Saturday, April 27, 2024
- Advertisment -
HomeLatest NewsHarish Rao | ఒమిక్రాన్‌ బీఎఫ్‌.7పై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్‌.. హరీశ్‌రావు ఉన్నతస్థాయి సమీక్ష

Harish Rao | ఒమిక్రాన్‌ బీఎఫ్‌.7పై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్‌.. హరీశ్‌రావు ఉన్నతస్థాయి సమీక్ష

Harish Rao | కరోనా వైరస్‌ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్‌ అయింది. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. కరోనా పట్ల ఆందోళన అవసరం లేదంటూనే తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. మాస్కులు ధరించడంతో పాటు వ్యక్తిగత శుభ్రత పాటించాలన్నారు. కరోనా వ్యాక్సిన్‌ తీసుకోని వారు వెంటనే తీసుకోవాలని సూచించారు. ప్రతిఒక్కరూ బూస్టర్‌ డోసు వేసుకోవాలన్నారు.

చైనా సహా పలు దేశాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు జారీ చేసింది. దీనికి అనుగుణంగా కరోనా సన్నద్ధతపై అధికారులతో హరీశ్‌రావు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అంతకుముందు వివిధ రాష్ట్రాల్లో ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ బీఎఫ్‌.7 వ్యాప్తి, ప్రభావం గురించి అధికారులు మంత్రికి వివరించారు.

కరోనా నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హరీశ్‌ రావు విజ్ఞప్తి చేశారు. కరోనా వ్యాప్తి రాష్ట్రంలో పెద్దగా లేనప్పటికీ మందులు, ఆక్సీజన్‌, వెంటిలేటర్లు, ఐసీయూ బెడ్‌లు, తగినంత వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. కరోనా పాజిటీవ్‌ వచ్చిన శాంపిళ్లను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం గాంధీకి పంపాలని సూచించారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Harish Rao on Chandrababu | టీడీపీ అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డ హరీశ్‌రావు.. ఎన్టీఆర్ పేరు ఎత్తే హక్కు లేదంటూ తీవ్రస్థాయిలో ధ్వజం

Mancherial | ఎన్టీఆర్ సినిమా చూసి హత్యకు స్కెచ్.. మంచిర్యాలలో ఆరుగురి సజీవదహనం కేసులో ఎన్నో ట్విస్టులు

DMHO Srinivasa rao | ఏసుక్రీస్తు దయవల్లే భారత్‌లో కరోనా తగ్గింది.. తెలంగాణ డీఎంఎచ్‌ఓ శ్రీనివాస్‌రావు వివాదాస్పద వ్యాఖ్యలు

Online Game | ఆన్‌లైన్‌లో గేమ్‌ ఆడి రూ.95 లక్షలు పోగొట్టుకున్న రంగారెడ్డి జిల్లా విద్యార్థి.. లబోదిబోమంటున్న తల్లిదండ్రులు

Keerthi bhat | ఈ స్థాయికి రావడానికి ఏదో చేసి ఉంటా అనుకున్నాడు.. అనుమానంతో బాయ్‌ఫ్రెండ్‌ వదిలేశాడు.. బిగ్‌బాస్‌ ఫేమ్‌ కీర్తి ఎమోషన్‌

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News