Friday, April 26, 2024
- Advertisment -
HomeEntertainmentTamanna Bhatia | నాని విలన్‌తో ప్రేమలో పడ్డ మిల్కీ బ్యూటీ .. బీ టౌన్‌లో...

Tamanna Bhatia | నాని విలన్‌తో ప్రేమలో పడ్డ మిల్కీ బ్యూటీ .. బీ టౌన్‌లో న్యూస్‌ వైరల్‌.. సీరియస్ అవుతున్న తమన్నా ఫ్యాన్స్‌

Tamanna Bhatia | మిల్కీ బ్యూటీ ప్రేమ వ్యవహారం ఇప్పుడు బీటౌన్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. డార్లింగ్స్‌, గల్లీబాయ్స్‌ వంటి చిత్రాలతో బాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న విజయ్‌ వర్మతో డేటింగ్‌లో ఉందని అక్కడి మీడియా కోడై కూస్తోంది. అన్నట్టు ఇతను నాని ఎంసీఏ సినిమాలో విలన్‌గా మెప్పించాడు. న్యూఇయర్‌ వేడుకల కోసం గోవా వెళ్లిన తమన్నా, విజయ్‌ వర్మతో ముద్దుల్లో మునిగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో వీళ్ల డేటింగ్‌ విషయం ఇప్పుడు బాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

లస్ట్‌ స్టోరీస్‌ 2 సెట్స్‌లో తమన్నా, విజయ్‌ వర్మ తొలిసారిగా కలుసుకున్నారు. నెట్‌ఫ్లిక్స్‌ కోసం రూపొందిస్తున్న ఈ వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌ సమయంలోనే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. అది కాస్త ముదరడంతో ప్రేమగా మారినట్టు తెలుస్తోంది. అప్పట్నుంచి తమన్నా, విజయ్‌ వర్మ చాలాసార్లు పబ్లిక్‌గా కనిపించారు. కానీ ఇద్దరూ ప్రేమలో ఉన్నారని ఎవరూ అనుమానించలేదు. అయితే రీసెంట్‌గా తమన్నా బర్త్‌ డే సందర్భంగా మిల్కీ బ్యూటీ ఇంట్లో కనిపించాడు విజయ్‌ వర్మ. ఆ తర్వాత దిల్జీత్‌ దొసాంజె కన్సర్ట్‌లో కూడా ఇద్దరూ కలిసి కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో కూడా ఇటీవల వైరల్‌గా మారింది. దీంతో అప్పుడే వీళ్ల ప్రేమ వ్యవహారంపై పలు రూమర్లు మొదలయ్యాయి. రీసెంట్‌గా న్యూ ఇయర్‌ వేడుకల్లో ముద్దులు పెట్టుకుంటున్న వీడియో బయటకు రావడంతో తమన్నా, విజయ్‌ వర్మ డేటింగ్‌ను బీటౌన్‌ మీడియా కన్ఫార్మ్‌ చేసేసింది. అయితే ఈ వార్తలపై తమన్నా, విజయ్‌ వర్మ ఇంకా స్పందించలేదు.

తమన్నా డేటింగ్‌పై ఆంగ్ల మీడియాలో వస్తున్న కథనాలపై ఆమె ఫ్యాన్స్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె వ్యక్తిగత జీవితం గురించి మీకెందుకు అని మండిపడుతున్నారు. వాళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని మీకు చెప్పారా అని ప్రశ్నిస్తున్నారు. వాళ్లిద్దరూ మంచి స్నేహితులు.. కలిసి పార్టీలకు వెళ్తే తప్పేంటని నిలదీస్తున్నారు. వాళ్ల మధ్య ఏదైనా ఉండి ఉంటే ఆ రిలేషన్‌షిప్‌ను అధికారికంగా ప్రకటించేదాకా ఆగితే బాగుంటుందని సోషల్‌ మీడియాలో హితవు పలుకుతున్నారు. మరి బీటౌన్‌లో వైరల్‌గా మారిన ఈ డేటింగ్‌ వార్తలపై తమన్నా ఎలా స్పందిస్తుందో చూడాలి.

Follow Us : FacebookTwitter

Read More Articles:

NTR 30 | ఎన్టీఆర్ 30పై ఆసక్తికరమైన అప్‌డేట్.. కొరటాలకు టెన్షన్ తప్పదా..?

Unstopabble with NBKS2 | పవన్ కళ్యాణ్ ను బాలకృష్ణ దాని గురించే ప్రత్యేకంగా అడిగారా..?

Hombale Films Journey | మూడు వేల కోట్లతో హోంబలే ఫిలింస్ భారీ ప్లాన్.. ఈసారి కేజీఎఫ్, కాంతారను మించిపోవాల్సిందే !

Samantha | జీవితం ఇంతకుముందులా లేదు.. వైరల్‌గా మారిన సమంత కామెంట్

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News