Friday, April 26, 2024
- Advertisment -
HomeEntertainmentAadi Saikumar | వరుస ఫ్లాప్స్ వచ్చినా కూడా ఆదికి వరుస ఆఫర్లు ఎలా వస్తున్నాయి?

Aadi Saikumar | వరుస ఫ్లాప్స్ వచ్చినా కూడా ఆదికి వరుస ఆఫర్లు ఎలా వస్తున్నాయి?

Aadi Saikumar | ఇండస్ట్రీలో కొంతమంది హీరోలు ఉంటారు. వారికి ఎన్ని ఫ్లాపులు వచ్చినా సరే వరుస అవకాశాలు పొందుతారు. అలాంటి వాళ్లలో ఆది సాయికుమార్ ముందుంటాడు. ఈ యంగ్ హీరోకి ఎన్ని ఫ్లాపులు వచ్చినా సరే వరుస అవకాశాలు అందుకుంటున్నాడు. ఆది సాయికుమార్ నటించిన టాప్ గేర్ సినిమా ఈ మధ్యే రిలీజైంది. ఈ సినిమాకు పెద్దగా కలెక్షన్స్ ఏమీ రాలేవు. అయినప్పటికీ ఆదికి వరుస అవకాశాలు వస్తున్నాయి. కనీసం ఓపెనింగ్స్ కూడా రాకున్నా కానీ ఆదిని దర్శక నిర్మాతలు ఎందుకు నమ్ముతున్నారు? అతనితో ఎందుకు సినిమాలు తీస్తున్నారని ఎప్పుడైనా ఆలోచించారా?

ఆది సాయికుమార్‌ను దర్శక నిర్మాతలు నమ్మి సినిమాలు తీయడం వెనుక ఓ కారణం ఉంది. ఆది సినిమాకు కలెక్షన్స్ రూపంలో కాకపోయినా సరే మరోలా బిజినెస్ జరుగుతుంది. అది ఎలా అంటే.. ఆది సాయికుమార్ డ్యాన్స్ స్టెప్పులు బాగా వేస్తాడు. ఫైట్స్ కూడా చేస్తాడు. డైలాగ్ డెలివరీ కూడా బాగుంటుంది. కాబట్టి ఆదితో చేసిన సినిమాలకు థియేటర్‌లో కాకపోయినా బుల్లితెరపై మంచి రెస్పాన్స్ వస్తుంది. దీంతో థియేట్రికల్, శాటిలైట్, డిజిటల్ రైట్స్ అన్నీ కలిపి 5 కోట్ల వరకు వస్తాయని ఇండస్ట్రీలో ప్రచారం ఉంది. ఆది సాయికుమార్ సినిమాలకు డబ్బింగ్ రైట్స్ రూపంలో మరో 5 కోట్ల వరకు వస్తాయని సమాచారం. మొత్తంగా ఆది సినిమాకు అన్ని రైట్స్ కలుపుకుని దాదాపు 10కోట్ల వరకు వస్తాయి. కానీ ఆదితో సినిమా చేయాలంటే 4 కోట్ల బడ్జెట్ సరిపోతుంది. అంటే ఆదితో సినిమా చేస్తే నిర్మాతలకు ఎటు తిరిగి 6 కోట్ల వరకు లాభాలు వస్తాయి. అందుకే ఆది సాయికుమార్ సినిమాలు ఫ్లాప్ అయినా సరే నిర్మాతలు వరుసగా ఆఫర్లు ఇస్తున్నారు.

యంగ్ హీరో రాజ్ తరుణ్‌ విషయంలో కూడా ఇదే ఫార్ములా వర్కవుట్ అవుతుంది. ఈయనతో సినిమా చేస్తే డబ్బింగ్ రైట్స్ రూపంలో 4 కోట్లు, డిజిటల్ ,శాటిలైట్ రైట్స్ రూపంలో మరో 6 కోట్ల వరకు వస్తాయి. అంటే రాజ్ తరుణ్ సినిమాలకు కూడా రూ.10 కోట్లు ఏటు పోవు. అందుకే రాజ్ తరుణ్‌కు కూడా వరుస ఫ్లాపులు వచ్చినా సినిమాలు చేయడానికి నిర్మాతలు ముందుకొస్తున్నారు.

Follow Us : FacebookTwitter

Read More Articles:

Rashmika Mandanna | రష్మికకు కాంతారా డైరెక్టర్‌కు మధ్య గొడవలేంటి? ఎందుకు ఆమెను ట్రోల్‌ చేస్తున్నారు?

Poorna | తల్లి కాబోతున్న నటి పూర్ణ.. న్యూఇయర్‌ వేళ గుడ్‌న్యూస్‌ షేర్‌ చేసుకున్న మలయాళ బ్యూటీ

Unstoppable | అన్‌స్టాపబుల్ షో వీడియోలు సోషల్ మీడియాలో పెట్టేవారికి షాక్.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు

Waltair veerayya | వాల్తేరు వీరయ్య నుంచి మరో మాస్ సాంగ్ రిలీజ్.. నిజంగా ఫ్యాన్స్‌కు పూనకాలే

Prabhas | కృతిసనన్‌తో డేటింగ్‌పై ప్రభాస్‌ను ఇరుకున పెట్టిన బాలయ్య.. రెబల్ స్టార్ మనసులో మాట బయటపెట్టాడా?

Manchu Vishnu | బిగ్‌బాస్ హోస్ట్‌గా మంచు విష్ణు.. సర్‌ప్రైజ్ అవుతున్న ఫ్యాన్స్

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News