Home Entertainment Chiranjeevi vs Balakrishna | సంక్రాంతి పండుగకి పదో సారి పోటీపడ్డ చిరంజీవి, బాలయ్య.. ఎక్కువసార్లు...

Chiranjeevi vs Balakrishna | సంక్రాంతి పండుగకి పదో సారి పోటీపడ్డ చిరంజీవి, బాలయ్య.. ఎక్కువసార్లు గెలిచింది ఎవరు?

Image Source : Twitter

Chiranjeevi vs Balakrishna | ఈ సంక్రాంతి ( Sankranti )కి కాంపిటీషన్ మామూలుగా లేదు. బాక్సాఫీస్‌ను షేక్ ఆడించేందుకు చిరంజీవి, బాలకృష్ణ బరిలోకి దిగుతున్నారు. ఒక్కటే రోజు తేడాతో వాల్తేరు వీరయ్య, వీరసింహరెడ్డి సినిమాలు వస్తున్నాయి. దీంతో తెలుగు సినీ ప్రేక్షకుల్లో ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. చాలా ఏండ్ల తర్వాత జరుగుతున్న ఈ స్టార్ వార్‌లో మా హీరోనే గెలుస్తాడంటే.. మా హీరోనే రికార్డులు క్రియేట్ చేస్తాడని మెగా ఫ్యాన్స్, నందమూరి అభిమానులు గొడవలు పడుతున్నారు. మరి ఈ సంక్రాంతి పందెంలో గెలిచేది ఎవరో చూడాలని సినీ అభిమానులు ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నారు. నిజానికి సంక్రాంతి పండుగకి చిరంజీవి, బాలకృష్ణ ఫైట్ ఇదే తొలిసారి కాదు. ఇప్పటికీ తొమ్మిదిసార్లు బాక్సాఫీస్ దగ్గర పోటీపడ్డారు. ఇప్పుడు పదో సారి మళ్లీ సై అంటే సై అంటున్నారు. మరి ఎప్పుడెప్పుడు చిరు, బాలయ్య పోటీ పడ్డారు? వారిలో ఎవరు ఎక్కువసార్లు గెలిచారో ఒకసారి హిస్టరీలోకి వెళ్లి చూద్దాం..

1985 చట్టంతో పోరాటం vs ఆత్మబలం

చిరంజీవి, బాలకృష్ణ తొలిసారి 1985లో సంక్రాంతి రేసులో పోటీపడ్డారు. జనవరి 13న చట్టంతో పోరాటం సినిమాతో చిరంజీవి వస్తే.. ఆ తర్వాతి రోజు బాలకృష్ణ ఆత్మబలం సినిమాతో వచ్చాడు. వీటిలో చట్టంతో పోరాటం హిట్‌గా నిలిచింది. ఆత్మబలం సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది.

1987 దొంగ మొగుడు vs భార్గవ రాముడు

రెండేళ్ల గ్యాప్‌తో 1987లో మళ్లీ చిరు, బాలయ్య పోటీపడ్డారు. చిరంజీవి దొంగమొగుడు, బాలయ్య భార్గవ రాముడు సినిమాలతో వచ్చారు. కానీ రెండోసారి కూడా మెగాస్టార్‌నే సక్సెస్ అందుకున్నాడు. బాలకృష్ణ భార్గవ రాముడు యావరేజ్ టాక్ తెచ్చుకుంది.

1988 మంచి దొంగ vs ఇన్‌స్పెక్టర్ ప్రతాప్

1988లో చిరంజీవి మంచి దొంగ, బాలయ్య ఇన్‌స్పెక్టర్ ప్రతాప్ సినిమాలు సంక్రాంతికి పోటీపడ్డాయి. కానీ మూడోసారి కూడా చిరంజీవికే హిట్ దక్కింది. బాలయ్య ఇన్‌స్పెక్టర్ ప్రతాప్ సినిమా యావరేజ్ టాక్‌తోనే సరిపెట్టుకుంది.

1997 హిట్లర్ vs పెద్దన్నయ్య

1988 ఫైట్ తర్వాత దాదాపు 9 ఏళ్లకు మళ్లీ సంక్రాంతికి చిరంజీవి, బాలకృష్ణ పోటీపడ్డారు. 1997 లో చిరంజీవి హిట్లర్, బాలకృష్ణ పెద్దన్నయ్య సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి.

1999 స్నేహం కోసం vs సమరసింహారెడ్డి

హిట్లర్, పెద్దన్నయ్య హిట్స్ తర్వాత ఒక ఏడాది గ్యాప్ ఇచ్చి మళ్లీ చిరు, బాలయ్య సంక్రాంతి బరిలో నిలిచారు. కానీ ఈసారి బాలకృష్ణనే హిట్ అందుకున్నాడు. సమరసింహారెడ్డి సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. చిరంజీవి స్నేహం కోసం సినిమా మాత్రం అంతగా ఆడలేదు.

2000 అన్నయ్య vs వంశోద్ధారకుడు

గత ఏడాది వైఫల్యంతో మళ్లీ హిట్ కొట్టాలని చిరంజీవి, హ్యాట్రిక్ సాధించాలని బాలకృష్ణ ఇద్దరూ సంక్రాంతికి సినిమాలను విడదుల చేశారు. కానీ బాక్సాఫీస్ దగ్గర మెగాస్టార్ మరోసారి డామినేట్ చేశాడు. అన్నయ్య సినిమా సూపర్ హిట్ అయ్యింది. వంశోద్ధారకుడు ప్లాఫ్‌గా మిగిలింది.

2001 మృగరాజు vs నరసింహనాయుడు

వరుసగా మూడో ఏడాది కూడా చిరు, బాలయ్య సంక్రాంతికి పోటీపడ్డారు. ఈసారి తనకు అచ్చొచ్చిన ఫ్యాక్షన్ కాన్సెప్ట్‌తో వచ్చి బాలకృష్ణ విన్నర్‌గా నిలిచాడు. నరసింహనాయుడు సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి మృగరాజు మాత్రం డిజాస్టర్‌గా మిగిలిపోయింది.

2004 అంజి vs లక్ష్మీనరసింహ

మూడేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ 2004లో చిరంజీవి, బాలకృష్ణ సంక్రాంతి బరిలో నిలిచారు. ఈసారి కూడా లక్ష్మీనరసింహ సినిమాతో బాలయ్య సూపర్ హిట్ అందుకున్నాడు. చిరంజీవి అంజి డిజాస్టర్ అయ్యింది.

2017 ఖైదీ నంబర్ 150 vs గౌతమీపుత్ర శాతకర్ణి

దాదాపు పదేళ్ల గ్యాప్ తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150 సినిమాతో సంక్రాంతి బరిలో నిలిచాడు. బాలకృష్ణ కూడా హిస్టారికల్ ఫిలిం గౌతమీపుత్ర శాతకర్ణితో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర హిట్‌గా నిలిచాయి.

2023లో వాల్తేరు వీరయ్య vs వీరసింహారెడ్డి

2017 తర్వాత తాజాగా మరోసారి చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలతో సంక్రాంతి బరిలో నిలిచారు. ఈ రెండు సినిమాల్లోనూ శ్రుతి హాసన్ కథానాయిక. ఈ రెండు సినిమాలను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించడం విశేషం. మరి ఈ సంక్రాంతికి ఎవరు హిట్ కొడతారో చూడాలి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Sreeleela | సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా నుంచి తప్పుకున్న శ్రీలీల.. కారణం అదేనా?

Samantha | మళ్లీ బిజీ అయిపోయిన సమంత.. అన్నింటికీ అదొక్కటే పరిష్కారమంటూ ఎమోషనల్‌ పోస్ట్‌

Mrunal Thakur | సీతారామం తర్వాత రెమ్యునరేషన్ రెండింతలు పెంచేసిన మృణాల్ ఠాకూర్.. నాని సినిమాకు అంత డిమాండ్ చేసిందా?

Exit mobile version