Home Entertainment Shaakuntalam Trailer | రమణీయ దృశ్యకావ్యంగా శాకుంతలం ట్రైలర్.. సమంత మళ్లీ మాయ చేస్తుందిగా..

Shaakuntalam Trailer | రమణీయ దృశ్యకావ్యంగా శాకుంతలం ట్రైలర్.. సమంత మళ్లీ మాయ చేస్తుందిగా..

Image Source : Twitter

Shaakuntalam Trailer | గుణశేఖర్ దర్శకత్వంలో సమంత నటించిన శాకుంతలం సినిమా ట్రైలర్ విడుదలైంది. అద్భుతమైన గ్రాఫిక్స్‌తో వచ్చిన ఈ ట్రైలర్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా గుణశేఖర్ ఈ సినిమాను తెరకెక్కించాడు. శకుంతల, దుష్యంతుడి మధ్య అజరామరమైన ప్రేమగాథ గురించి చాలామందికి తెలుసు. తెలిసిన కథనే విడమరిచి చెబుతుండటంతో కథనం, గ్రాఫిక్స్‌పై గుణశేఖర్ ఎక్కువ శ్రద్ధ పెట్టినట్టు కనిపిస్తుంది. ట్రైలర్‌లో కనిపించిన దృశ్యాలు అద్భుతంగా ఉన్నాయి.

మేనక, విశ్వామిత్రకు శకుంతల జన్మించిందనే విషయాన్ని చెబుతూ ట్రైలర్‌ను మొదలుపెట్టి.. దుష్యుంతుడితో ప్రేమలో పడటం.. వారిద్దరి పెళ్లి తర్వాత శకుంతలను దుష్యంతుడు మరిచిపోవడం.. ఆ తర్వాత జరిగే పరిణామాలను కట్స్ కట్స్‌గా చూపించారు. 2:48 నిమిషాలు సాగిన ఈ ట్రైలర్‌లో సమంత అందంగా కనిపించడంతో పాటు యాక్టింగ్‌తో ఆకట్టుకుంటుంది. శకుంతలగా సమంత మేకోవర్ అద్భుతంగా ఉంది. చాలా రోజుల తర్వాత మోహన్ బాబుకు పవర్‌ఫుల్ పాత్ర దక్కినట్టు కనిపించింది. ట్రైలర్ చివరలో చిన్నారి భరతుడిగా అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ క్యూట్‌గా కనిపించింది. మాయ ప్రేమను మరిపిస్తుందేమో.. అభిమానాన్ని, అవమానాన్ని ఏ మాయ మరిపించలేదు అంటూ సమంత చెప్పిన డైలాగులు బాగున్నాయి. శేఖర్ జోసెఫ్ సినిమాటోగ్రఫీ, మణిశర్మ బ్యాక్‌గ్రౌండ్ అన్నీ సినిమాకు ప్లస్‌గా మారడం ఖాయమని అనిపిస్తుంది. మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 17న శాకుంతలం సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదలవుతోంది. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Vaarasudu | వెనక్కి తగ్గిన దిల్ రాజు.. వారసుడు సినిమా రిలీజ్ వాయిదా

Chiranjeevi vs Balakrishna | సంక్రాంతి పండుగకి పదో సారి పోటీపడ్డ చిరంజీవి, బాలయ్య.. ఎక్కువసార్లు గెలిచింది ఎవరు?

Sreemukhi | మరీ ఇంత ఘోరమా.. పెళ్లి వార్తలపై స్పందించిన బుల్లితెర యాంకర్ శ్రీముఖి

Saipallavi | సాయిపల్లవి సినిమాలు మానేస్తుందా? క్లారిటీ ఇచ్చిన నేచురల్ బ్యూటీ

Exit mobile version