Saturday, April 20, 2024
- Advertisment -
HomeNewsAPChandrababu | చంద్రబాబు సభలో మరోసారి తొక్కిసలాట.. ముగ్గురు మహిళల మృతి.. పలువురి పరిస్థితి విషమం

Chandrababu | చంద్రబాబు సభలో మరోసారి తొక్కిసలాట.. ముగ్గురు మహిళల మృతి.. పలువురి పరిస్థితి విషమం

Chandrababu | కొత్త సంవత్సరం రోజే గుంటూరులో విషాదం నెలకొంది. నాలుగు రోజుల క్రితం కందుకూరు సభలో తొక్కిసలాట జరిగి 8 మంది మృతి చెందిన ఘటన మరువకముందే గుంటూరులో చంద్రబాబు సభలో మరోసారి తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

చంద్రన్న సంక్రాంతి కానుక వస్త్రాల పంపిణీలో ఈ తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. టీడీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సంక్రాంతి కానుకలు ఇస్తామంటూ 10 రోజులుగా టీడీపీ ప్రచారం నిర్వహిస్తోంది. దీంతో భారీ ఎత్తున కానుకల కోసం టీడీపీ సభకు మహిళలు వచ్చారు. చంద్రబాబు వచ్చి వెళ్లిన తర్వాత తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది.

తొక్కిసలాట జరిగిన ప్రదేశంలోనే ఒక మహిళ మృతి చెందగా.. మరో మహిళలు ఇద్దరు చికిత్స పొందుతూ మరణించారు. మృతుల్లో గోపిశెట్టి రమాదేవి, ఆసియాగా గుర్తించారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది.

నాలుగు రోజుల క్రితం నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన రోడ్‌ షోలో తొక్కిసలాట జరిగింది. 8మంది మృతి చెందారు. ప్రమాద ఘటనపై చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు చంద్రబాబు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

Follow Us : FacebookTwitter

Read More Articles:

Free Ration | తెల్ల రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఉచిత బియ్యం పంపిణీకి ఏపీ సీఎం జగన్ నిర్ణయం

SI, Constable Mains | ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల

Job notifications | తెలంగాణలో కొనసాగుతున్న కొలువుల జాతర.. న్యూఇయర్‌ ముందు మరో నాలుగు నోటిఫికేషన్లు జారీ

Accident | ఇద్దరి ప్రాణాలు తీసిన న్యూఇయర్ జోష్.. బంజారాహిల్స్‌లో కారు బీభత్సం

Corona | చైనాలో రోజుకు 9 వేల కరోనా మరణాలు.. మార్చినాటికి 100 కోట్ల మందికి వైరస్!

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News