Home Latest News Medical Student Preethi | సీనియర్లంతా ఒక్కటయ్యారు అమ్మా.. ఆత్మహత్యకు ముందు ఫోన్‌ చేసి బాధపడ్డ...

Medical Student Preethi | సీనియర్లంతా ఒక్కటయ్యారు అమ్మా.. ఆత్మహత్యకు ముందు ఫోన్‌ చేసి బాధపడ్డ ప్రీతి

Medical Student Preethi | వరంగల్‌ ఎంజీఎంలో ఆత్మహత్యకు యత్నించిన పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యయత్నం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రీతి ఆత్మహత్య చేసుకోవడానికి ముందు వాళ్ల అమ్మకు ఫోన్‌ చేసింది. సైఫ్‌తో పాటు సీనియర్ల వేధిస్తున్న విషయాలను చెప్పుకొని బాధపడింది. దీనికి సంబంధించిన ఆడియో ఫైల్‌ ఇప్పుడు బయటకు వచ్చింది.

సీనియర్‌ సైఫ్‌ నన్ను ఒక్కదాన్నే కాదు చాలామంది జూనియర్లను వేధిస్తున్నాడని ప్రీతి తన తల్లితో చెప్పుకొని బాధపడింది. సీనియర్లంతా ఒక్కటిగా ఉన్నారని చెప్పింది. నాన్న పోలీసులతో ఫోన్‌ చేయించినా లాభం లేకుండా పోయిందని కన్నీళ్లు పెట్టుకుంది. సైఫ్‌ వేధింపులు రోజురోజుకీ ఎక్కువైపోయాయని తెలిపింది. సైఫ్‌పై ఫిర్యాదు చేస్తే అంతా ఒక్కటై తనను దూరం పెడతారని ఆందోళన వ్యక్తం చేసింది. ఏదైనా ఉంటే తన దగ్గరకు రావాలని ప్రిన్సిపల్‌ దృష్టికి ఎందుకు తీసుకెళ్లారని హెచ్‌వోడీ తనపై సీరియస్‌ అయ్యారని చెప్పుకొచ్చింది. ప్రీతి బాధను చూసి ఆమె తల్లి సైఫ్‌తో మాట్లాడతానని నచ్చజెప్పింది. కానీ ఆమె వినిపించుకోలేదు. ఆ కాల్‌ తర్వాత ఆత్మహత్యకు యత్నించింది. అయితే తన కూతురు ఆత్మహత్యకు యత్నించే అంత పిరికిది కాదని ప్రీతి తండ్రి చెప్పుకొచ్చారు.

ఆరుసార్లు ఆగిన గుండె

నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రీతి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. నాలుగు రోజులుగా ఏఆర్‌యూలోని వెంటిలేటర్‌, ఎక్మో యంత్రంపై ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందిస్తుంది. కాగా ఎంజీఎం ఆస్పత్రిలో ఒకసారి ప్రీతి గుండె ఆగిపోగా.. నిమ్స్‌లో చేరినప్పటి నుంచి ఇప్పటివరకు ఐదుసార్లు గుండె ఆగిపోయిందని వైద్యులు వెల్లడించారు. సీపీఆర్‌ చేసి పనిచేసేలా చేసినట్లు తెలిపారు.

Exit mobile version