Thursday, April 25, 2024
- Advertisment -
HomeEntertainmentKeerthi bhat | ఈ స్థాయికి రావడానికి ఏదో చేసి ఉంటా అనుకున్నాడు.. అనుమానంతో బాయ్‌ఫ్రెండ్‌...

Keerthi bhat | ఈ స్థాయికి రావడానికి ఏదో చేసి ఉంటా అనుకున్నాడు.. అనుమానంతో బాయ్‌ఫ్రెండ్‌ వదిలేశాడు.. బిగ్‌బాస్‌ ఫేమ్‌ కీర్తి ఎమోషన్‌

Biggboss contestant keerthi bhat | బిగ్‌బాస్‌ 6లో ఎక్కువగా హైలెట్‌ అయ్యింది కీర్తి భట్‌. ఒక యాక్సిడెంట్‌లో కుటుంబం మొత్తాన్ని కోల్పోయి అనాథగా మారిందన్న విషయం తెలిసి తెలుగు ప్రజలు ఆమెకు అండగా నిలబడ్డారు. చాలామంది ఆమెను తమ కూతురిగా భావించారు. బిగ్‌బాస్‌ సీజన్‌లో ఆమె గెలుపే తమ గెలుపు అని అనుకున్నారు. నువ్వు అనాథవు కాదు అనే సపోర్ట్‌ ఇస్తూ ఫైనల్‌ వరకు తీసుకొచ్చారు. కీర్తి కూడా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటన్నింటినీ తట్టుకుని ఫైనల్‌ వరకు చేరుకుంది. టాప్‌ 3లో నిలిచింది. ఆ టైమ్‌లో కీర్తి గెలిస్తే బావుండు అని చాలామంది కోరుకున్నారు. గెలిచే ఛాన్స్‌ లేదని తెలిశాక.. కనీసం బిగ్‌బాస్‌ ఆఫర్‌ చేసిన 30 లక్షలు తీసుకున్నా బావుండని ఫీలయ్యారు. కానీ పోటీకి దిగాక గెలవడమో.. ఓడటమో ఉండాలి తప్ప రాజీ పడి మనస్సాక్షిని చంపుకోవద్దని అనుకుంది. అందుకే బిగ్‌బాస్‌ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించింది. బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి సెకండ్‌ రన్నరప్‌గా బయటకొచ్చింది. కానీ అంతటి నిజాయతీ కలిగిన కీర్తిని.. ఆమె ప్రేమించిన వ్యక్తి శంకించాడు. తన ఎదుగుదలకు ఎన్ని అడ్డుదారులు తొక్కి ఉంటుందోనన్న అనుమానంతో వదిలేశాడు.

బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి వచ్చిన తర్వాత ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి భట్‌.. గతంలో జరిగిన తన బ్రేకప్‌ గురించి బయటపెట్టింది. అప్పట్లో ఒక వ్యక్తిని ప్రేమించానని.. మొదట్లో ఇద్దరం బాగానే ఉండేవాళ్లమని చెప్పిన కీర్తి.. ఓ పరిస్థితిలో బ్రేకప్‌ చెప్పాడని చెప్పుకొచ్చింది. తనకు బ్యాక్‌గ్రౌండ్‌ లేదు కాబట్టి.. ఎలాంటి పని చేసి ఇండస్ట్రీకి వచ్చానో అని అనుమానించాడని తెలిపింది. ఇక్కడిదాకా వచ్చిందంటే ఏం చేసి వచ్చిందో అని దగ్గరి వాళ్లే చులకనగా మాట్లాడితే తట్టుకోలేమని చెప్పింది. తాను ప్రేమించిన వ్యక్తి కూడా అలాగే తనను అర్థం చేసుకోలేకపోయాడని తెలిపింది. ప్రేమించిన వాడికి కూడా అందరిలాగే అనిపించిందంటే.. తప్పుడు వ్యక్తిని ఎంపిక చేసుకున్నట్టే అని ఎమోషన్‌ అయ్యింది. ఈ విషయం గురించి ఇంతకంటే ఎక్కువగా మాట్లాడితే ఏడ్చుకుంటూ ఉండిపోతానని బాధపడింది. ఇప్పుడు అదంతా మరిచిపోయి హ్యాపీగా ఉంటున్నానని.. ఒక పాపను కూడా దత్తత తీసుకున్నానని చెప్పింది.

రెమ్యునరేషన్‌ కూడా అందరికంటే ఎక్కువే

కర్ణాటకలోని బెంగళూరులో జన్మించిన కీర్తికి చిన్నతనం నుంచి యాక్టింగ్‌ అంటే ఇష్టం. అందుకే డ్యాన్స్‌ కూడా నేర్చుకుంది. కన్నడలో మూడు సీరియల్స్‌లో నటించింది. మనసిచ్చి చూడు సీరియల్‌తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. కార్తీక దీపం సీరియల్‌లో నటిస్తున్న టైమ్‌లో బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. 21 మంది కంటెస్టెంట్స్‌లో ఒకరిగా వచ్చి టాప్‌ 3 వరకు కొనసాగింది. ఈ క్రమంలోనే ఈమె రెమ్యునరేషన్‌ కూడా ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. బిగ్‌బాస్‌లో స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌గా ఫైనల్‌ వరకు వచ్చిన కీర్తికి.. 15 వారాలకు గానూ 9 లక్షల పారితోషికం ఇచ్చారని సమాచారం. అంటే వారానికి 60వేలు అన్నమాట. లేడీ కంటెస్టెంట్స్‌ అందరిలోనూ ఇదే అత్యధిక రెమ్యునరేషన్‌ అని తెలుస్తోంది. అంతెందుకు ఈ సీజన్‌లో విన్నర్‌గా నిలిచిన రేవంత్‌కు వారానికి 65వేలు ఇచ్చారట. అతని తర్వాత కీర్తి భట్‌, చలాకీ చంటి మాత్రమే వారానికి 60వేల పారితోషికం అందుకున్నారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Dhamaka | పోటీ వ్యూహంలో రవితేజ.. గెలుపు కోసం గారడీ చేయాల్సిందే..!

Janhvi kapoor | కనీసం వాళ్లు చూసినా బాగుండేది.. జాన్వీకపూర్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

Samantha | సమంత ఇక సినిమాల్లో నటించడం కష్టమేనా? క్లారిటీ ఇచ్చిన పీఆర్‌ టీమ్‌

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News