Thursday, March 28, 2024
- Advertisment -
HomeEntertainmentPunarnavi | ఆ వ్యాధితో న్యూ ఇయర్ ప్రారంభిస్తున్నా.. ఎమోషన్ అయిన బిగ్‌బాస్ బ్యూటీ పునర్నవి

Punarnavi | ఆ వ్యాధితో న్యూ ఇయర్ ప్రారంభిస్తున్నా.. ఎమోషన్ అయిన బిగ్‌బాస్ బ్యూటీ పునర్నవి

Punarnavi bhupalam | న్యూ ఇయర్‌ వేళ బ్యాడ్‌ న్యూస్‌ చెప్పింది బిగ్‌ బాస్‌ బ్యూటీ పునర్నవి భూపాలం. మయోసైటిస్‌ బారిన పడినట్టు గత ఏడాది సమంత ప్రకటించి అందరికీ షాకివ్వగా.. ఈ కొత్త సంవత్సరంలో తన అనారోగ్యం గురించి బయటపెట్టింది పునర్నవి. ఊపిరితిత్తుల సమస్యతో కొత్త ఏడాదిని ప్రారంభిస్తున్నా.. నేను అనారోగ్యం బారిన పడటం ఇదే చివరిది కావాలని కోరుకుంటున్నా అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్‌ పోస్టు పెట్టింది. అలాగే మరో ఫొటోను షేర్‌ చేస్తూ ఇప్పటికీ అనారోగ్యంగానే ఉన్నానంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. పునర్నవి చేసిన పోస్టులు చూసి అభిమానులు, నెటిజన్లు ఆందోళన చెందుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

2013లో వచ్చిన ఉయ్యాలా జంపాలా సినిమాలో హీరోయిన్‌ స్నేహితురాలిగా పునర్నవి తొలిసారి వెండితెరపై కనిపించింది. ఆ తర్వాత ఆడపాదడపా సినిమాల్లో నటించినా గుర్తింపు రాలేదు. కానీ బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 3 ఆమె జీవితాన్ని మార్చేసింది. సినిమాల్లో నటిస్తే రాని గుర్తింపు ఈ ఒక్క రియాలిటీ షోతో సంపాదించుకుంది. బిగ్ బాస్‌ షోతో వచ్చిన క్రేజ్‌తో పునర్నవికి వరుస ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలో ఎందుకో ఏమో, ఒక చిన్న విరామం వంటి సినిమాల్లో నటించింది. ఆ తర్వాత కూడా సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ వాటిని పక్కనబెట్టి ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లింది.

లండన్‌లో సైకాలజీలో హయ్యర్‌ స్టడీస్‌ చేస్తోంది. లండన్‌ వెళ్లినప్పటికీ సోషల్‌ మీడియాలో పోస్టులతో అభిమానులకు చేరువుగానే ఉంది పునర్నవి. అప్పుడప్పుడు లైవ్‌ చాట్‌లో ఫ్యాన్స్‌తో ముచ్చటిస్తుంది కూడా. అయితే కొద్దిరోజులుగా సైలెంట్‌గా పునర్నవి.. ఇప్పుడు కొత్త సంవత్సరంలో తన అనారోగ్యం గురించి బయటపెట్టడంతో అభిమానులు షాకవుతున్నారు. ఇంత చిన్న వయసులో పునర్నవి ఇలాంటి సమస్య బారిన పడటం బాధాకరమని సానుభూతి తెలుపుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్లు పెడుతున్నారు.

Follow Us : FacebookTwitter

Read More Articles:

NTR 30 | ఎన్టీఆర్ 30పై ఆసక్తికరమైన అప్‌డేట్.. కొరటాలకు టెన్షన్ తప్పదా..?

Unstopabble with NBKS2 | పవన్ కళ్యాణ్ ను బాలకృష్ణ దాని గురించే ప్రత్యేకంగా అడిగారా..?

Hombale Films Journey | మూడు వేల కోట్లతో హోంబలే ఫిలింస్ భారీ ప్లాన్.. ఈసారి కేజీఎఫ్, కాంతారను మించిపోవాల్సిందే !

Samantha | జీవితం ఇంతకుముందులా లేదు.. వైరల్‌గా మారిన సమంత కామెంట్

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News