Home Entertainment Saipallavi | సాయిపల్లవి సినిమాలు మానేస్తుందా? క్లారిటీ ఇచ్చిన నేచురల్ బ్యూటీ

Saipallavi | సాయిపల్లవి సినిమాలు మానేస్తుందా? క్లారిటీ ఇచ్చిన నేచురల్ బ్యూటీ

Image Source : Twitter

Saipallavi | హీరోయిన్లు అంటే కేవలం గ్లామర్ మాత్రమే కాదని నిరూపించింది సాయిపల్లవి. సహజమైన నటనతో, అదిరిపోయే డ్యాన్సులతో అందరి ఫేవరేట్‌గా మారిపోయింది. హీరోలకు ధీటుగా క్రేజ్ తెచ్చుకుంది. ఫ్యాన్స్‌తో ముద్దుగా లేడీ పవర్ స్టార్ అని పిలిపించుకుంటుంది. తన నటనతో అంతలా క్రేజ్ తెచ్చుకున్న సాయిపల్లవి సినిమాలకు గుడ్ బై చెప్పబోతుందనే న్యూస్ కొద్దిరోజులుగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

ఎంబీబీఎస్ చదివిన సాయిపల్లవి త్వరలోనే ఓ హాస్పిటల్ ఓపెన్ చేయబోతుందని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతుంది. ఇకపై సినిమాలు మానేసి అదే ఆస్పత్రిలో డాక్టర్‌గా సర్వీస్ అందించబోతుందనే వార్తలు వినిపించాయి. విరాటపర్వం తర్వాత సాయిపల్లవి కొత్త సినిమాలకు సైన్ చేయకపోవడం ఈ వార్తలకు బలాన్ని చేకూర్చాయి. పైగా బాలీవుడ్ నుంచి ఆఫర్ వచ్చినా తిరస్కరించడంతో ఈ న్యూస్ నిజమేనని అంతా భావించారు. ఇంత గొప్ప నటిని సినిమాల్లో ఇక చూడలేమా అని అభిమానులు చాలా ఫీలయ్యారు. ఈ క్రమంలో తాను సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నట్టు వచ్చిన వార్తలపై నేచురల్ బ్యూటీ సాయిపల్లవి స్పందించింది.

ఎంబీబీఎస్ చదివినప్పటికీ నటిని కావాలనే అనుకున్నానని.. దీనికి వాళ్ల అమ్మానాన్న కూడా అడ్డుచెప్పలేదని సాయిపల్లవి పేర్కొంది. అందం అనేది రూపంలో కాదు గుణంలో ఉంటుందని చెప్పే ప్రేమమ్ సినిమాతో తన సినీ ప్రయాణం మొదలైందని తెలిపింది. ఈ సినిమాలోని మలర్ టీచర్ ఇమేజ్‌ను మార్చడానికి విభిన్న పాత్రల్లో నటించి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించే ప్రయత్నం చేస్తున్నానని పేర్కొంది. అందరూ తమ ఇంటి ఆడబిడ్డగా భావించడం చాలా సంతోషంగా ఉందని చెప్పింది. మంచి పాత్రలు వస్తే ఏ భాషలో నటించడానికి అయినా సిద్ధమేనని తెలిపింది. అలా సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నట్టు వచ్చిన వార్తలు తప్పుడు ప్రచారాలేనని క్లారిటీ ఇచ్చింది. సాయిపల్లవి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Sreeleela | సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా నుంచి తప్పుకున్న శ్రీలీల.. కారణం అదేనా?

Samantha | మళ్లీ బిజీ అయిపోయిన సమంత.. అన్నింటికీ అదొక్కటే పరిష్కారమంటూ ఎమోషనల్‌ పోస్ట్‌

Mrunal Thakur | సీతారామం తర్వాత రెమ్యునరేషన్ రెండింతలు పెంచేసిన మృణాల్ ఠాకూర్.. నాని సినిమాకు అంత డిమాండ్ చేసిందా?

Exit mobile version