Friday, March 29, 2024
- Advertisment -
HomeEntertainmentPrabhas | కృతిసనన్‌తో డేటింగ్‌పై ప్రభాస్‌ను ఇరుకున పెట్టిన బాలయ్య.. రెబల్ స్టార్ మనసులో మాట...

Prabhas | కృతిసనన్‌తో డేటింగ్‌పై ప్రభాస్‌ను ఇరుకున పెట్టిన బాలయ్య.. రెబల్ స్టార్ మనసులో మాట బయటపెట్టాడా?

Prabhas | ప్రభాస్ ప్రేమ వ్యవహారం ఈమధ్య వైరల్‌గా మారింది. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్‌తో ప్రభాస్ రిలేషన్‌లో ఉన్నాడని ఇటీవల ఓ న్యూస్ బీటౌన్‌లో చక్కర్లు కొట్టింది. తొందరలోనే వీరి పెళ్లి జరగబోతుందని కూడా బాలీవుడ్ మీడియా పలు కథనాలు రాసింది. ఇవి చూసిన తెలుగు ప్రేక్షకులు షాకయ్యారు. అసలు కృతి సనన్‌( Kriti Sanon )తో ప్రభాస్ ప్రేమ ఏంటని ఆశ్చర్యపోయారు. అస్సలు నమ్మశక్యంగా కూడా లేదంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే ఇప్పుడు గాసిప్‌పై ప్రభాస్ క్లారిటీ ఇచ్చాడు.

ఆహాలో ప్రసారమవుతున్న అన్‌స్టాపబుల్ ( Unstoppable ) టాక్‌షోతో ఓటీటీలో కూడా నందమూరి బాలకృష్ణ ( Balakrishna ) తన విశ్వరూపం చూపిస్తున్నాడు. షోకి వచ్చిన గెస్టులతో కామెడీ చేస్తూనే వాళ్ల సీక్రెట్స్ బయటపెట్టిస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఈ షోకి ప్రభాస్ వచ్చాడు. ఇప్పటికే విడుదలైన టీజర్‌లు చూసిన ఫ్యాన్స్.. ఈ ఎపిసోడ్ మరో రేంజ్‌లో ఉంటుందని అంతా అనుకుంటున్నారు. దీనికి తగ్గట్టుగానే తాజాగా స్ట్రీమింగ్ అవుతున్న ఎపిసోడ్ ఫన్సీగా సాగింది. ఇందులో కృతిసనన్‌తో ఉన్న రిలేషన్‌ గురించి ప్రభాస్‌తో క్లారిటీ ఇప్పించాడు బాలయ్య.

ఇంతమంది హీరోయిన్లతో చేసినప్పుడు.. రాముడు సీతతోనే ఎందుకు రొమాన్స్‌లో పడ్డాడని కృతిసనన్ గురించి ప్రభాస్‌ను అడిగాడు బాలయ్య. దీనికి నవ్వుతూనే అదంతా పాత వార్త సర్.. ఏం లేదని వచ్చేసిందిగా అని ప్రభాస్ చెప్పాడు. అయినా బాలయ్య వదలకపోవడంతో మేడమ్ ఆల్రెడీ చెప్పేసిందిగా అంటూ దాటేసే ప్రయత్నం చేశాడు. వెంటనే అందుకున్న బాలయ్య అలా చెప్పించారా అని అడిగారు. అంతటితో ఆగకుండా మేడమ్ ఏంటి? అంత రొమాన్స్ ఏంటి? అని ప్రశ్నించాడు. తాను కూడా తన భార్య (వసుంధర)ను మేడమ్.. వసు మేడమ్ అనే పిలుస్తానంటూ చెప్పుకొచ్చాడు. నువ్వేమో నవ్వుతూ నో అంటున్నవ్.. ఆమె ఏమో సీరియస్‌గా చెబుతుంది.. సోషల్ మీడియాలో మాత్రం.. అని ప్రభాస్‌ మనసులో మాటను లాగే ప్రయత్నం చేశాడు. అప్పుడు దానికి ప్రభాస్ స్పందిస్తూ.. మీకు తెలియని ఏముంది సర్.. మీకు అలాంటివి ఎన్ని రాలేదంటూ నవ్వుతూ తప్పించుకున్నాడు. ఏం లేకపోయినా మాపై పుకార్లు పుట్టిస్తున్నారంటూ చెప్పుకొచ్చాడు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Avatar2 Collections | 11 రోజులకే అన్ని వేల కోట్లా.. కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తున్న అవతార్ 2..

Anupama Parameswaran | అమ్మో అనుపమ రెమ్యునరేషన్‌ ఒక్కసారిగా అంత పెంచేసిందా?

Prabhas | ప్రభాస్‌, సుకుమార్ కాంబినేషన్‌లో సినిమాపై క్లారిటీ వచ్చేసిందిగా..

Matti Kusthi in Ott | ఓటీటీలోకి వచ్చేస్తున్న మట్టి కుస్తీ.. స్ట్రీమింగ్ ఎప్పట్నుంచి అంటే..

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News