Home Entertainment Prabhas | ప్రభాస్‌, సుకుమార్ కాంబినేషన్‌లో సినిమాపై క్లారిటీ వచ్చేసిందిగా..

Prabhas | ప్రభాస్‌, సుకుమార్ కాంబినేషన్‌లో సినిమాపై క్లారిటీ వచ్చేసిందిగా..

image by Twitter

Prabhas & Sukumar | కొద్దిరోజులుగా సోషల్‌ మీడియాలో క్రేజీ గాసిప్‌ చక్కర్లు కొడుతుంది. రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌, లెక్కల మాస్టర్‌ సుకుమార్‌ డైరెక్షన్‌లో ఒక సినిమా రాబోతున్నదంటూ ప్రచారం జరుగుతోంది. అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ ఈ కాంబోలో సినిమాను నిర్మిస్తుందని వార్తలు వచ్చాయి. ఇప్పటికే గ్లోబల్‌ స్టార్‌ అయిపోయిన ప్రభాస్‌తో.. పుష్ప వంటి పాన్‌ ఇండియా బ్లాక్‌బస్టర్‌ అందించిన సుకుమార్‌తో సినిమా అనగానే ఈ న్యూస్‌ టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది. సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచింది. దీంతో ఈ వార్త సదరు నిర్మాణ సంస్థ దృష్టికి వెళ్లాయి. దీంతో ప్రభాస్‌-సుకుమార్‌ కాంబినేషన్ సినిమాపై క్లారిటీ ఇస్తూ ఓ లేఖ విడుదల చేసింది.

ప్రభాస్‌ – సుకుమార్‌ కాంబినేషన్‌లో తమ సంస్థ ఒక సినిమాను నిర్మిస్తుందని వస్తుందన్న వార్తలో నిజం లేదని అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ స్పష్టం చేసింది. సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని సూచించింది. ఒకవేళ అలాంటి ప్రాజెక్ట్‌ ఏదైనా ఉంటే మీడియా ద్వారా తామే వెల్లడిస్తామని క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ ఒక ట్వీట్‌ చేసింది.

ప్రస్తుతం పుష్ప ది రూల్‌ సినిమా పనుల్లో సుకుమార్‌ బిజీగా ఉన్నాడు. ప్రభాస్‌ కూడా చేతినిండా ప్రాజెక్టులతో మరో రెండు మూడేళ్ల వరకు ఖాళీ లేడు. ఇప్పటికే ఓం రౌత్‌ దర్శకత్వంలో వస్తున్న ఆదిపురుష్‌ సినిమా షూటింగ్ పూర్తయింది. వీఎఫ్‌ఎక్స్‌ పనులు నడుస్తున్నాయి. కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌తో సలార్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమా కూడా 85 శాతం వరకు షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకుంది. అలాగే నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రాజెక్ట్‌ కె సినిమాలో నటిస్తున్నాడు. సందీప్‌ వంగాతో స్పిరిట్‌ సినిమాను కూడా అనౌన్స్‌ చేశాడు. ఇవన్నీ భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతున్నాయి. వీటితో పాటుగా మారుతీ డైరెక్షన్‌లో కంప్లీట్‌ తెలుగు సినిమాలో నటిస్తున్నాడు ప్రభాస్‌. ఈ సినిమాకు రాజా డీలక్స్‌ టైటిల్‌ ప్రచారంలో ఉంది. ఒకవేళ సుకుమార్‌తో ప్రభాస్‌ సినిమా చేయాలని అనుకున్నా కూడా ఇవన్నీ పూర్తయితే కానీ కుదరదు. మరి అభిమానుల ఆశ ఎప్పుడు తీరుతుందో చూడాలి.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Prabhas | 21 కోట్లు అప్పు తీసుకున్న ప్రభాస్.. కారణం అదేనా?

Salman khan birth day celebrations | మాజీ ప్రియురాలికి ముద్దు పెట్టిన సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్

Kantara 2 | కాంతార 2 వస్తుందా.. సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చిన హోంబలే ఫిలింస్‌

Unstoppable | బాలయ్య షోకి వచ్చిన పవన్ కళ్యాణ్.. పవర్‌స్టార్‌ను ఎలాంటి ప్రశ్నలు అడుగుతాడో !!

Waltair Veerayya | దుమ్మురేపుతున్న వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్..మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

Exit mobile version