Home Lifestyle Health covid19 | కరోనా సోకిన వాళ్లు 18 నెలల వరకు జాగ్రత్తగా ఉండాల్సిందే.. లేదంటే ప్రాణాలకే...

covid19 | కరోనా సోకిన వాళ్లు 18 నెలల వరకు జాగ్రత్తగా ఉండాల్సిందే.. లేదంటే ప్రాణాలకే ముప్పు

covid19 | ఏడాది కాలంగా సైలెంట్‌గా ఉన్న ప్రపంచం చైనాలో కరోనా విజృంభన తర్వాత మరోసారి ఉలిక్కిపడింది. కొత్త వేరియంట్ల విషయంలో ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తమయ్యాయి. తాజాగా కోవిడ్‌కు సంబంధించి అధ్యయం ఇప్పుడు గుబులు రేపుతోంది.

కోవిడ్ సోకిన తర్వాత కనసీం 18 నెలల వరకు మరణించే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరించారు. యూరోపియన్ సొసైటీ ఆప్ కార్డియాలజీ జర్నల్ ప్రచురించిన కార్డియో వాస్కులర్ పరిశోధనలో ఈ విషయం తేలింది. అ అధ్యయనంలో దాదాపు లక్షా 60 వేల మంది పాల్గొన్నారు. కోవిడ్ సోకని వారితో పోలిస్తే సోకిన వారిలో హృదయ సంబంధ సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.

దీర్ఘకాలికంగా ఉండే కోవిడ్ ఇన్ఫెక్షన్ వల్ల హృదయ సంబంధ వ్యాధులు పెరుగుతున్నట్లు అధ్యయనంలో తేలింది. కరోనా వల్ల తీవ్ర అనారోగ్యానికి గురైన వాళ్లను కనీసం ఏడాదిన్న పాటు పర్యవేక్షించాలని పరిశోధనాలు సూచిస్తున్నాయని అధ్యయనంలో పాల్గొన్న నిపుణులు తెలిపారు. కరోనా వచ్చి కోలుకున్న వారు హృదయ సంబంధ వ్యాధులతో మరణించే అవకాశం మొదటి 3 వారాల్లో 81 రెట్లు అధికంగా ఉందన్నారు. ఆ తర్వాత 18 నెలల వరకు కూడా ఐదు రెట్లు ఎక్కువగా ఉందని గుర్తించారు. ఈ అధ్యయనం ప్రకారం హృదయ సంబంధ వ్యాధులతో పాటు తీవ్ర అనారోగ్య సమస్యలతో మరణించే ప్రమాదం ఉందని తెలిపారు.

అధ్యయనం ప్రకారం మయోకార్డియల్ ఇన్‌ఫెక్షన్, కరోనరీ హార్డ్ డిసీజ్, హార్ట్ ఫెయిల్యూర్, డీప్ వెయిన్ థ్రాంబోసెస్‌తో పాటు స్వల్ప, దీర్ఘకాలిక హృదయ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ అధ్యయనం కరోనా మొదటి వేవ్ సమయంలో నిర్వహించారు. దీనిపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని నిపుణులు తెలిపారు.

ప్రస్తుతం ఒమిక్రాన్ ఉప వేరియంట్ బీఎఫ్ 7 చైనాతో పాటు దేశాల్లో విజృంభిస్తోంది. భారత్ లోని ఈ వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. కానీ ఎటువంటి మరణాలు సంభవించలేదని రోజువారీ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు. శుక్రవారం 134 కొత్త కేసులు నమోదయ్యయాయి. ఇక కోవిడ్ బారిన పడి మరో 170 మంది కోలుకున్నట్లు తెలిపారు. అటు ఒమిక్రాన్ కొత్త వేరియంట్ చైనా, జపాన్ లో ఎక్కువగా ఉంది. అక్కడ మరణాల సంఖ్య కూడా ఎక్కువే.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Breaking News | పడవ మునిగి 145 మంది జలసమాధి.. ఓవర్‌లోడ్ వల్లే ప్రమాదం !

Fire Accident | సికింద్రాబాద్ అగ్రిప్రమాదం ఘటనలో ముగ్గురు సజీవ దహనం.. బిల్డింగ్ కూల్చివేతపై నిర్ణయం తీసుకోనున్న అధికారులు

Fire Accident | సికింద్రాబాద్ అగ్రిప్రమాదం ఘటనలో ముగ్గురు సజీవ దహనం.. బిల్డింగ్ కూల్చివేతపై నిర్ణయం తీసుకోనున్న అధికారులు

Kamareddy Master Plan | కామారెడ్డి, జగిత్యాల మాస్టర్ ప్లాన్ రద్దు.. రైతుల ఆందోళనకు తలొగ్గిన సర్కార్

Exit mobile version