Home Entertainment Vaarasudu Trailer | సోషల్ మీడియాను షేక్‌ చేస్తున్న వారిసు ట్రైలర్.. తెలుగులోనూ వచ్చేసింది !

Vaarasudu Trailer | సోషల్ మీడియాను షేక్‌ చేస్తున్న వారిసు ట్రైలర్.. తెలుగులోనూ వచ్చేసింది !

Vaarasudu Trailer & varisu trailer | తళపతి విజయ్‌ హీరోగా దిల్‌ రాజు తెరకెక్కించిన లేటెస్ట్‌ చిత్రం వారిసు. వంశీ పైడిపల్లి దర్శకుడు. తెలుగులో వారసుడు టైటిల్‌తో సంక్రాంతికి రిలీజ్‌ కానుంది. ఈ సినిమా గురించి కొద్దిరోజులుగా అటు తమిళనాట, ఇటు తెలుగు రాష్ట్రాల్లో చర్చ నడుస్తూనే ఉంది. దీనికి కారణం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమిళంలో అజిత్‌ సినిమాతో పోటీగా వారిసు రిలీజ్‌ అవుతుంది. తెలుగులో అయితే ఏకంగా మెగాస్టార్‌ చిరంజీవి వాల్తేరు వీరయ్య, నటిసింహం నందమూరి బాలకృష్ణ వీరసింహరెడ్డి సినిమాలకు పోటీగా వారసుడు వస్తుంది. రెండు చోట్ల కూడా ఈ సినిమాకు ఎక్కువ థియేటర్లు సంపాదించేందుకు దిల్‌ రాజు ప్లాన్ చేయడంతో వారిసులో అంతగా ఏం ఉండబోతుందని ఆడియన్స్‌ ఇంట్రెస్ట్‌ పెట్టారు. ఈ క్రమంలో తాజాగా వారిసు ట్రైలర్‌ రిలీజైంది.

తాజాగా విడుదలైన ట్రైలర్‌ను చూస్తుంటే వారిసు కంప్లీట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ అవుతుందని అనిపిస్తుంది. సంతోషంగా సాగిపోతున్న ఒక ఉమ్మడి కుటుంబంలో వచ్చిన సమస్యలను హీరో ఎలా చక్కదిద్దాడు? ప్రత్యర్థుల సవాళ్లను ఎలా తిప్పికొట్టాడనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కినట్టు ట్రైలర్‌ను చూస్తుంటే మనకు అర్థమవుతుంది. ఇల్లు అనేది ఇటుక, ఇసుకే రా వదిలేసి వెళ్లొచ్చు.. కుటుంబం అలా కాదు కదరా అనే డైలాగ్ సినిమా ఎలా ఉండబోతుందో చెప్పేస్తుంది. విజయ్‌ తన మార్క్‌ యాక్షన్‌, కామెడీతో అదరగొట్టాడు. రష్మిక కూడా అందంగా కనిపించింది. చాలావరకు సీన్స్‌ గతంలో చూసినట్టే ఉన్నప్పటికీ ట్రీట్‌మెంట్‌ మాత్రం కొత్తగా అనిపిస్తుంది. థమన్‌ సంగీతం కూడా బాగుంది. మొత్తంగా విజయ్‌ ఫ్యాన్స్‌కు తెగ నచ్చేలా అన్ని మాస్‌ ఎలిమెంట్స్‌ ఇందులో ఉన్నాయి. అందుకే వారిసు ట్రైలర్‌ విడుదలైన కొద్ది క్షణాల్లోనే యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా నిలిచింది. గంటలోనే మిలియన్‌ లైక్స్‌ సంపాదించింది. ఇక తెలుగు వారసుడు ట్రైలర్‌కు కూడా మంచి రెస్పాన్స్‌ వస్తుంది.

Follow Us : FacebookTwitter

Read More Articles:

Telangana Congress | టీ కాంగ్రెస్‌ ఇంఛార్జి బాధ్యతల నుంచి తప్పుకున్న మాణిక్కం ఠాగూర్‌.. త్వరలో కొత్త ఇంఛార్జి

Chitragupta Temple | హైదరాబాద్‌లో మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో చిత్రగుప్తుడి ఆలయం.. ఎక్కడ ఉందో తెలుసా?

Metro Station | ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ పైనుంచి దూకిన వృద్ధురాలు.. స్పాట్‌లోనే మృతి

Telangana IPS | తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. సీవీ ఆనంద్‌, స్టీఫెన్‌ రవీంద్రకు అదనపు బాధ్యతలు

Bandi Sanjay | యువతను బీజేపీకి దూరం చేసేందుకే నోటిఫికేషన్లు: బండి సంజయ్‌

Exit mobile version