Home Entertainment Hombale Films Journey | మూడు వేల కోట్లతో హోంబలే ఫిలింస్ భారీ ప్లాన్.. ఈసారి...

Hombale Films Journey | మూడు వేల కోట్లతో హోంబలే ఫిలింస్ భారీ ప్లాన్.. ఈసారి కేజీఎఫ్, కాంతారను మించిపోవాల్సిందే !

Hombale Films Journey | రెండు మూడేళ్ల కిందటి దాకా అది పెద్ద బ్యానర్ ఏమీ కాదు.. దాని నిర్మాతలకు సినిమా బ్యాక్‌గ్రౌండ్ కూడా ఏమీ లేదు. ఉన్నదళ్లా ఒక్కటే.. సినిమాల మీద పిచ్చి. ఎలాగైనా సినిమాల్లో రాణించాలన్న తపన. అందుకే మొదట్లో ఫ్లాపులు వచ్చినా వెనుదిరగనివ్వలేదు. ఆ పట్టుదలనే వాళ్లను సక్సెస్ వైపు నడిపించింది. అప్పటిదాకా కన్నడ ఇండస్ట్రీలో కూడా సరిగ్గా తెలియని పేరు.. ఇప్పుడు దేశవ్యాప్తంగా బిగ్గెస్ట్ ఫిలిం బ్యానర్‌గా మారింది. ఇంతకీ ఆ బ్యానర్ ఏంటని అనుకుంటున్నారా? దేశ చలన చిత్ర పరిశ్రమకు కేజీఎఫ్, కాంతార వంటి బిగ్గెస్ట్ హిట్స్ అందించిన హోంబలే ఫిలింస్.

హోంబలే ఫిలింస్ ఎలా మొదలైంది?

విజయ్ కిరంగదూర్, చలువే గౌడ, కార్తిక్ గౌడ అనే ముగ్గురు కజిన్స్ ఎంతో కష్టపడి 2013లో హోంబలే ఫిలింస్‌ను ప్రారంభించారు. తమ ఇలవేల్పు హోంబలమ్మ కావడంతో నిర్మాణ సంస్థకు హోంబలే ఫిలింస్ అని పేరు పెట్టారు. వాళ్లకు సినిమాల్లో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేదు. అయినప్పటికీ తొలి సినిమా కోసమే ఏకంగా పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌ను కలిశారు. వీళ్ల ఆసక్తిని గమనించిన పునీత్ కూడా తొలి అవకాశం ఇచ్చాడు. కానీ హోంబలేకు నిరాశే ఎదురైంది. పునీత్‌తో తీసిన తొలి సినిమా నిన్నిందలే డిజాస్టర్‌గా నిలిచింది. 2014లో రిలీజైన ఈ సినిమా భారీ నష్టాలను మిగిల్చింది. ఏవేవో పనులు చేసి సంపాదించిన డబ్బంతా పోయింది. అయినా వెనుదిరగలేదు. నిర్మాత అంటే డబ్బు పెడితే సరిపోదు.. కథను జడ్జ్ చేయాలన్న విషయాన్ని అర్థం చేసుకున్నారు. ఏడాదిలోపే మాస్టర్ పీస్‌ అనే మరో చిత్రాన్ని నిర్మించారు. రాక్ స్టార్ యశ్‌తో ఇదే వాళ్ల తొలి సినిమా. 2015లో ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. దాదాపు 35 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాతో హోంబలే అనే బ్యానర్ ఒకటి ఉందని జనాలకు రిజిస్టర్ అయ్యింది.

రూట్ మార్చి.. హిట్ కొట్టి..

ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేని తమను నమ్మి తొలి అవకాశం ఇచ్చిన పునీత్‌కు ఎలాగైనా ఒక సక్సెస్ అందించాలని భావించారు హోంబలే ఫిలింస్ నిర్మాతలు. 2017లో రాజకుమార అనే సినిమాను నిర్మించారు. అనుకున్నట్టుగానే ఇది భారీ సక్సెస్ అందుకుంది. పునీత్ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. కన్నడ పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన ఆరో చిత్రంగా నిలిచింది. తమ బ్యానర్‌లో ఫస్ట్ వచ్చిన సినిమా రొమాంటిక్ కామెడీ డ్రామా. కానీ అది ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత తీసిన రెండు చిత్రాలు యాక్షన్ డ్రామా. అంటే తమకు యాక్షన్ డ్రామా మీదనే ఎక్కువ పట్టు ఉందని అర్థం చేసుకున్న నిర్మాతలు కేజీఎఫ్ కథను ఎంచుకున్నారు. కన్నడ చిత్రంగగా రూపొందించిన ఈ సినిమాను వివిధ భాషల్లోకి కూడా అనువదించారు. దాదాపు 80 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా 250 కోట్లకు పైగా వసూలు చేసింది. కలెక్షన్ల కంటే కూడా దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. నిర్మాతల తలపై అంతకుమించి బాధ్యతను ఉంచింది. దీంతో కేజీఎఫ్ చాప్టర్ 2ను తొలి పార్ట్ కంటే కూడా ఎంతో నిబద్దతతో తీశారు. ఈ సినిమాకు దేశవ్యాప్తంగా సినీ అభిమానులు నీరాజనాలు పలికారు. హోంబలే ఫిలింస్‌ను ఎక్కడికో తీసుకెళ్లారు. ఈ రెండు చాప్టర్‌లకు మధ్యలో పునీత్‌తో యువరత్న సినిమా తీసి హిట్ అందుకున్నారు.

కాంతార మరో అచీవ్‌మెంట్

ఇలా వరుస సక్సెస్‌లతో దేశవ్యాప్తంగా పాపులారిటీ రావడంతో కన్నడ ప్రాంతం వరకే పరిమితం చేద్దామని మొదలుపెట్టిన కాంతార సినిమాను కూడా అన్ని భాషల్లోకి డబ్ చేస్తూ పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేశారు. రూ. 16 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా 340 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులంతా కన్నడ ఇండస్ట్రీ గురించి చర్చించుకునేలా చేసింది. దీంతో హోంబలే ఫిలింస్ తిరుగులేని బ్యానర్‌గా మారిపోయింది. దీంతో ఇప్పట్నుంచి నిర్మించబోయే సినిమాలు అన్నీ భారీ బడ్జెట్‌తోనే ఉండాలని హోంబలే నిర్మాతలు భావిస్తున్నారు.

ఐదేళ్లలో 3 వేల కోట్ల బడ్జెట్

కొత్త సంవత్సరంగా హోంబలే ఫిలింస్ సరికొత్త నిర్ణయం తీసుకుంది. రానున్న ఐదేళ్లలో తమ సంస్థ నుంచి నిర్మించబోయే సినిమాల కోసం ఏకంగా మూడు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయాలని తీర్మానించింది. ఈ విషయాన్ని హోంబలే ఫిలింస్ నిర్మాతల్లో ఒకరైన విజయ్ కిరంగదూర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇప్పటికే రెబల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా భారీ బడ్జెట్‌తో సలార్ సినిమా తెరకెక్కుతుంది. అలాగే టైసన్ ( మలయాళం ), భగీర, రిచర్డ్ ఆంథోనీ, ధూమం (మలయాళం ) సినిమాలు హోంబలే ఫిలింస్ చేతిలో ఉన్నాయి. ఇవి కాకుండా పుష్ప సినిమాలో జాలిరెడ్డిగా నటించిన ధనుంజయ్ హీరోగా ఉత్తరకాండ అనే సినిమాను కూడా ప్లాన్ చేస్తుంది. ఇలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌లతో హోంబలే భారీ మూవీస్‌ను ప్లాన్ చేసింది. మరీ కేజీఎఫ్, కాంతార రేంజ్‌లో ఈ సినిమాలు కూడా సక్సెస్‌ను అందుకుంటాయో లేదో చూడాలి.

https://twitter.com/VKiragandur/status/1609874284356472833?s=20&t=fHePVLcT7XUBwVCzcypHEg

Follow Us : FacebookTwitter

Read More Articles:

Jeremy Renner | బాంబ్ సైక్లోన్ ఎఫెక్ట్.. తీవ్రంగా గాయపడ్డ అవెంజర్స్ ఫేమ్ మార్వెల్ సూపర్ హీరో జెరెమీ రెన్నర్‌.. పరిస్థితి విషమం

Jabardast Comedian Kiraak RP | బంపర్ రెస్పాన్స్ ఉన్నా కిరాక్ ఆర్పీ చేపల పులుసు దుకాణం మూసేశాడు.. పగోడికి కూడా ఆ కష్టం రావద్దు

Kajal Aggarwal | అమ్మో.. రీఎంట్రీలో కూడా కాజల్ అగర్వాల్ అంత డిమాండ్ చేస్తుందా?

Aadi Saikumar | వరుస ఫ్లాప్స్ వచ్చినా కూడా ఆదికి వరుస ఆఫర్లు ఎలా వస్తున్నాయి?

Exit mobile version