Friday, April 26, 2024
- Advertisment -
HomeEntertainmentUnstopabble with NBKS2 | పవన్ కళ్యాణ్ ను బాలకృష్ణ దాని గురించే ప్రత్యేకంగా అడిగారా..?

Unstopabble with NBKS2 | పవన్ కళ్యాణ్ ను బాలకృష్ణ దాని గురించే ప్రత్యేకంగా అడిగారా..?

Unstopabble with NBKS2 | అన్‌స్టాపబుల్ రెండు సీజన్లలో ఇప్పటి వరకు ఏ ఎపిసోడ్‌కు రానంత హైప్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్‌కు వచ్చింది. బాలయ్య టాక్ షోకి పవర్ స్టార్ వస్తున్నాడని తెలిసిన వెంటనే అభిమానుల్లో సంబరాలు అంబరాన్ని తాకాయి. అన్నపూర్ణ స్టూడియోస్‌లో పవన్ షూటింగ్ కు వస్తున్నాడని తెలిసాక అభిమానులు పండగ స్టార్ట్ చేశారు. పెద్ద పెద్ద బ్యానర్లు కట్టి.. హోర్డింగ్గ్స్ తో స్వాగతం పలికారు. బాలకృష్ణ కూడా పవన్ కళ్యాణ్ కు ఎదురెళ్లి మరి సాదర స్వాగతం పలికాడు. ఇదిలా ఉంటే ఈ ఎపిసోడ్ ఎలా సాగింది.. ఇందులో పవన్ కళ్యాణ్‌ను బాలకృష్ణ ఎలాంటి ప్రశ్నలు అడిగి ఉంటారనే ఆసక్తి అభిమానుల్లో కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఆయన వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్నించారా లేదా.. రాజకీయాల్లో వైఫల్యాల గురించి చర్చ జరిగిందా లేదా అనే విషయంపై ఎక్కువగా బయట చర్చ జరుగుతుంది.

వీటన్నింటికీ క్లారిటీ ఇప్పుడు వచ్చేసింది. ఎలాంటి దాపరికాలు లేకుండా.. మొహమాటలు లేకుండా అడగాల్సిన ప్రతి ప్రశ్నను బాలకృష్ణ ముక్కుసూటిగా పవన్ కళ్యాణ్‌ను అడిగినట్లు తెలుస్తోంది. ఆయన వ్యక్తిగత జీవితం నుంచి మొదలుపెట్టుకొని.. ప్రజారాజ్యం సమయంలో యువరాజ్యం తరఫున పవన్ చేసిన ప్రచారం గానీ.. ఆ సమయంలో రాజకీయ నాయకులపై పవన్ కళ్యాణ్ సంధించిన విమర్శనాస్త్రాల గురించి అన్నింటిపై అన్‌స్టాపబుల్ షోలో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. దాంతోపాటు జనసేన పార్టీ పెట్టడం.. మలి ఎన్నికల్లో ఓటమి.. పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోవడం.. ఇలా ఒక్కటేమిటి చాలా విషయాల గురించి పవన్ కళ్యాణ్, బాలయ్య చర్చించుకున్నారు. సంక్రాంతికి ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది. పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే.. రేపు ఎపిసోడ్ విడుదలైన తర్వాత ఎలా ఉంటుందో అని ఇప్పటినుంచే అంచనాలు వేస్తున్నారు అభిమానులు.

Follow Us : FacebookTwitter

Read More Articles:

Jeremy Renner | బాంబ్ సైక్లోన్ ఎఫెక్ట్.. తీవ్రంగా గాయపడ్డ అవెంజర్స్ ఫేమ్ మార్వెల్ సూపర్ హీరో జెరెమీ రెన్నర్‌.. పరిస్థితి విషమం

Jabardast Comedian Kiraak RP | బంపర్ రెస్పాన్స్ ఉన్నా కిరాక్ ఆర్పీ చేపల పులుసు దుకాణం మూసేశాడు.. పగోడికి కూడా ఆ కష్టం రావద్దు

Kajal Aggarwal | అమ్మో.. రీఎంట్రీలో కూడా కాజల్ అగర్వాల్ అంత డిమాండ్ చేస్తుందా?

Aadi Saikumar | వరుస ఫ్లాప్స్ వచ్చినా కూడా ఆదికి వరుస ఆఫర్లు ఎలా వస్తున్నాయి?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News