Home Entertainment Samantha | సమంతపై ఆ నిర్మాతకు అంత కోపం ఎందుకు? శాకుంతలం రిలీజ్ ముందు అంత...

Samantha | సమంతపై ఆ నిర్మాతకు అంత కోపం ఎందుకు? శాకుంతలం రిలీజ్ ముందు అంత దారుణంగా కామెంట్లు చేశాడేంటి?

Samantha Shaakuntalam | టాలీవుడ్‌లో సమంతకు మంచి ఇమేజ్ ఉంది. నాగచైతన్యతో విడాకుల తర్వాత తనపై వచ్చిన ట్రోల్స్‌ను తట్టుకుని నిలబడింది. మయోసైటిస్‌తో పోరాడి గెలిచింది. కెరీర్‌లో మళ్లీ బిజీ అయిపోయింది. ఎన్ని కష్టాలు వచ్చినా సరే ధైర్యంగా పోరాడుతున్న సమంతను చూసి అందరూ అబ్బురపడుతున్నారు. సామ్‌కు మంచి రోజులు రావాలని ఆశపడుతున్నారు. కానీ ఓ టాలీవుడ్ ప్రొడ్యూసర్ మాత్రం సమంత మీద మండిపడుతున్నాడు. శాకుంతలం సినిమా విడుదలకు ముందు ఆమె జ్వరంతో అస్వస్థతకు గురయ్యిందని ఫ్యాన్స్ అందరూ ఆమె కోలుకోవాలని మెసేజ్‌లు పెడుతుంటే.. ప్రముఖ నిర్మాట చిట్టిబాబు మాత్రం అదంతా డ్రామా అంటూ సీరియస్ అవుతున్నాడు. ప్రతిసారి డ్రామాలు వర్కవుట్ కావంటూ సమంతపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నాడు.

విడాకుల తర్వాత సమంత తన బతుకుదెరువు కోసం పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేసిందని చిట్టిబాబు సంచలన వ్యాఖ్యలు చేశాడు. హీరోయిన్ స్థాయి నుంచి పడిపోయాక చేతికి వచ్చినవి చేసుకుంటూ ముందుకెళ్లిందని.. అయినా హీరోయిన్‌గా సమంత కెరీర్ ముగిసిపోయిందని అన్నాడు. గతాన్ని వాడుకుని ముందుకెళ్లడమే ఇప్పుడు సమంత ముందు ఉన్న దారి అంటూ చులకనగా మాట్లాడాడు. సమంతకు మళ్లీ స్టార్‌డమ్ రాదని అన్నాడు. యశోద సినిమా టైమ్‌లో ఏడ్చి ఆ సినిమాను సక్సెస్ చేసుకోవాలని చూసిందని.. ఇప్పుడేమో చచ్చిపోయేలోపు ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని అనుకున్నా అని సమంత చెప్పిందని గుర్తు చేశాడు. ఎందుకీ డ్రామాలు ఆడుతున్నావు? ప్రతిసారి ఒకే సెంటిమెంట్ వర్కవుట్ కాదంటూ వ్యాఖ్యానించాడు.

కథ, పర్ఫార్మెన్స్ నచ్చితే సినిమా చూస్తారు తప్ప.. అయ్యో పాపం, ఆఖరి కోరిక అన్నట్లు మాట్లాడుతోందని ఎవరూ సినిమా చూడరని చిట్టిబాబు అన్నాడు. ఇవన్నీ పిచ్చివేషాలు అని ఎద్దేవా చేశాడు. సమంత ప్రతిసారి సెంటిమెంట్ డ్రామా క్రియేట్ చేస్తోందని అన్నాడు. అయినా హీరోయిన్ స్థాయి నుంచి పడిపోయిన అమ్మాయిని శాకుంతలం చిత్రానికి ఎలా సెలెక్ట్ చేశారనేది తన సందేహం అని ప్రశ్నించాడు. శాకుంతలం సినిమాపై తనకు ఏ మాత్రం ఆసక్తి లేదని చెప్పుకొచ్చాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Corona Cases | అమ్మో ! కరోనా మళ్లీ రెచ్చిపోతుందిగా.. ఒక్కరోజులోనే అన్ని వేల కేసులా?

GT vs PBKS | హర్దిక్‌ సేనకు మూడో విజయం.. పంజాబ్‌ కింగ్స్‌ను చిత్తుచేసిన గుజరాత్‌ టైటాన్స్‌

Palmistry | మీ అర చేతిలోని గీతలు కలిస్తే మీ అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు

Exit mobile version