Home Entertainment Allu Arha | మహేశ్ బాబు సినిమాలో అల్లు అర్జున్ కూతురు స్పెషల్ రోల్

Allu Arha | మహేశ్ బాబు సినిమాలో అల్లు అర్జున్ కూతురు స్పెషల్ రోల్

Image Source : Twitter

Allu Arha | ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్‌లకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. టాలీవుడ్‌లో సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ కూడా అలాంటిదే. వీళ్లిద్దరి చేసిన అతడు, ఖలేజా సినిమాలు కమర్షియల్‌గా హిట్ కాలేవు. కానీ క్లాసికల్ చిత్రాలుగా నిలిచిపోయాయి. ఇప్పటికీ ఈ సినిమాలు టీవీలు టెలికాస్ట్ అయితే అదిరిపోయే టీఆర్పీని సొంతం చేసుకుంటాయి. అలాంటి ఈ కాంబినేషన్‌లో మళ్లీ సినిమా వస్తుందంటే కచ్చితంగా అందరి దృష్టి దానిపైనే ఉంటుంది. ఇప్పటికే సెట్స్‌పైకి వెళ్లిన ఈ సినిమా మహేశ్ బాబు ఇంట్లో విషాదం కారణంగా షూటింగ్ కొద్దిరోజులు వాయిదా పడింది. తాజాగా ఈ సినిమా రెండో షెడ్యూల్ మొదలైంది. ఈ సందర్బంగా ఒక క్రేజీ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.

మహేశ్ – త్రివిక్రమ్ సినిమాలో అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హ ఒక కీలక పాత్రలో నటించబోతుందని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అల్లు అర్హకు ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అప్పుడప్పుడు అల్లు అర్హ అల్లరి చేస్తున్న వీడియోలను బన్నీ సోషల్ మీడియాలో పెడుతుంటాడు. వీటితో అర్హకి మంచి క్రేజ్ వచ్చింది. దీంతో గుణశేఖర్ దర్శకత్వంలో సమంత నటిస్తున్న శాకుంతలం సినిమాలో చిన్నారి భరతుడి పాత్రలో నటించింది. ఈ సినిమా వచ్చే నెలలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో తమ సినిమాలోని ఓ పాత్రకు అల్లు అర్హ అయితేనే సెట్ అవుతుందని త్రివిక్రమ్ భావించాడు. దీంతో ఇదే విషయమై మహేశ్‌తో కలిసి వెళ్లి అర్జున్‌కు చెప్పాడు. త్రివిక్రమ్ మీద ఉన్న అభిమానంతో బన్నీ కూడా అల్లు అర్హ ఓకే చెప్పినట్టు సమాచారం. మరి ఈ క్రేజీ గాసిప్‌లో నిజమెంత ఉందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

మహేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో దాదాపు 12 ఏళ్ల తర్వాత వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. పెళ్లి సందD బ్యూటీ శ్రీలీల సెకండ్ హీరోయిన్‌గా ఎంపికైనట్టు సమాచారం.

Follow Us : FacebookTwitter

Read More Articles:

Outside food in cinema halls | సినిమా హాళ్లలోకి బయటి ఫుడ్‌ తీసుకెళ్లొచ్చా? లేదా? సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Tamanna Bhatia | నాని విలన్‌తో ప్రేమలో పడ్డ మిల్కీ బ్యూటీ .. బీ టౌన్‌లో న్యూస్‌ వైరల్‌.. సీరియస్ అవుతున్న తమన్నా ఫ్యాన్స్‌

Punarnavi | ఆ వ్యాధితో న్యూ ఇయర్ ప్రారంభిస్తున్నా.. ఎమోషన్ అయిన బిగ్‌బాస్ బ్యూటీ పునర్నవి

NTR 30 | ఎన్టీఆర్ 30పై ఆసక్తికరమైన అప్‌డేట్.. కొరటాలకు టెన్షన్ తప్పదా..?

Unstopabble with NBKS2 | పవన్ కళ్యాణ్ ను బాలకృష్ణ దాని గురించే ప్రత్యేకంగా అడిగారా..?

Hombale Films Journey | మూడు వేల కోట్లతో హోంబలే ఫిలింస్ భారీ ప్లాన్.. ఈసారి కేజీఎఫ్, కాంతారను మించిపోవాల్సిందే !

Samantha | జీవితం ఇంతకుముందులా లేదు.. వైరల్‌గా మారిన సమంత కామెంట్

Exit mobile version