Home Entertainment Matti Kusthi in Ott | ఓటీటీలోకి వచ్చేస్తున్న మట్టి కుస్తీ.. స్ట్రీమింగ్ ఎప్పట్నుంచి అంటే..

Matti Kusthi in Ott | ఓటీటీలోకి వచ్చేస్తున్న మట్టి కుస్తీ.. స్ట్రీమింగ్ ఎప్పట్నుంచి అంటే..

Matti Kusthi in Ott | తమిళ హీరో విష్ణు విశాల్‌, ఐశ్వర్య లక్ష్మీ ప్రధాన పాత్రల్లో రూపొందిన తమిళ చిత్రం గట్ట కుస్తీ. స్పోర్ట్స్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో మట్టి కుస్తీగా విడుదల చేశారు. రవితేజ ఈ చిత్రానికి సమర్పకుడు. చెల్ల అయ్యావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డిసెంబర్‌ 2న విడుదలైంది. కోలీవుడ్‌లో ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబట్టింది. తెలుగులో మాత్రం కమర్షియల్‌గా సక్సెస్‌ కాలేకపోయింది. కానీ తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఈ క్రమంలో ఇప్పుడు ఈ మట్టి కుస్తి సినిమా ఓటీటీలోకి రాబోతున్నది.

కొత్త సంవత్సరం కానుకగా మట్టి కుస్తీ సినిమా ఓటీటీలోకి రానుంది. ఇప్పటికే రైట్స్‌ దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్‌ ప్లాట్‌ఫామ్‌లో జనవరి 1 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు నెట్‌ఫ్లిక్స్‌ ప్రకటించింది. ఇక కథ విషయానికొస్తే వీరా ఆంధ్రాలో పెద్ద ఆసామి. తల్లిదండ్రులు చనిపోవడంతో మామయ్య పెంచి పెద్ద చేస్తారు. తాతలు సంపాదించిన ఆస్తితో తిరుగుతూ పంచాయితీలు చూస్తుంటాడు. వీరాకు పెండ్లి చేద్దామని వాళ్ల మామయ్య అనుకుంటే కొన్ని కండిషన్లు పెడతాడు. అమ్మాయి తనకంటే తక్కువ చదువుకుని ఉండాలని.. పొడవు జడ ఉండాలని షరతుపెడతాడు. ఇక కీర్తి కేరళలో పుట్టి పెరిగిన అమ్మాయి. బీఎస్సీ వరకు చదివిన కీర్తి తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినప్పటికీ బాబాయ్‌ ప్రోత్సాహంతో రెజ్లర్‌ అవుతుంది. అబ్బాయిల్లా కటింగ్‌ చేసుకుని కుస్తీలు పడుతుండటంతో పెండ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారు. అయితే కీర్తి బాబాయ్ అబద్దాలు చెప్పి.. వీరాతో పెండ్లి జరిపిస్తాడు. వీరి దాంపత్యం కొద్దిరోజులు సాఫీగా సాగిన తర్వాత కీర్తి గురించి వీరాకు అసలు విషయం తెలుస్తుంది. దాంతో వీరా ఎలా రియాక్ట్‌ అయ్యాడు. వీరా, కీర్తి మధ్య వచ్చిన గొడవలు సద్దుమణిగాయా? లేదా ? అసలు కీర్తి, వీరా ఇద్దరు కుస్తీ పోటీల్లో ఎందుకు తలపడాల్సి వచ్చిందనేది మిగతా కథ.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Prabhas | 21 కోట్లు అప్పు తీసుకున్న ప్రభాస్.. కారణం అదేనా?

Salman khan birth day celebrations | మాజీ ప్రియురాలికి ముద్దు పెట్టిన సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్

Kantara 2 | కాంతార 2 వస్తుందా.. సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చిన హోంబలే ఫిలింస్‌

Unstoppable | బాలయ్య షోకి వచ్చిన పవన్ కళ్యాణ్.. పవర్‌స్టార్‌ను ఎలాంటి ప్రశ్నలు అడుగుతాడో !!

Waltair Veerayya | దుమ్మురేపుతున్న వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్..మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

Exit mobile version