలా సోషల్‌ ట్రెండ్‌ నడుస్తున్న ఈ టైమ్‌లో కనీసం మొబైల్‌ కూడా వాడని అమాయకమైనది నందిని పాత్ర అని చెప్పుకొచ్చింది. ఆ రోల్‌ తన మనసుకు బాగా దగ్గరైనట్టు అనిపించిందని తెలిపింది.

18 పేజిస్‌ సినిమా విశేషాలను చెప్పిన అనుపమ.. డైరెక్షన్‌ చేసే ఆలోచన గురించి కూడా పంచుకుంది. చాలామంది డైరెక్షన్‌ చేస్తారా అని అడుగుతున్నారని.. కచ్చితంగా దర్శకురాలిన అవుతానని క్లారిటీ ఇచ్చింది. ఆ బాధ్యతలు చేపట్టడానికి ముందు ఒప్పుకున్న సినిమాలన్నీ కంప్లీట్‌ చేస్తానని తెలిపింది. ఆ తర్వాత ఏడాది పాటు నటనకు విరామం ఇచ్చి.. డైరెక్టర్స్‌ దగ్గర సాంకేతికంగా మరిన్ని అంశాలను నేర్చుకుంటానని పేర్కొంది. అలా దర్శకుల దగ్గర శిక్షణ తీసుకున్నాక డైరెక్షన్‌ చేస్తానని తెలిపింది. వీలు కుదిరినప్పుడల్లా కథలు రాస్తున్నానని కూడా బయటపెట్టింది. అయితే స్వీయ దర్శకత్వంలో ఎప్పుడూ నటించనని స్పష్టం చేసింది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Kannada actor darshan | తనపై చెప్పు విసరడంపై తొలిసారి స్పందించిన కన్నడ స్టార్ హీరో దర్శన్

Laththi Review | లాఠీ సినిమా రివ్యూ.. ఈసారైన విశాల్ హిట్ కొట్టాడా?

Keerthi bhat | ఈ స్థాయికి రావడానికి ఏదో చేసి ఉంటా అనుకున్నాడు.. అనుమానంతో బాయ్‌ఫ్రెండ్‌ వదిలేశాడు.. బిగ్‌బాస్‌ ఫేమ్‌ కీర్తి ఎమోషన్‌

Dhamaka | పోటీ వ్యూహంలో రవితేజ.. గెలుపు కోసం గారడీ చేయాల్సిందే..!

Janhvi kapoor | కనీసం వాళ్లు చూసినా బాగుండేది.. జాన్వీకపూర్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

Samantha | సమంత ఇక సినిమాల్లో నటించడం కష్టమేనా? క్లారిటీ ఇచ్చిన పీఆర్‌ టీమ్‌

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
22FansLike
11FollowersFollow
14FollowersFollow
250SubscribersSubscribe

Recent News