Saturday, July 13, 2024
- Advertisment -
HomeLatest NewsSmith Sabharwal | తెలంగాణ ఐఏఎస్‌ అధికారిణి ఇంట్లోకి అర్థరాత్రి ప్రవేశించిన వ్యక్తి ఎవరు.. దాని...

Smith Sabharwal | తెలంగాణ ఐఏఎస్‌ అధికారిణి ఇంట్లోకి అర్థరాత్రి ప్రవేశించిన వ్యక్తి ఎవరు.. దాని గురించి ఆమె ఏమన్నారు!

Smith Sabharwal | తెలంగాణలో డైనమిక్‌ లేడీ ఐఏఎస్‌ ఆఫీసర్‌ గా పేరు తెచ్చుకున్న స్మితా సబర్వాల్ కు ఓ చేదు అనుభవం ఎదురైంది. ఆమె ఇంటికి అర్థరాత్రి పూట ఓ డిప్యూటీ తహసీల్దార్‌ రావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆమె గట్టిగా కేకలు వేయడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమై అతడిని అదుపులోనికి తీసుకున్నారు.

అసలేంజరిగిందంటే..

స్మితా సబర్వాల్‌ ఐఏఎస్‌ అధికారిణిగా తెలంగాణ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు వహిస్తున్నారు. ఆమె సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌ గా ఉంటారు. జూబ్లీహిల్స్‌ ప్రాంతంలో ఓ గెటెడ్‌ కమ్యూనిటీలో నివాసం ఉంటున్న ఆమె ఇంటికి రాత్రి వేళ నేరుగా ఓ డిప్యూటీ తహసీల్దార్‌ ఇంట్లోకి వచ్చాడు. అతడిని చూసిన స్మితా గట్టిగా అరవడంతో అక్కడే ఉన్న సెక్యూరిటీ అతడిని అదుపులోనికి తీసుకున్నారు. సోషల్‌ మీడియాలో స్మితా చేసిన ట్వీట్లకు ఓ డిప్యూటీ తహసీల్దార్‌ రెండు సార్లు రీ ట్వీట్లు చేశారు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం రాత్రి సదరు డిప్యూటీ తహసీల్దార్‌ నేరుగా ఆమె ఉండే నివాస సముదాయానికి వెళ్లాడు. తన స్నేహితుడైన ఓ హోటల్‌ యజమానిని తోడు తీసుకుని వెళ్లాడు. తాను ఫలానా క్వార్టర్‌ కు వెళ్లాలని సిబ్బందికి చెప్పడంతో వారు లోపలికి వెళ్లేందుకు అనుమతిచ్చారు. ఫ్రెండ్‌ ని కారులోనే ఉంచి డిప్యూటీ తహసీల్దార్‌ మాత్రమే ఆమె ఇంట్లోకి వెళ్లాడు. లోపలికి ప్రవేశించి గది తలుపు కొట్టాడు. డోర్‌ తెరిచిన స్మితాకి రాత్రి సమయంలో ఎదురుగా గుర్తు తెలియని వ్యక్తి కనిపించడంతో తీవ్రంగా భయపడ్డారు.

వెంటనే ఆమె ఎవరని గట్టిగా నిలదీయడంతో … అతను నేను మీకు గతంలో ట్వీట్‌ చేశానని.. నా ఉద్యోగం గురించి మాట్లాడేందుకు వచ్చానని సమాధానం చెప్పినట్లు తెలిసింది. దీంతో ఆగ్రహానికి గురైన ఆమె బయటికి వెళ్లాలని చెప్తూ గట్టిగా కేకలు వేసింది. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. డిప్యూటీ తహసీల్దార్‌ తో పాటు అతడి స్నేహితుడిని కూడా అరెస్ట్‌ చేసి రిమాండ్‌ కు తరలించారు. సదరు డిప్యూటీ తహసీల్దార్‌ ని మేడ్చల్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అయితే అతను కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం.

ఈ ఘటన గురించి స్మితా స్పందించారు. తన ఇంట్లోకి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తిని చూడగానే చాలా భయపడ్డాను. ఆ రోజు రాత్రి తనకు ఎంతో బాధాకరమైన అనుభవం ఎదురైంది. అయితే తనను తాను రక్షించుకోవడం గురించి తాను దృష్టి పెట్టినట్లుగా ట్వీట్‌ చేశారు. మీరు సురక్షితంగా ఉన్నారని భావించినప్పటికీ ఎప్పుడూ కూడా తలుపులు, తాళాలు తనిఖీ చేసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 100 నెంబర్‌ కు డయల్‌ చేయాలంటూ ఆమె ట్వీట్‌ చేశారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Singer Mangli | సింగర్ మంగ్లీ కారుపై బళ్లారిలో రాళ్ల దాడి.. దాడికి కారణం అదేనా!

Breaking News | హైదరాబాద్‌లో హత్య కేసులో సంచలన విషయాలు.. సోదరితో ప్రేమ వివాహమే హత్యకు కారణమన్న పోలీసులు

Breaking News | హైదరాబాద్‌లో నడిరోడ్డుపై యువకుడి దారుణ హత్య.. స్పందించని స్థానికులు

Che guevara | హైదరాబాద్‌కు చే గువేరా కుమార్తె, మనవరాలు.. రవీంద్ర భారతి క్యూబా సంఘీభావ సభలో పాల్గొననున్న శ్రీనివాస్ గౌడ్, రేవంత్ రెడ్డి

KTR | ముగిసిన కేటీఆర్ దావోస్ పర్యటన.. వామ్మో తెలంగాణకు అన్ని కోట్ల పెట్టుబడులా?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News