Tuesday, April 23, 2024
- Advertisment -
HomeEntertainmentKannada actor darshan | తనపై చెప్పు విసరడంపై తొలిసారి స్పందించిన కన్నడ స్టార్ హీరో...

Kannada actor darshan | తనపై చెప్పు విసరడంపై తొలిసారి స్పందించిన కన్నడ స్టార్ హీరో దర్శన్

Kannada actor darshan | స్టార్ హీరో దర్శన్‌పై ఇటీవల ఓ వ్యక్తి చెప్పు విసరడం హాట్ టాపిక్‌గా మారింది. తన లేటెస్ట్ మూవీ క్రాంతి సినిమా రెండో పాటను కర్ణాటకలోని హోస్పేట్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన దర్శన్ స్టేజి ఎక్కి అభిమానులకు అభివాదం చేస్తున్న సమయంలో ఎవరో అతనిపైకి చెప్పు విసిరాడు. అయితే ఆ కార్యక్రమం ప్రారంభం కావడానికి ముందు సభా ప్రాంగణంలో దర్శన్, పునీత్ రాజ్‌కుమార్ ఫ్యాన్స్ గొడవ పడ్డారు. కాబట్టి పునీత్ అభిమానే దర్శన్‌పైకి చెప్పు విసిరి ఉంటాడని వార్తలు వచ్చాయి.

ఇలా ఒక స్టార్ హీరోపై చెప్పు విసరడాన్ని కన్నడ చిత్రసీమలోని చాలామంది నటులు తప్పుబట్టారు. ముందుగా ఈ ఘటనపై సుదీప్ అసహనం వ్యక్తం చేశాడు. పునీత్ సోదరుడు శివరాజ్‌కుమార్ కూడా ఇలాంటి దాడులను సహించమంటూ వార్నింగ్ ఇచ్చాడు. ధనుంజయ్, రమ్య.. ఇలా కన్నడ నటులందరూ సపోర్ట్ ఇవ్వడంతో ఈ ఘటనపై దర్శన్ తొలిసారిగా స్పందించాడు. తనకు అండగా నిలబడిన స్నేహితులకు ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపాడు.

ఈ సమయంలో తనకంటే తన స్నేహితులే ఎక్కువగా బాధపడుతున్నారని దర్శన్ తెలిపాడు. ఇలాంటి ఘటనలు ఒక మనిషిని బలహీనపరచలేవని.. మరింత దృఢంగా మారుస్తాయని స్పష్టం చేశాడు. కన్నడ నేలపైనే ఇలాంటి ఉదాహరణలను ఎన్నో చూశామన్నాడు. న్యాయం కోసం నిలబడిన తోటి నటీనటులకు ధన్యవాదాలు తెలిపాడు. సినిమా ఈవెంట్‌ను పక్కదారి పట్టించడానికి ప్రయత్నించిన వాళ్లకూ థ్యాంక్స్ చెప్పాడు. ఒక కార్యక్రమాన్ని నాశనం చేయాలని వంద మంది చూస్తే.. వేల మంది సెలబ్రెటీలు రంగంలోకి దిగుతారని ఎప్పట్నుంచో చెబుతున్నానని.. ఇప్పుడు అదే జరిగిందని స్పష్టం చేశాడు. తనపై కనబరుస్తున్న ప్రేమాభిమానాలకు రుణపడి ఉంటానని రాసుకొచ్చాడు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Keerthi bhat | ఈ స్థాయికి రావడానికి ఏదో చేసి ఉంటా అనుకున్నాడు.. అనుమానంతో బాయ్‌ఫ్రెండ్‌ వదిలేశాడు.. బిగ్‌బాస్‌ ఫేమ్‌ కీర్తి ఎమోషన్‌

Dhamaka | పోటీ వ్యూహంలో రవితేజ.. గెలుపు కోసం గారడీ చేయాల్సిందే..!

Janhvi kapoor | కనీసం వాళ్లు చూసినా బాగుండేది.. జాన్వీకపూర్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

Samantha | సమంత ఇక సినిమాల్లో నటించడం కష్టమేనా? క్లారిటీ ఇచ్చిన పీఆర్‌ టీమ్‌

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News