Thursday, July 25, 2024
- Advertisment -
HomeEntertainmentRashmika Mandanna | రష్మికకు కాంతారా డైరెక్టర్‌కు మధ్య గొడవలేంటి? ఎందుకు ఆమెను ట్రోల్‌ చేస్తున్నారు?

Rashmika Mandanna | రష్మికకు కాంతారా డైరెక్టర్‌కు మధ్య గొడవలేంటి? ఎందుకు ఆమెను ట్రోల్‌ చేస్తున్నారు?

Rashmika Mandanna – Rishab Shetty | నేషనల్‌ క్రష్‌ రష్మిక మంధనపై ఈ మధ్య ట్రోల్స్‌ ఎక్కువైపోయాయి. అవి ఎంతలా పెరిగిపోయాయంటే.. తనపై వస్తున్న విమర్శలను తట్టుకోలేక ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా స్పందించింది. ట్రోల్స్‌ వల్ల ఎంతగా బాధపడాల్సి వస్తుందో బాధతో తన మనసులోని మాటలను చెప్పుకొచ్చింది. అయితే ఇటీవల రష్మికపై ట్రోల్స్‌ ఎందుకు ఎక్కువయ్యాయి. మొన్న ఆ మధ్య కాంతార సినిమా రిలీజైనప్పుడు రష్మికపై ఓ రేంజ్‌లో ట్రోల్స్ వచ్చాయి. ఇప్పుడు కాంతార డైరెక్టమ్ కమ్ హీరో రిషబ్ శెట్టి చేసిన ఓ పోస్టుతో మరోసారి ట్రోల్స్ ఎక్కువయ్యాయి. ఇంతకీ రష్మికకు రిషబ్ శెట్టికి సంబంధమేంటి? ఎందుకు ఆమెను అంతలా ఆడుకుంటున్నారనే కదా అనుమానం..

అసలేమైందంటే.. రక్షిత్ శెట్టి హీరోగా రిషబ్ శెట్టి తెరకెక్కించిన కన్నడ చిత్రం కిరిక్ పార్టీ ఘన విజయం సాధించింది. 2016లో విడుదలైన ఈ చిత్రంతో రక్షిత్, రిషబ్ శెట్టి ఇద్దరికీ బ్రేక్ వచ్చింది. అప్పట్నుంచి కన్నడ ఇండస్ట్రీలో తిరుగులేకుండా దూసుకెళ్తున్నారు. ఇద్దరి కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా నిలిచిపోయిన ఈ చిత్రంలో రష్మిక కథానాయికగా నటించింది. ఈ సినిమా విడుదలై ఆరేండ్లు అవుతున్న సందర్భంగా రిషబ్ శెట్టి తన ఆనందాన్ని పంచుకున్నాడు. మా సినిమా విడుదలై ఆరేళ్లు అయినప్పటికీ.. మా కోసం మీరంతా చేసిన సందడి.. థియేటర్‌లో వేసిన విజిల్స్ అన్నీ మా చెవుల్లో మార్మోగుతున్నాయి. ఈ సెలబ్రేషన్స్ లో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అంటూ రిషబ్ శెట్టి ట్వీట్ చేశాడు. దీనికి హీరో రక్షిత్, పరంవా స్టూడియోస్, మ్యూజిక్ డైరెక్టర్ లోక్‌నాథ్‌ను ట్యాగ్ చేశాడు. ఈ సినిమాలో రష్మిక మంధన మెయిన్ రోల్‌లో నటించినప్పటికీ ఆమె గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. దీంతో రిషబ్ శెట్టి చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. రిషబ్ శెట్టి కావాలనే ఇలా రష్మికకు కౌంటర్ వేశాడని అంతా అనుకుంటున్నారు. దీనిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా వస్తున్నాయి.

రిషబ్ శెట్టి, రష్మిక మంధన మధ్య గొడవలు చాలా రోజులుగానే ఉన్నాయి. కాంతార సినిమా రిలీజ్ టైమ్‌లో ఇవి బయటపడ్డాయి. కన్నడ ఇండస్ట్రీలో చిన్న సినిమాగా వచ్చిన కాంతార పాన్‌ ఇండియా రేంజ్‌లో భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. అలాంటి సమయంలో కాంతార సినిమాను చూశారా అని మీడియా ప్రతినిధులు అడగ్గా.. ఇంకా లేదని రష్మిక సమాధానమిచ్చింది. ఇది ఆ టైమ్‌లో వైరల్‌గా మారింది.దీంతో నెటిజిన్లు ఆమెను విపరీతంగా ట్రోల్ చేశారు. అంతకుముందు తన కెరీర్ గురించి చెప్పిన రష్మిక కిరిక్ పార్టీ సినిమాతో ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్స్, బ్యానర్ గురించి మాట్లాడేందుకు ఇష్టపడలేదు. సమ్ బ్యానర్ అంటూ దాటవేసింది. కాంతార సినిమా కూడా చూడలేదని చెప్పింది. దీంతో రష్మికను నెటిజన్లు ఓ రేంజ్‌లో ఆడుకున్నారు.

రష్మికకు హీరోయిన్‌గా తొలి అవకాశం వచ్చింది కూడా కన్నడ ఇండస్ట్రీలోనే. కిర్రిక్‌ పార్టీ సినిమాతో రష్మిక హీరోయిన్‌గా మారింది. అన్నట్టు ఈ సినిమాకు దర్శకుడు ఎవరో తెలుసా.. రిషబ్‌ శెట్టి. కాంతార సినిమాకు హీరో కమ్‌ దర్శకుడు రెండూ ఈయనే. ఒక కన్నడ అమ్మాయి అయ్యి ఉండి.. కన్నడ ఇండస్ట్రీ గర్వించదగ్గ సినిమా వస్తే చూడవా? అది కూడా నిన్ను హీరోయిన్‌గా మార్చిన దర్శకుడి సినిమానే కదా? ఎందుకు చూడలేదు? కన్నడ సినిమాపై ఎందుకంత చిన్నచూపు ? అనే ఉద్దేశంలో ట్రోలర్స్‌ ఆడుకున్నారు. నీకు హీరోయిన్‌గా ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిన బ్యానర్ కూడా గుర్తులేదా అంటూ విమర్శలు చేశారు. అప్పుడు కూడా రష్మికకు రిషబ్ శెట్టి కౌంటర్ ఇచ్చాడు. రష్మికతో నటించాలనే ఉద్దేశం తనకు లేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇప్పుడు మరోసారి రష్మిక పేరు ప్రస్తావించకుండా ట్వీట్ చేయడంతో వీళ్ల వివాదం మరోసారి తెరమీదకు వచ్చింది.

Follow Us : FacebookTwitter

Read More Articles:

Poorna | తల్లి కాబోతున్న నటి పూర్ణ.. న్యూఇయర్‌ వేళ గుడ్‌న్యూస్‌ షేర్‌ చేసుకున్న మలయాళ బ్యూటీ

Unstoppable | అన్‌స్టాపబుల్ షో వీడియోలు సోషల్ మీడియాలో పెట్టేవారికి షాక్.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు

Waltair veerayya | వాల్తేరు వీరయ్య నుంచి మరో మాస్ సాంగ్ రిలీజ్.. నిజంగా ఫ్యాన్స్‌కు పూనకాలే

Prabhas | కృతిసనన్‌తో డేటింగ్‌పై ప్రభాస్‌ను ఇరుకున పెట్టిన బాలయ్య.. రెబల్ స్టార్ మనసులో మాట బయటపెట్టాడా?

Manchu Vishnu | బిగ్‌బాస్ హోస్ట్‌గా మంచు విష్ణు.. సర్‌ప్రైజ్ అవుతున్న ఫ్యాన్స్

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News