Friday, April 26, 2024
- Advertisment -
HomeEntertainmentWaltair veerayya | వాల్తేరు వీరయ్య నుంచి మరో మాస్ సాంగ్ రిలీజ్.. నిజంగా ఫ్యాన్స్‌కు...

Waltair veerayya | వాల్తేరు వీరయ్య నుంచి మరో మాస్ సాంగ్ రిలీజ్.. నిజంగా ఫ్యాన్స్‌కు పూనకాలే

Waltair veerayya | మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా వస్తున్న లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య. బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ చాలా యంగ్‌గా కనిపిస్తున్నాడు. ముఖ్యంగా గ్యాంగ్ లీడర్ సినిమాలోని లుక్‌లో కనిపిస్తుండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. చాలా రోజుల తర్వాత మాస్ యాంగిల్‌లో రఫ్‌గా కనిపిస్తుండటంతో మెగా ఫ్యాన్స్ అన్నయ్యను ఎప్పుడెప్పుడు స్క్రీన్ మీద చూద్దామా అని ఆశపడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు ఆకట్టుకున్నాయి.

ఇటీవల విడుదలైన బాస్ పార్టీ, వీరయ్య టైటిల్ సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పైగా ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ నటించడంతో సినిమాకు మంచి హైప్ వచ్చింది. ఇందులో రవితేజ ఎలా కనిపించబోతున్నాడు? అతని పాత్ర ఎలా ఉంటుందనే క్యురియాసిటీ కూడా అభిమానుల్లో పెరిగిపోయింది. ఈ క్రమంలో దీన్ని మరింత పెంచుతూ మాస్ సాంగ్‌ను రిలీజ్ చేసింది వాల్తేరు వీరయ్య టీమ్.

డొంట్ స్టాప్ డ్యాన్సింగ్.. పూనకాలు లోడింగ్ ( Poonakaalu loading ) అంటూ సాగే ఈ పాట నిజంగానే మెగా అభిమానులకు పూనకాలు తెప్పిస్తుంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటకు మధ్య మధ్యలో చిరంజీవి, రవితేజ గొంతు కలిపారు. ఇద్దరూ కలిసి స్టెప్పులు వేశారు. అన్నయ్య సినిమా తర్వాత ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, రవితేజను చూస్తుండటంతో ఇద్దరి ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Avatar2 Collections | 11 రోజులకే అన్ని వేల కోట్లా.. కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తున్న అవతార్ 2..

Anupama Parameswaran | అమ్మో అనుపమ రెమ్యునరేషన్‌ ఒక్కసారిగా అంత పెంచేసిందా?

Prabhas | ప్రభాస్‌, సుకుమార్ కాంబినేషన్‌లో సినిమాపై క్లారిటీ వచ్చేసిందిగా..

Matti Kusthi in Ott | ఓటీటీలోకి వచ్చేస్తున్న మట్టి కుస్తీ.. స్ట్రీమింగ్ ఎప్పట్నుంచి అంటే..

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News