Thursday, December 7, 2023
- Advertisment -
HomeEntertainmentShweta basu prasad | కొత్త బంగారు లోకం హీరోయిన్ ఏంటి ఇలా మారిపోయింది?

Shweta basu prasad | కొత్త బంగారు లోకం హీరోయిన్ ఏంటి ఇలా మారిపోయింది?

Shweta basu prasad | కొత్త బంగారు లోకం సినిమా హీరోయిన్ శ్వేత బసు ప్రసాద్ గుర్తుందా? అమాయకపు చూపుతో.. కల్మషం లేని నవ్వుతో.. ఎక్కడా…. అంటూ సాగదీసి ముద్దు ముద్దుగా మాట్లాడుతూ అప్పట్లో కుర్రకారు గుండెలను కొల్లగొట్టింది. ఒక్క సినిమాతోనే స్టార్ డమ్ తెచ్చుకున్న శ్వేత బసుకు తర్వాత కలిసిరాలేదు. కెరీర్ మొదట్లో ఆమె వేసిన తప్పటడుగుల కారణంగా వరుస ఫ్లాపులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒకవైపు సినిమాలు లేకపోవడం.. మరోవైపు వ్యక్తిగత సమస్యలు ఆమెను చాలా ఇబ్బందులు పెట్టాయి. దీంతో ఎంత ప్రయత్నించినా సినిమాల్లో సక్సెస్ కాలేకపోయింది. టాలీవుడ్‌లో నిలదొక్కుకోలేకపోయింది. దీంతో బాలీవుడ్ వెళ్లి అక్కడ సీరియల్స్ చేసుకుంటుంది. దీంతో ఈమెను అంతా మరిచిపోయారు. తాజాగా ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎలా ఉండే శ్వేత బసు ప్రసాద్.. ఎలా అయిపోయిందంటూ గుర్తు చేసుకుంటున్నారు.

జనవరి 11న శ్వేతబసు ప్రసాద్ తన బర్త్ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఆ ఫొటోలను చూసిన నెటిజన్లు అసలు శ్వేత బసు ప్రసాద్‌ను గుర్తుపట్టలేకపోయారు. ఇలా అయిపోయిందేంటని చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పూర్తిగా మారిపోయిందంటూ కామెంట్లు పెడుతున్నారు.

శ్వేత బసు ప్రసాద్ చైల్డ్ఆర్టిస్ట్‌గా 2002లో హిందీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2005లో ఇక్బాల్ అనే సినిమాతో హీరోయిన్‌గా మారింది. పలు బెంగాలీ సినిమాల్లోనూ నటించింది. కానీ తెలుగులో చేసిన కొత్త బంగారు లోకం సినిమా శ్వేత బసుకు బిగ్గెస్ట్ హిట్ అందించింది. ఈ సినిమాతో స్టార్ అయిపోయింది. కానీ ఆ సినిమా సక్సెస్‌ను సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయింది. కథల ఎంపికలో తప్పిదాల వల్ల సక్సెస్ కాలేకపోయింది. దీంతో జీనియస్ సినిమాలో డిబిరి.. డిబిరి అనే ఐటెం సాంగ్ కూడా చేసింది. అది కూడా బ్రేక్ ఇవ్వలేదు.

అదే సమయంలో ప్రియుడితో బ్రేకప్ కుంగదీసింది. అప్పుడే ఓ కేసులో కూడా ఇరుక్కుంది. దీంతో డిప్రెషన్‌లోకి కూడా వెళ్లిపోయింది. కోలుకున్న తర్వాత 2018లో డైరెక్టర్ రోహిత్ మిట్టల్‌ను వివాహం చేసుకుంది. కానీ ఆ బంధం కనీసం ఏడాది కూడా నిలబడలేదు. రోహిత్ మిట్టల్‌తో విడాకుల తర్వాత పలు హిందీ సీరియల్స్‌లో నటిస్తూ బిజీ అయ్యింది. అప్పుడప్పుడు తన ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులకు టచ్‌లోకి వెళ్తుంది. ఈక్రమంలోనే తాజాగా బర్త్ డే నాడు శ్వేత బసు ప్రసాద్ పోస్టు చేసిన ఫొటోలు వైరల్‌గా మారాయి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Kushboo | జయసుధ కోసం వారసుడు సినిమా నుంచి కుష్బూను తప్పించారా?

Jayasudha | అమెరికన్ బిజినెస్‌మ్యాన్‌తో జయసుధ మూడో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన సహజనటి

Veerasimhareddy first day collections | తొలిరోజే హాఫ్ సెంచరీ కొట్టిన బాలకృష్ణ.. కెరీర్ హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా రికార్డు

Waltair Veerayya Review | వాల్తేరు వీరయ్య రివ్యూ.. చిరంజీవి, రవితేజ పూనకాలు తెప్పించారా?

Veerasimha reddy Review | వీరసింహారెడ్డి రివ్యూ.. బాలయ్య మాస్ ఫార్ములా వర్కవుట్ అయ్యిందా?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News