Home News International Surya Kumar Yadav | భారతీయుడు కావడం అతని అదృష్టం.. మా దేశంలో పుట్టి ఉంటే.....

Surya Kumar Yadav | భారతీయుడు కావడం అతని అదృష్టం.. మా దేశంలో పుట్టి ఉంటే.. పాక్ మాజీ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు

pakistan ex captain salman butt comments on surya kumar yadav

Surya Kumar Yadav | సూర్య కుమార్ యాదవ్.. ఇప్పుడు ఇండియన్ క్రికెట్‌లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అతడో సంచలనం. మిస్టర్ 360 అంటూ తాజా, మాజీ క్రికెటర్లంతా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. సూర్య కుమార్ యాదవ్‌ను ఉద్దేశించి పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. సూర్య పాకిస్థాన్‌లో పుట్టి ఉంటే జాతీయ జట్టులో అతనికి చోటు దక్కేది కాదంటూ వ్యాఖ్యనించారు.

” సూర్య 30 ఏళ్ల వయసులో జాతీయ జట్టులోకి వచ్చాడని చదివాను. అతడు భారతీయుడు కావడం అదృష్టం. అదే పాకిస్థాన్‌లో పుట్టి ఉంటే మాత్రం జాతీయ జట్టులో చోటు దక్కేది కాదు. 30 ఏళ్ల పాలసీకి బలయ్యేవాడు. 30 ఏళ్ల వయసులో జాతీయ జట్టులో చోటు దక్కకుంటే ఇక పాక్‌లో అవకాశాలు రావు. సూర్య ఫిట్‌నెస్, బ్యాటింగ్ శైలి అద్భుతం. బౌలర్ బంతి ఎలా వేస్తున్నాడో ముందుగానే తెలిసినట్లు బ్యాటును ఝులిపిస్తాడు” అంటూ సల్మాన్ భట్ సూర్యను పొగడ్తలతో ముంచెత్తాడు.

పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డు ఛైర్మన్‌గా రమీజ్ రాజా ఉన్నప్పుడు 30 ఏళ్ల విధానం తీసుకొచ్చారు. 30 ఏళ్లు దాటిన వాళ్లకు జాతీయ జట్టులోకి తీసుకోకుండా నిబంధనలు పెట్టారు. ఆ నిబంధనలపై పాకిస్థాన్‌ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్‌ను ఉదాహరణగా చూపుతూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అమలు చేస్తున్న 30 ఏళ్ల విధానాన్ని తప్పుపట్టారు.

కాగా, ఐపీఎల్ ముంబై జట్టు తరఫున అద్భుతంగా ఆడిన సూర్య 2021 మార్చిలో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. గత ఏడాది టీ20లో వెయ్యి పరుగులు పూర్తి చేసి ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇప్పటివరకు టీ20లో మూడు సెంచరీలు చేసి రికార్డు సృష్టించాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Weather Effect | పంజా విసురుతున్న చలి.. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

Roja Vs Nagababu | జబర్దస్త్ మాజీ జడ్జీల మధ్య మాటల యుద్ధం.. అప్పుడు లేవని నోరు ఇప్పుడెందుకు లేస్తుంది.. నాగబాబుపై రోజా తీవ్ర వ్యాఖ్యలు

Breaking News | గుండెపోటుతో చిన్నకొడుకు.. శ్మశానానికి తరలిస్తుండగా పెద్దకొడుకు.. గంట వ్యవధిలో ఇద్దరు మృతి.. మెట్‌పల్లిలో విషాదం

Saleswaram Temple | నల్లమలలో ఉన్న సలేశ్వరం ప్రత్యేకత తెలుసా? ఏడాదిలో కొన్ని రోజులే ఈ గుడి తెరుస్తారు.. కారణమిదే!

Exit mobile version