Home Entertainment Avatar 2 first day collections | ఆ సినిమా కలెక్షన్స్‌ను దాటలేకపోయిన అవతార్‌ 2

Avatar 2 first day collections | ఆ సినిమా కలెక్షన్స్‌ను దాటలేకపోయిన అవతార్‌ 2

Avatar 2 first day collections | జేమ్స్‌ కామెరూన్‌ విజువల్‌ వండర్‌ అవతార్‌ 2 థియేటర్లలో రిలీజైంది. దాదాపు 13 ఏళ్ల తర్వాత వస్తున్న సీక్వెల్‌ కావడంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. దీనికి తగ్గట్టుగానే అడ్వాన్స్‌ బుకింగ్‌లు కూడా అయిపోయాయి. సినిమా థియేటర్లలోకి వచ్చి పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇంత హైప్‌తో వచ్చినప్పటికీ ఫస్ట్‌ డే కలెక్షన్ల విషయంలో ఓ సినిమాకు ఉన్న రికార్డును బ్రేక్‌ చేయలేకపోయింది.

అత్యధికంగా ఓపెనింగ్స్‌ దక్కించుకున్న ఆ సినిమా పేరు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనుకుంటా. మార్వెల్‌ సూపర్‌ హీరోస్‌ అందరూ కలిసి నటించిన అవెంజర్స్‌ ది ఎండ్‌ గేమ్‌. 2019లో వచ్చిన ఈ సినిమా భారత్‌లో ఇంగ్లీష్‌తో పాటు పలు స్థానిక భాషల్లో రిలీజైంది. ట్రేడ్‌వర్గాల లెక్కల ప్రకారం అవెంజర్స్ ది ఎండ్‌ గేమ్‌.. ఇండియాలో ఫస్ట్‌ డే ఏకంగా రూ.53 కోట్లు రాబట్టింది. కానీ శుక్రవారం విడుదలైన అవతార్‌ 2 సినిమా సుమారు 38 నుంచి 40 కోట్ల గ్రాస్‌ మాత్రమే రాబట్టింది. అంటే మూడేళ్ల క్రితం వచ్చిన సినిమా కంటే కూడా రూ.13 కోట్లు వెనుకబడిపోయింది అవతార్‌ 2. ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువే అనొచ్చు. ఎందుకంటే అవెంజర్స్‌ వచ్చినప్పటి కంటే కూడా ఇప్పుడు సినిమా టికెట్ల రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఏ లెక్కన చూసుకున్న అవెంజర్స్‌ ది ఎండ్‌ గేమ్‌ కలెక్షన్ల దారిదాపుల్లోకి కూడా అవతార్‌ 2 వెళ్లలేకపోయింది. ఇక ఇండియాలో భారీ ఓపెనింగ్స్‌ దక్కించుకునున్న హాలీవుడ్‌ చిత్రాల విషయానికొస్తే అవెంజర్స్‌ ఇన్ఫినిటీ వార్‌ ఫస్ట్‌ డే 31 కోట్లు, స్పైడర్‌మ్యాన్‌ నో వే హోమ్‌ 32 కోట్లు వసూలు చేశాయి.

అవతార్‌ కథ విషయానికొస్తే ఫస్ట్‌ పార్ట్‌లో పండోరా గ్రహంలోని విలువైన ఖనిజాలను దోచుకోవడానికి వచ్చిన మనుషులు వెళ్తారు. నావి తెగ నుంచి రహస్యాలు తెలుసుకోవడానికి అవతార్‌గా మారి వెళ్లిన జేక్‌.. వాళ్ల మంచితనం చూసి వాళ్లతో కలిసిపోతాడు. మనుషుల్ని ఎదురించి వారిని తిరిగి భూమిపైకి పంపిస్తాడు. సెకండ్‌ పార్ట్‌లో తనపై పగ తీర్చుకోవడానికి వచ్చిన మనుషుల టీమ్‌ నుంచి తప్పించుకునేందుకు మొట్కాయిని ప్రాంతానికి వెళ్తాడు. వాళ్లకు సముద్రమే సర్వస్వం. మరి వాళ్ల దగ్గరకు వెళ్లిన జేక్‌.. తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు? మనుషులను ఎలా ఎదురించాడనేది మిగతా కథ.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Avatar2 Review | అవతార్ 2 రివ్యూ.. జేమ్స్ కామెరూన్ మరోసారి మాయ చేశాడా?

Sundeep kishan – rejina cassandra | సందీప్ కిషన్‌తో రెజీనా ప్రేమాయణం.. టాలీవుడ్‌లో వైరల్‌గా మారిన పోస్టు..

Dil Raju | వారసుడు సినిమాకు విజయ్‌ ఫస్ట్‌ ఛాయిస్‌ కాదంట.. టాలీవుడ్‌ హీరోలు మిస్‌ చేసుకోవడంతో ఆఫర్‌ పట్టేశాడు

Atlee kumar | పెళ్లయిన 8 ఏళ్లకు తల్లిదండ్రులు అవుతున్న మరో సెలబ్రెటీ కపుల్‌

Exit mobile version