Sunday, March 26, 2023
- Advertisment -
HomeEntertainmentRasha Thadani | బాలీవుడ్‌లోకి మరో స్టార్‌ కిడ్‌.. హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న కేజీఎఫ్‌ నటి...

Rasha Thadani | బాలీవుడ్‌లోకి మరో స్టార్‌ కిడ్‌.. హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న కేజీఎఫ్‌ నటి కూతురు

Rasha Thadani | నెపోటిజంపై బాలీవుడ్‌లో ఇప్పటికే పెద్ద చర్చ జరుగుతోంది. వారసత్వం కారణంగా టాలెంట్‌ ఉన్న నటులు ఇండస్ట్రీకి దూరం కావాల్సి వస్తుందని ఎప్పట్నుంచో వాదన వినిపిస్తుంది. సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్‌ మరణానికి కూడా నెపోటిజమే కారణమని ఆరోపణలు ఉన్నాయి. ఇదే #boycottbollywood ట్రెండ్‌కు కూడా ఆజ్యం పోసిందని చెప్పొచ్చు. ఇలా బాయ్‌కాట్‌ ట్రెండ్‌తో బాలీవుడ్ సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలో మరో స్టార్‌ కిడ్‌ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఆమె ఎవరో కాదు రవీనా టాండన్‌ కూతురు రాషా థదానీ‌.

హిందీలో 90ల్లో స్టార్‌ హీరోయిన్‌గా ఒక ఊపు ఊపిన రవీనా టాండన్‌ తెలుగులో కూడా పలు సినిమాలు చేసింది. బాలకృష్ణతో బంగారు బుల్లోడు సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈమె.. రథసారధి, ఆకాశవీధిలో.., పాండవులు పాండవులు తుమ్మెద సినిమాల్లో నటించింది. రీసెంట్‌గా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన కేజీఎఫ్‌ చిత్రంలోనూ కీలక పాత్రలో అదరగొట్టింది. రాకింగ్‌ స్టార్‌ యశ్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రమికా సేన్‌ అనే పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌లో జీవించింది. ఈ పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడు ఈమె వారసురాలు రాషా థదానీ కూడా సినిమాల్లోకి రాబోతుంది.

అజయ్‌ దేవగణ్‌ మేనల్లుడు ఆమన్‌ దేవగణ్‌ హీరోగా వస్తున్న ఓ సినిమాలో రాషా టాండన్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు బీటౌన్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌, ఫర్హాన్‌ అక్తర్‌, రాజ్‌కుమార్‌ రావు, సారా అలీఖాన్‌ వంటి ఎంతోమంది యంగ్‌ టాలెంటెడ్‌ యాక్టర్స్‌ను అభిషేక్‌ కపూర్‌ బాలీవుడ్‌కు పరిచయం చేశాడు. ఇప్పుడు రాషాను కూడా హీరోయిన్‌గా పరిచయం చేస్తుండటంతో బాలీవుడ్‌ కళ్లన్నీ ఆమెపైనే ఉన్నాయి. అభిషేక్ కపూర్‌ బ్యానర్‌లో సినిమా మొదలు కాకముందే రాషాకు మరిన్ని బడా నిర్మాణ సంస్థల నుంచీ ఆఫర్లు వస్తున్నాయట. మరి అమ్మలాగే రాషా కూడా బాలీవుడ్‌లో రాణిస్తుందో చూడాలి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Singer Mangli | సింగర్ మంగ్లీ కారుపై బళ్లారిలో రాళ్ల దాడి.. దాడికి కారణం అదేనా!

Kartik Aaryan | 10 రోజుల షూటింగ్ కోసమే రూ.20 కోట్లు తీసుకున్న బాలీవుడ్ యంగ్ హీరో

aparna balamurali | కంప్లయింట్ ఇచ్చేంత టైమ్ లేదు.. విద్యార్థి అనుచిత ప్రవర్తనపై అపర్ణ బాలమురళి రియాక్షన్

Rashmika Mandanna | అది తెలిసే విజయ్‌తో ఒప్పుకున్నా.. అసలు విషయం బయటపెట్టిన రష్మిక మంధన్నా

Rakul Preet Singh | నాతో షూటింగ్ చేసి.. వేరే హీరోయిన్‌ను తీసుకునేవాళ్లు.. నాటి రోజులు గుర్తు చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
500SubscribersSubscribe

Recent News