Saturday, April 20, 2024
- Advertisment -
HomeLatest NewsIndia Vs Sri Lanka | మూడో వన్డేలో భారత్ భారీ స్కోరు.. సెంచరీలతో చెలరేగిన...

India Vs Sri Lanka | మూడో వన్డేలో భారత్ భారీ స్కోరు.. సెంచరీలతో చెలరేగిన విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్

India Vs Sri Lanka | తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ స్టేడియం వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 390 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ మరోసారి చెలరేగిపోయాడు. 110 బంతుల్లో 166 పరుగులతో శ్రీలంకకు విశ్వరూపం చూపించాడు. వీటిలో 13 ఫోర్లు, 8 సిక్స్‌లు ఉన్నాయి. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కూడా రెచ్చిపోయాడు. 97 బంతుల్లో 116 పరుగులు చేశాడు. దీంతో భారత్ భారీ స్కోర్ చేయగలిగింది. ఇప్పటికే 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్.. క్లీన్ స్వీప్‌పై కన్నేసింది. మరోవైపు ఎలాగైన చివరి వన్డేలో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని శ్రీలంక భావిస్తోంది. కానీ కొండత స్కోరు చేయడం శ్రీలంకకు కష్టమే.

టాస్ గెలిచిన టీమిండియా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి మూడు ఓవర్లకు భారత్ స్కోరు కేవలం 5 పరుగులే. ఆరో ఓవర్‌లో శుభ్‌మన్ గిల్ దూకుడు పెంచాడు. ఆరో ఓవర్‌లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్‌తో జోరు పెంచాడు. దూకుడుగా ఆడుతున్న రోహిత్ శర్మ తొలి వికెట్‌గా 42 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. దీంతో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ.. గిల్ ఇద్దరూ కలిసి ఆచుతూచి ఆడారు. ఆ తర్వాత విశ్వరూపం చూపించారు. 31 ఓవర్లో ఐదో బంతికి సింగిల్ తీసి కోహ్లీ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అదే ఓవర్‌లో చివరి బంతికి గిల్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. 89 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. అయితో 34 ఓవర్లో రజిత బౌలింగ్‌లో గిల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

43 ఓవర్లో సింగిల్ తీసిన కోహ్లీ వన్డేల్లో 46వ శతకాన్ని పూర్తి చేశాడు. అప్పటికి భారత్ స్కోరు 303 పరుగులు. సెంచరీ తర్వాత విరాట్ కోహ్లీ దూకుడు పెంచాడు. చివరి 7 ఓవర్లలో భారత్ 87 పరుగులు చేయగలిగింది. ఇందులో కోహ్లీ చేసినవే 66 పరుగులు కావడం విశేషం. అయితే శ్రేయస్ అయ్యర్ 38 పరుగులు, కేఎల్ రాహుల్ 7 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 4 పరుగులు చేసి ఔటయ్యారు. శ్రీలంక బౌలర్లలో లహిరు కుమార, కసున్ రజిత తలో రెండు వికెట్లు తీశారు. కరుణ రత్నె ఒక వికెట్ తీశాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Amartya Sen | బీజేపీకి ఎదురులేదు అనుకోవద్దు.. 2024లో ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర.. నోబెల్ గ్రహీత అమర్త్య సేన్ కీలక వ్యాఖ్యలు

Women’s Under 19 T20 World Cup | మహిళల అండర్ 19 ప్రపంచ కప్‌లో భారత్ విజయం.. దంచికొట్టిన ఓపెనర్లు

Rajamouli | ప్రభాస్ ముందు హృతిక్ నథింగ్.. బాలీవుడ్ హీరోపై చేసిన కామెంట్స్‌పై రాజమౌళి వివరణ

CM KCR | టీచర్లకు సీఎం కేసీఆర్ సంక్రాంతి కానుక.. రెండు రోజుల్లో షెడ్యూల్

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News