Home Entertainment Nandamuri Balakrishna | నర్సుల ఆందోళనకు దిగొచ్చిన బాలయ్య.. తన మాటలను తప్పుదోవ పట్టించారని ఆవేదన

Nandamuri Balakrishna | నర్సుల ఆందోళనకు దిగొచ్చిన బాలయ్య.. తన మాటలను తప్పుదోవ పట్టించారని ఆవేదన

Nandamuri Balakrishna | టాలీవుడ్‌ నట సింహాం నందమూరి బాలకృష్ణ ఈ మధ్య కాలంలో ఏం మాట్లాడిన కూడా అది పెద్ద వివాదానికి దారి తీస్తుంది. మొన్నటికి మొన్న దేవ బ్రాహ్మణుల గురించి మాట్లాడిన మాటలు పెద్ద వివాదానికి తెరలేపాయి. నిన్నటికి నిన్న అక్కినేని గురించి అన్న మాటలు అభిమానులు మధ్య చిచ్చు పెట్టేంత వరకు వెళ్లాయని తెలుసు… తాజాగా ఆయన నర్సుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ సంఘాలు క్షమాపణలు చెప్పాల్సిందేనని పట్టుబట్టాయి. దీంతో దిగొచ్చిన బాలకృష్ణ నర్సులకు క్షమాపణలు చెప్పాడు. తన మాటలను వక్రీకరించారని తెలిపారు.

అసలేం జరిగిందంటే… బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే టాక్ షోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్‌గా అతిథిగా వచ్చాడు. ఈ షోలో పవన్ మాట్లాడుతూ తనకు జరిగిన ప్రమాదాల గురించి చెప్పాడు. అప్పుడు బాలయ్య కూడా తనకు జరిగిన ప్రమాదాలను చెప్పాడు. కాలేజీ రోజుల్లో జరిగిన ఓ ప్రమాదం గురించి బాలయ్య చెబుతూ.. తనకు వైద్యం చేసిన నర్సు భలే అందంగా ఉందంటూ కామెంట్ చేశాడు. అయితే బాలకృష్ణ వ్యాఖ్యలను నర్సుల సంఘం తప్పుబట్టింది. ఆయన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని.. ట్రీట్‌మెంట్ ఇచ్చిన నర్సుపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించింది.

బహిరంగంగా క్షమాపణలు చెప్పాల్సిందేనని నర్సులు డిమాండ్ చేశారు. దీంతో బాలకృష్ణ వివరణ ఇచ్చాడు. నర్సులను కించపరిచారని చేస్తున్న అసత్య ప్రచారాన్ని బాలయ్య ఖండించాడు. తన మాటలను వక్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశాడు. నర్సులంటే తనకు ఎంతో గౌరవం అని.. వారిని తన సోదరీమణులుగా చూస్తానని తెలిపారు. రాత్రింబవళ్లు రోగులకు సపర్యలు చేసే నర్సులకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువేనని ఆయన అభిప్రాయపడ్డారు. తన మాటలు నర్సుల మనోభావాలను దెబ్బతీయడంపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నా అని తెలిపారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Turkey Earthquake | ప్రకృతి ప్రకోపానికి 3800 మంది బలి.. చిగురుటాకులా వణికిపోతున్న తుర్కియే, సిరియా

Bhanupriya | మెమొరీ లాస్‌తో బాధపడుతున్న సీనియర్ హీరోయిన్.. సెట్స్‌లో డైలాగులు కూడా గుర్తుండట్లేదట

Jabardasth Varsha | రాత్రికి రాత్రే ఎంగేజ్‌మెంట్ ఫిక్స్ చేశారు.. వీడియో పోస్టు చేసిన జబర్దస్త్ వర్ష.. ఏకిపారేస్తున్న నెటిజన్లు

Allu Aravind | ఆమెకు ఆ అవసరం లేదు.. అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డిపై అల్లు అరవింద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Sundeep Kishan | రెజీనాతో డేటింగ్‌పై క్లారిటీ ఇచ్చిన యంగ్ హీరో సందీప్ కిషన్

Exit mobile version