Home News International Earthquake in Turkey | తుర్కియేలో 24 గంటల్లో 100 సార్లు కంపించిన భూమి.. ఇప్పటివరకు...

Earthquake in Turkey | తుర్కియేలో 24 గంటల్లో 100 సార్లు కంపించిన భూమి.. ఇప్పటివరకు 4,500 మంది మృతి.. వేలాది మంది ఆస్పత్రిలో!

Earthquake in Turkey | తుర్కియేను భూకంపాలు వదలడం లేదు. నిన్నటి భారీ భూకంపం తర్వాత నుంచి ప్రకంపనలు ఆగడం లేదు. ఇప్పటివరకు రిక్టర్ స్కేలుపై 4 అంతకంటే ఎక్కవ స్థాయిలో దాదాపు 100సార్లకుపైగా భూమి కంపించిందని అమెరికా జియోలాజికల్ సర్వే విభాగం వెల్లడించింది.

భూకంపంలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు సిరియా, తుర్కియేలో 4500 మందికి పైగా మృతి చెందారు. ఒక్క తుర్కియేలోనే దాదాపు 3వేలకు పైగా మృతి చెందారు. సిరియాలో 1500 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. క్షతగాత్రుల సంఖ్య భారీగానే ఉంది. వేలాది మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే భూకంపం దాటికి 20 వేలకు పైగానే మృతి చెంది ఉందొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది.

భూకంపం దాటికి తుర్కియేలోని ఇసికందర్‌లోని లిమాక్ పోర్టు పూర్తిగా దెబ్బతిన్నది. దేశ వ్యాప్తంగా విద్యుత్ వ్యవస్థ, గ్యాస్ పైప్ లైన్లు పూర్తిగా దెబ్బతిన్నాయి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Turkey Earthquake | తుర్కియే, సిరియాలో భారీ భూకంపం వస్తుందని 3 రోజుల ముందే హెచ్చరిస్తే.. అంతా చులకనగా మాట్లాడారు..

Turkey Earthquake | ప్రపంచంలో ఇప్పటిదాకా వచ్చిన భారీ భూకంపాలు ఇవే..

Turkey Earthquake | ప్రకృతి ప్రకోపానికి 3800 మంది బలి.. చిగురుటాకులా వణికిపోతున్న తుర్కియే, సిరియా

BRS MLAs Poaching Case | ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు సంచలన తీర్పు!

Revanth Reddy | ఉద్యోగాలు రావాలంటే మార్పు రావాల్సిందే.. కేసీఆర్‌ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి

Ponguleti Srinivas reddy | దమ్ముంటే నన్ను సస్పెండ్‌ చేయండి.. బీఆర్‌ఎస్‌ అధిష్టానానికి పొంగులేటి సవాల్‌!

Telangana Budget | సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే రూ.3లక్షలు.. తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌

Exit mobile version