Home Entertainment Rana Naidu | రానా నాయుడు ఎఫెక్ట్.. క్షమాపణలు చెప్పిన రానా

Rana Naidu | రానా నాయుడు ఎఫెక్ట్.. క్షమాపణలు చెప్పిన రానా

Rana Naidu | బాబాయ్ అబ్బాయిని ఒకేసారి తెరపై చూడాలనుకున్న దగ్గుబాటి ఫ్యాన్స్ ఆశ ఎట్టకేలకు తీరింది. వెంకటేశ్, రానా ఇద్దరూ కలిసి నటించిన రానా నాయుడు వెబ్ సిరీస్ రీసెంట్‌గా మార్చి 10న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. కానీ ఎన్నోరోజులుగా ఈ సిరీస్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది. ఎందుకంటే ఫ్యామిలీ హీరోగా పేరున్న వెంకటేశ్ ప్రధాన పాత్రలో వచ్చింది కాబట్టి కుటుంబసమేతంగా చూడాలని అంతా అనుకుంటారు. కానీ ఇది వెంకీ మార్క్ సినిమాలా లేదు. పక్కా అడల్ట్ మూవీలా ఉంది. దీంతో దగ్గుబాటి ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చెప్పుకొస్తున్నారు. ఫ్యాన్స్ నుంచి వస్తున్న నెగెటివిటీపై తాజాగా రానా స్పందించాడు. అందరికీ క్షమాపణలు చెప్పాడు.

ఇప్పటివరకు దగ్గుబాటి హీరోలు ఇద్దరూ ఒకే స్క్రీన్‌పై ఇలా కనిపించి అలా వెళ్లిపోయారు. తప్ప పూర్తిస్థాయిలో కలిసి నటించలేదు. దీంతో వీళ్లిద్దరూ కలిసి నటిస్తే చూడాలని దగ్గుబాటి ఫ్యాన్స్ కోరుకున్నారు. ఆ కోరిక రానా నాయుడు వెబ్ సిరీస్‌తో తీరింది. అమెరికన్ డ్రామా సిరీస్ రే డొనోవన్ ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్‌కు కరణ్ అన్షుమన్, సుప్రన్ వర్మ దర్శకత్వం వహించారు. తండ్రీకొడుకుల కథగా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. ఇందులో వెంకీమామ బోల్డ్ క్యారెక్టర్‌లో నటించారు. మసాలా సీన్స్, డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో ఈ సిరీస్ ఉంది. కొన్ని సీన్లలో బ్లూ ఫిల్మ్‌ను కూడా తలపిస్తోందని అభిమానులు అంటున్నారు. దీంతో ఫ్యామిలీ ఆడియన్స్ కలిసి చూసేలా ఈ వెబ్ సిరీస్ లేకపోవడంతో వాళ్లు ఇబ్బంది పడుతున్నారు.

ఆ సీన్స్ చూసిన తర్వాత వెంకీ డైహార్డ్ ఫ్యాన్స్ చాలా హార్ట్ అయ్యారు. ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి ఇమేజ్ ఉన్న వెంకటేశ్ ఇలాంటి సీన్స్‌లో నటించడమేంటని తప్పుబడుతున్నారు. వెంకీ మామను అలా ఊహించుకోలేకపోతున్నామని ట్వీట్స్ పెడుతున్నారు. ఈ క్రమంలో రానా స్పందించాడు. ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పాడు. ఈ సిరీస్‌ను కుటుంబంతో కాకుండా ఒంటరిగా చూడాలని సూచించారు. కాగా, క్రైమ్ యాక్షన్ డ్రామా సిరీస్‌లో ఈ వెబ్ సిరీస్ ట్రెండింగ్‌లో ఉండటం పట్ల రానా ధన్యవాదాలు కూడా తెలిపారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Gruha Lakshmi Scheme | గృహలక్ష్మి పథకం విధివిధానాలు ప్రకటించిన సీఎం కేసీఆర్‌.. దరఖాస్తులు ఎలా.. రూ.3లక్షలు ఎప్పుడు ఇస్తారు?

IND vs AUS | ఇరు దేశాల ప్రధానుల సమక్షంలో క్రికెట్‌ మ్యాచ్‌.. భారత్‌, ఆస్ట్రేలియా నాలుగో టెస్టు ప్రత్యేక అతిథులుగా మోదీ, ఆంటోని ఆల్బనీస్‌

Microsoft CEO Satya Nadella | కోడింగ్‌ రాకపోయినా సాఫ్ట్‌వేర్ జాబ్ చేయొచ్చు అంటున్న సత్య నాదెళ్ల.. ఎలా?

Telangana Cabinet | సొంత స్థలం ఉన్న వాళ్లకు రూ.3లక్షల సాయం.. కొత్త పథకం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

Telangana Cabinet | రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కేబినెట్ నిర్ణయాలు ఇవే..

Influenza | కాన్పూర్‌లో విపరీతంగా పెరుగుతున్న ఇన్ ఫ్లూ ఎంజా కేసులు.. ఎమర్జెన్సీ వార్డులు ఫుల్‌!

Traffic Challan | ప్రాణాలు తీసిన ట్రాఫిక్‌ చలాన్లు.. కట్టలేను సారు అన్నా వినలేదు.. హైదరాబాద్‌లో దారుణం!

Exit mobile version