Home Entertainment Shubra Aiyappa | 150 ఏళ్ల కిందటి ఇంట్లో సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న హీరోయిన్

Shubra Aiyappa | 150 ఏళ్ల కిందటి ఇంట్లో సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న హీరోయిన్

Shubra Aiyappa | నారా రోహిత్ హీరోగా వచ్చిన ప్రతినిధి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ శుభ్ర అయ్యప్ప సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంది. బెంగళూరుకు చెందిన బిజినెస్‌మ్యాన్‌ విశాల్ శివప్పతో ఏడడగులు వేసింది. 150 ఏళ్ల చరిత్ర ఉన్న ఓ పురాతన ఇల్లు వీరి వివాహానికి వేదిక అయ్యింది. ఇరు కుటుంబాల పెద్దలు, కొద్దిమంది బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలోనే గురువారం వీరి పెళ్లి జరిగింది. ఈ ఫొటోలను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేసిన శుభ్ర అయ్యప్ప తన పెళ్లి విషయాన్ని అభిమానులతో పంచుకుంది.

shubra-aiyappa

నేను, విశాల్ వివాహ బంధంలోకి అడుగుపెట్టాం. 150 ఏళ్ల చరిత్ర కలిగిన విశాల్ పూర్వీకుల ఇల్లు దొడ్డమనే మా పెళ్లికి వేదికైంది. ఇంతటి అద్భుతమైన ప్రదేశంలో ప్రియమైన వారి సమక్షంలో మా పెళ్లి జరగడం చాలా సంతోషంగా ఉంది అంటూ శుభ్ర అయ్యప్ప ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. ఈ పోస్టు చూసిన సినీ ప్రముఖులు, అభిమానులు నూతన దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. సినీ ప్రముఖులు ప్రణీత, శాన్వీ శ్రీవాస్తవ, సంయుక్త హెగ్డే, మహత్ రాఘవేంద్ర తదితరులు అభినందనలు తెలిపారు.

శుభ్ర అయ్యప్ప కర్ణాటకలోని కిడగు జిల్లాలో జన్మించింది. మోడలింగ్‌తో కెరీర్ మొదలుపెట్టిన శుభ్ర.. ప్రతినిధి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత సగప్తమ్ సినిమాతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అదే ఏడాది తన మాతృ ఇండస్ట్రీ అయిన కన్నడకు వెళ్లింది. శివరాజ్ కుమార్ హీరోగా వచ్చిన వజ్రకాయతో కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తిమ్మయ్య & తిమ్మయ్య సినిమాలో నటించింది. ప్రస్తుతం రమణ అవతార సినిమాలో నటిస్తోంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Priya Bhavani Shankar | డబ్బు కోసమే సినిమాలు చేస్తున్నా.. అయితే ఏంటి.. మీడియాపై హీరోయిన్‌ విసుర్లు

Rashmika Mandanna | డైరెక్టర్ దెబ్బకు దిగొచ్చిన రష్మిక.. వాళ్ల వల్లే ఇక్కడ ఉన్నానంటూ పొగడ్తలు

Jacqueline Fernandez | అతను నా జీవితాన్ని నాశనం చేశాడు.. నరకంలో పడేశాడు.. కన్నీళ్లు పెట్టుకున్న జాక్వెలిన్ ఫెర్నాండేజ్

Tamannah Bhatia | ఆ సీన్స్‌లో నటించేందుకు హీరోయిన్ల కంటే హీరోలే ఎక్కువ భయపడతారు.. మిల్కీ బ్యూటీ తమన్నా సెన్సేషనల్ కామెంట్స్

PVR Cinemas | రూ.99కే మూవీ టికెట్.. పీవీఆర్ సినిమాస్ బంపర్ ఆఫర్..

Exit mobile version