Home Latest News ODI world cup | 2023లో జరగనున్న వన్డే ప్రపంచకప్ టోర్నీ భారత్ నుంచి తరలిపోనుందా.....

ODI world cup | 2023లో జరగనున్న వన్డే ప్రపంచకప్ టోర్నీ భారత్ నుంచి తరలిపోనుందా.. కారణమిదేనా?

ODI world cup | వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్ టోర్నీ ( one day world cup ) భారత్ నుంచి తరలిపోనుందా..? అభిమానుల ఆశలు అడియాసలు కానున్నాయా? అంటే ప్రస్తుత పరిణామాలు చూస్తే నిజమేనని అంటున్నారు. 2023 అక్టోబర్-నవంబర్ మధ్య వన్డే ప్రపంచకప్‌కు భారత్ ఆథిత్యం ఇవ్వాల్సి ఉంది. అయితే వన్డే ప్రపంచకప్ వేదిక మారే అవకాశం ఉందంటున్నారు క్రీడా విశ్లేషకులు. ఇందుకు కారణం భారత ప్రభుత్వానికి పన్నుల చెల్లింపు విషయమే అని అభిప్రాయపడుతున్నారు.

భారత ప్రభుత్వానికి, బీసీసీఐ ( BCCI ) మధ్య పన్నుల వివాదం చాలా ఏళ్లుగా కొనసాగుతోంది. 2016లో టీ20 ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యం ఇచ్చినప్పుడు కూడా ఇదే సమస్య తలెత్తింది. పన్ను మినహాయింపులు ఇచ్చేందుకు భారత ప్రభుత్వం నిరాకరించింది. ఇప్పుడదే సమస్య ప్రపంచకప్‌ ఆతిథ్యానికి భారత్‌ను దూరం చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచకప్ టోర్నీలకు ఆతిథ్యం ఇచ్చే దేశాలు అక్కడి ప్రభుత్వం నుంచి పన్ను మినహాయింపులు పొందాలని ఐసీసీ ( ICC) గతంలోనే నిర్ణయించింది. అదే నిర్ణయం ఇప్పుడు అమలు కావాల్సిందేనని ఐసీసీ పట్టుబడుతోంది.

కానీ భారత ప్రభుత్వం మాత్రం ఎలాంటి స్పందన కనిపించడం లేదు. ఇదే విషయంలో వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్ కోసం భారత సర్కార్ నుంచి పన్ను మినహాయింపులు పొందాలని బీసీసీఐని ఐసీసీ కోరింది. గతంలో ఐసీసీ తీసుకున్న నిర్ణయం మేరకు పన్ను మినహాయింపులు పొందాలని సూచించింది. అయితే భారత ప్రభుత్వం నుంచి మాత్రం ఆశించిన స్థాయిలో స్పందన లేదు. దీంతో ఈ విషయంలో తాము కూడా ఏం చేయలేమని ఐసీసీకి బీసీసీఐ తేల్చి చెప్పిందని సమాచారం. కావాలంటే టోర్నీని భారత్‌లో కాకుండా మరో దేశంలో నిర్వహించుకోవచ్చంటూ సంకేతాలు కూడా ఇచ్చేసిందని సమాచారం. ఈ విషయం తెలిసిని క్రికెట్ అభిమానులు కలవర పడుతున్నారు. ప్రపంచకప్ టోర్నీని కళ్లారా చూద్దామనుకుంటే ఆశలు అడియాశలు అవుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

India Vs Bangladesh | ఆరంగేట్రం మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన బంగ్లాదేశ్ బ్యాటర్ జకీర్ హసన్.. విజయానికి 4 వికెట్ల దూరంలో భారత్

India Vs Bangladesh | బంగ్లాదేశ్‌ను కుప్పకూల్చిన భారత బౌలర్లు.. 150 పరుగులకే తొలిఇన్నింగ్స్‌లో ఆలౌట్

Lowest score in t20 match | టీ20 చరిత్రలోనే సంచలన రికార్డు.. 15 పరుగులకే ఆలౌట్‌

Exit mobile version