Wednesday, April 24, 2024
- Advertisment -
HomeEntertainmentNTR 30 | ఎన్టీఆర్ 30పై ఆసక్తికరమైన అప్‌డేట్.. కొరటాలకు టెన్షన్ తప్పదా..?

NTR 30 | ఎన్టీఆర్ 30పై ఆసక్తికరమైన అప్‌డేట్.. కొరటాలకు టెన్షన్ తప్పదా..?

NTR 30 | ఇదిగో పులి అదిగో మేక అన్నట్టుంది జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ సినిమా పరిస్థితి. ఆరు నెలల కింద ఈ సినిమా మోషన్ పోస్టర్ విడుదల చేశారు. కానీ ఇప్పటివరకు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాలేదు. ఇప్పుడు అప్పుడు అని చెప్తున్నారు కానీ.. ఆ అప్పుడు ఎప్పుడో మాత్రం ఇప్పటి వరకు చెప్పలేదు దర్శక నిర్మాతలు. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఈ సినిమా కోసం చూస్తున్నారు. జనవరిలో సినిమా షూటింగ్ మొదలవుతుందని వేయికళ్లతో వేచి చూస్తున్న ఫ్యాన్స్ కు మరోసారి నిరాశే ఎదురయ్యేలా కనిపిస్తోంది. ఎందుకంటే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరిలో మొదలవడం దాదాపు అసాధ్యం. దానికి చాలా కారణాలు ఉన్నాయి.

ఇప్పటికే బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ అయిపోయింది. తారక్ వస్తే షెడ్యూల్స్ వేసుకొని షూటింగ్ చేయడమే తరువాయి. అయితే సంక్రాంతి తర్వాత రోజులు బాగోలేవు అనే కారణంతో మరో 20 రోజులు ఆలస్యంగా కొరటాల శివ సినిమా మొదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ జనవరి 11న ఇండియాకు రాబోతున్నాడు. వచ్చిన తర్వాత సంక్రాంతి పండుగను కుటుంబంతో పాటు సెలబ్రేట్ చేసుకొని.. ఆ తర్వాత కొరటాల సినిమాపై కాన్సన్‌ట్రేట్ చేయనున్నాడు. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం జనవరి 30 లేదంటే 31న పూజా కార్యక్రమాలు మొదలు పెట్టి.. ఫిబ్రవరి మొదటి వారంలో రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లాలని చూస్తున్నారు.

ఆరు నెలల పాటు ఏకధాటిగా షూటింగ్ ప్లాన్ చేస్తున్నాడు కొరటాల శివ. ఇప్పటికే అనుకున్న దాని కంటే చాలా ఆలస్యం కావడంతో.. ఇకపై ఎలాంటి బ్రేక్స్ లేకుండా షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అన్నీ కుదిరితే ఫిబ్రవరిలో సినిమాను మొదలు పెట్టి.. దసరాకు విడుదల చేయాలని చూస్తున్నారు. 2018 దసరాకు అరవింద సమేత సినిమాతో వచ్చిన ఎన్టీఆర్ మంచి విజయం అందుకున్నాడు. అదే సెంటిమెంట్ ఇప్పుడు రిపీట్ చేయాలని చూస్తున్నాడు తారక్. మరోవైపు ఆచార్య డిజాస్టర్ తో డీలా పడిపోయిన కొరటాలకు జూనియర్ ఎన్టీఆర్ సినిమా అత్యంత కీలకంగా మారింది.

Read More Articles:

Jeremy Renner | బాంబ్ సైక్లోన్ ఎఫెక్ట్.. తీవ్రంగా గాయపడ్డ అవెంజర్స్ ఫేమ్ మార్వెల్ సూపర్ హీరో జెరెమీ రెన్నర్‌.. పరిస్థితి విషమం

Jabardast Comedian Kiraak RP | బంపర్ రెస్పాన్స్ ఉన్నా కిరాక్ ఆర్పీ చేపల పులుసు దుకాణం మూసేశాడు.. పగోడికి కూడా ఆ కష్టం రావద్దు

Kajal Aggarwal | అమ్మో.. రీఎంట్రీలో కూడా కాజల్ అగర్వాల్ అంత డిమాండ్ చేస్తుందా?

Aadi Saikumar | వరుస ఫ్లాప్స్ వచ్చినా కూడా ఆదికి వరుస ఆఫర్లు ఎలా వస్తున్నాయి?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News