Friday, April 26, 2024
- Advertisment -
HomeEntertainmentPrabhas | ప్రభాస్‌కు అస్వస్థత.. షూటింగ్స్ అన్నీ క్యాన్సిల్

Prabhas | ప్రభాస్‌కు అస్వస్థత.. షూటింగ్స్ అన్నీ క్యాన్సిల్

Prabhas | పాన్ ఇండియా స్టార్ అయిన తర్వాత ప్రభాస్ తీరిక లేకుండా గడిపేస్తున్నాడు. వరుస ప్రాజెక్టులతో బిజీగా గడిపేస్తున్నాడు. ఇప్పటికే ఆదిపురుష్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ప్రభాస్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. అలాగే మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్ సినిమా షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే షెడ్యూల్ కూడా మొదలుపెట్టేశాడు. ఇవి కాకుండా మరో మూడు నాలుగు ప్రాజెక్టులు ప్రభాస్ చేతిలో ఉన్నాయి. వీటన్నింటినీ ప్రభాస్ ఎప్పుడు కంప్లీట్ చేస్తాడా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పుడు సెట్స్ మీద ఉన్న మూడు సినిమాల షూటింగ్‌లు అర్ధంతరంగా ఆగిపోయాయి. ప్రభాస్ అస్వస్థతతకు గురికావడం వల్లే వీటి షూటింగ్ క్యాన్సిల్ అయినట్టు ప్రచారం జరుగుతోంది.

ప్రభాస్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడట. అందుకే షూటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుని ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే కంగారు పడాల్సిన పనేం లేదని ప్రభాస్ సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ఆరోగ్యం బాగానే ఉందని చెబుతున్నారు. రెస్ట్ లేకుండా వరుసగా సినిమాల షూటింగ్స్‌లో పాల్గొనడం వల్లే ఆయన జ్వరం బారిన పడ్డారని అంటున్నారు. విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని చెబుతున్నారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ రిలాక్స్ అయ్యారు.

మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న రాజా డీలక్స్ కొత్త షెడ్యూల్ ఈ నెలలో రామోజి ఫిలింసిటీలో మొదలు పెట్టాల్సి ఉంది. ఈ షెడ్యూల్‌లో ప్రభాస్‌తో పాటు ప్రధాన నటీనటులతో కీలక సన్నివేశాలు తెరకెక్కించాలని మారుతి ప్లాన్ చేసుకున్నాడు. కానీ జ్వరం కారణంగా ప్రభాస్ ఇంటికే పరిమితం కావడంతో ఆ షెడ్యూల్ కూడా వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Turkey Earthquake | ప్రకృతి ప్రకోపానికి 3800 మంది బలి.. చిగురుటాకులా వణికిపోతున్న తుర్కియే, సిరియా

Bhanupriya | మెమొరీ లాస్‌తో బాధపడుతున్న సీనియర్ హీరోయిన్.. సెట్స్‌లో డైలాగులు కూడా గుర్తుండట్లేదట

Jabardasth Varsha | రాత్రికి రాత్రే ఎంగేజ్‌మెంట్ ఫిక్స్ చేశారు.. వీడియో పోస్టు చేసిన జబర్దస్త్ వర్ష.. ఏకిపారేస్తున్న నెటిజన్లు

Allu Aravind | ఆమెకు ఆ అవసరం లేదు.. అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డిపై అల్లు అరవింద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Sundeep Kishan | రెజీనాతో డేటింగ్‌పై క్లారిటీ ఇచ్చిన యంగ్ హీరో సందీప్ కిషన్

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News