Home Entertainment Nabha Natesh | నభా నటేశ్‌కు యాక్సిడెంట్‌.. పలు సర్జరీలతో కోలుకున్న ఇస్మార్ట్‌ బ్యూటీ

Nabha Natesh | నభా నటేశ్‌కు యాక్సిడెంట్‌.. పలు సర్జరీలతో కోలుకున్న ఇస్మార్ట్‌ బ్యూటీ

Pic Credit: Nabha Natesh Instagram

Nabha Natesh | ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమాతో కుర్రకారు మనసు దోచేసుకుంది నభా నటేశ్‌. సుధీర్‌ బాబు హీరోగా వచ్చిన నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమాతోనే క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత ఇస్మార్ట్‌ బ్యూటీకి టాలీవుడ్‌లో వరుస అవకాశాలు వస్తాయని అనుకున్నారు. కానీ ఒకటి రెండు అవకాశాలు మాత్రమే వచ్చాయి. అవి కూడా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టాయి. కొత్త అవకాశాలు కూడా రాలేదు. గత ఏడాది ఈమె ఒక్క సినిమాలో కూడా నటించలేదు. దీంతో నభా నటేశ్‌ను జనాలు మరిచిపోయే స్థితికి వచ్చారు. ఇలాంటి టైమ్‌లో మళ్లీ తెరపైకి వచ్చింది. పెద్ద యాక్సిడెంట్‌కు గురయ్యానని.. అందువల్లే గతేడాది సినిమాలు చేయలేకపోయానని సంచలన విషయాలను బయటపెట్టింది.

2021లో చివరగా మ్యాస్ట్రో సినిమాలో కనిపించిన నభా.. తర్వాత ఏ సినిమాలోనూ చేయలేదు. దీంతో ఇస్మార్ట్‌ బ్యూటీకి ఏమైందని ఆమె ఫ్యాన్స్‌ చర్చలో పడిపోయారు. ఆమెకు అవకాశాలు రావట్లేదేమోనని కూడా అనుకున్నారు. అయితే గత ఏడాది సినిమాల్లో కనిపించకపోవడానికి అసలు కారణం ఆఫర్లు లేకపోవడం కాదని.. యాక్సిడెంట్‌కు గురికావడమని తాజాగా వెల్లడైంది. తనకు జరిగిన రోడ్డు ప్రమాదం గురించి నభా నటేశ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పుకొచ్చింది. కొద్దిరోజులుగా సినిమాల్లో కనిపించకపోవడంతో మీరంతా నన్ను మిస్సవుతున్నారని నాకు తెలుసు అంటూ నభా నటేశ్‌ మొదలుపెట్టింది. గత ఏడాది తనకు చాలా క్లిష్టంగా గడిచిందని తెలిపింది. గత ఏడాదిలో ఒక ప్రమాదానికి గురయ్యానని వెల్లడించింది. ఎడమ భుజంలోని ఎముకలకు ఫ్రాక్షర్‌ కావడంతో పలు మార్లు సర్జరీలు కూడా చేశారని తెలిపింది. దీనివల్ల శారీరకంగా, మానసికంగా చాలా బాధపడ్డానని చెప్పుకొచ్చింది. ‘ మీ అందరి ప్రేమ నాకు ధైర్యాన్ని ఇచ్చింది. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నా. మునపటి కంటే మరింత ఉత్సాహంగా మీ ముందుకొస్తున్నా’ అని రాసుకొచ్చింది. త్వరలోనే మళ్లీ సినిమాలతో పలకరిస్తానని తెలిపింది. గత ఏడాది మొత్తం సినిమాలు ఎందుకు చేయలేదో తాజాగా నభా నటేశ్‌ క్లారిటీ ఇచ్చింది.

2022లో తనకు యాక్సిడెంట్‌ అయ్యిందని నభా నటేశ్‌ బయటపెట్టింది. ఎడమ భుజానికి తీవ్ర గాయాలవ్వడంతో చాలా సర్జరీలు జరిగాయని వెల్లడించింది. దీనివల్ల శారీరకంగా, మానసికంగా చాలా ఇబ్బందులు పడ్డానని.. ఇప్పుడే కోలుకుంటున్నానని తెలిపింది. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని.. మునపటి కంటే ఉత్సాహంగా పనిచేస్తానని పేర్కొంది.

Follow Us : Google News, FacebookTwitter

Read more Articles:

Oscars 2023 | సైలెంట్‌గా ఆస్కార్ బరిలోకి నిలిచిన కాంతార.. సౌత్ నుంచి ఇంకా ఏ సినిమాలు నామినేషన్స్‌లో నిలిచాయి?

KGF Chapter3 | కేజీఎఫ్ సీక్వెల్స్‌లో రాఖీ భాయ్ ఉండడు.. బాంబు పేల్చిన హోంబలే బ్యానర్స్

Goodachari2 | హ్యాట్రిక్‌పై గురి పెట్టిన అడవి శేష్.. గూఢచారి 2పై కీలక అప్‌డేట్

Dil Raju | అప్పుడు అన్న మాటలే ఇప్పుడు దిల్‌రాజుకు దెబ్బేశాయి!!

Shaakuntalam Trailer | రమణీయ దృశ్యకావ్యంగా శాకుంతలం ట్రైలర్.. సమంత మళ్లీ మాయ చేస్తుందిగా..

Exit mobile version