Wednesday, April 24, 2024
- Advertisment -
HomeEntertainmentBalakrishna | తారకరత్న అన్ని కార్యక్రమాలు పూర్తయ్యకే బాలయ్య షూటింగ్

Balakrishna | తారకరత్న అన్ని కార్యక్రమాలు పూర్తయ్యకే బాలయ్య షూటింగ్

Balakrishna | గత నెల రోజులుగా బాలకృష్ణ షూటింగ్ చేయడం లేదు. జనవరిలో పట్టాలెక్కిన అనిల్ రావిపూడి సినిమా ఒక వారం రోజుల్లో షూటింగ్ తర్వాత అనుకొని కారణాలతో ఆగిపోయింది. మొదటి షెడ్యూల్ పూర్తయ్యాక.. బాలకృష్ణ తన అల్లుడు లోకేష్ మొదలుపెట్టిన పాదయాత్ర ఓపెనింగ్ కు వెళ్లాడు. అక్కడ అనుకోకుండా తారకరత్న గుండెపోటుతో కింద పడిపోవడం.. ఆయన 23 రోజుల పాటు హాస్పిటల్ లో మృత్యువుతో పోరాడి ఓడిపోవడం అందరికీ తెలిసిందే.

ఫిబ్రవరి 18న తారకరత్న కన్నుమూశాడు.
జనవరి 27వ తారకరత్న కుప్పకూలిపోయిన రోజు నుంచి ఈరోజు వరకు బాలయ్య మళ్ళీ షూటింగ్ వైపు చూడలేదు. తన అబ్బాయి కోసం తన షూటింగ్స్ అన్నీ క్యాన్సల్ చేసుకున్నాడు. అనిల్ రావిపూడితో పాటు నిర్మాతలకు కూడా ఇదే విషయం చెప్పాడు. నిజానికి ఫిబ్రవరి 5 నుంచి మొదలు కావాల్సిన అనిల్ రావిపూడి సినిమా రెండో షెడ్యూల్ ఇప్పటివరకు ఇంకా పట్టాలెక్కలేదు. మరో వారం రోజుల వరకు కూడా ఈ సినిమా షూటింగ్ మొదలయ్యేలా లేదు.

తారకరత్నకు సంబంధించిన కార్యక్రమాలు పూర్తయిన తర్వాతే షూటింగ్ వైపు వెళ్లాలని చూస్తున్నాడు నందమూరి నటసింహం. మార్చి 2న తారకరత్న పెద్దకర్మ జరగనుంది. ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి తానే చూసుకుంటున్నాడు బాలకృష్ణ.
తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి తరఫు నుంచి విజయ సాయిరెడ్డి ఈ కార్యక్రమాలు చూసుకుంటున్నాడు. కేవలం బాలకృష్ణ మాత్రమే కాదు.. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా తారకరత్న పెద్దకర్మ అయ్యేంత వరకు షూటింగ్స్ వరకు వెళ్లకూడదని డిసైడ్ అయ్యారు.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మార్చి 4 నుంచి బాలకృష్ణ, అనిల్ రావిపూడి సినిమా మళ్లీ మొదలుకానుంది. ఇందులో కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె కూడా మార్చి 4 నుంచి లొకేషన్ లో అడుగు పెట్టనుంది. ఏదైనా అబ్బాయి పోయిన బాధ నుంచి కోలుకోవాలంటే సినిమాలతో బిజీ అవ్వడం ఒక్కటే మార్గం అని ఆలోచిస్తున్నాడు బాలయ్య.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వచ్చిన కేంద్రమంత్రి.. ఎందుకంటే..

Rashmi Gautam | చేతబడి చేస్తా.. యాసిడ్‌ పోస్తా అంటూ జబర్దస్త్‌ యాంకర్‌పై సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌

Nayanthara | నయనతార సినిమాలకు గుడ్‌బై చెప్పనుందా?

Medical Student Preethi | ఉద్రిక్త పరిస్థితుల నడుమ గిర్నితండాకు ప్రీతి మృతదేహం.. నా కూతుర్ని చంపేశారంటూ గుండెలవిసేలా రోదిస్తున్న తండ్రి

Medical Student Preethi | సీనియర్లంతా ఒక్కటయ్యారు అమ్మా.. ఆత్మహత్యకు ముందు ఫోన్‌ చేసి బాధపడ్డ ప్రీతి

Triangle Love Story | నవీన్ హత్యలో నిహారికనే సూత్రధారి.. హరిహర కృష్ణ తండ్రి సంచలన ఆరోపణలు

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News